రంగారెడ్డి

రాజ్యాధికారంతోనే బిసిలకు న్యాయం: కృష్ణయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, మార్చి 26: రాజ్యాధికారంతోనే బిసిలకు న్యాయం చేకూరుతుందని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. ఆదివారం కర్నాటకలోని చించోళ్ళీ తాలుకా సులేపేట్‌లో నిర్వహించిన బిసి సదస్సుకు హాజరై తిరుగు ప్రయాణంలో తాండూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చట్టసభల్లో బిసిలకు 50శాతం రిజర్వేషన్లు సాధించే వరకు తమ పోరాటం ఆగదన్నారు. యావత్ దేశంలోనే అగ్రగామిగా ఉన్న బిసి వర్గాలకు రాజకీయంగా అన్యాయం జరుగుతూనే ఉందని చెప్పారు. అన్ని రంగాలలో బిసిలు వెనకబాటు తనంలో మగ్గుతున్నట్లు పేర్కొన్నారు. బిసిలను అన్ని పార్టీలవారు ఎన్నికల ముందు తమ ఓట్ల రాజకీయం కోసం పావులుగా వాడుకుంటున్నట్లు తెలిపారు. బిసి వర్గాలు కుళ్లుకుతంత్రాల మయమైన రాజకీయుల కళ్లబొల్లి మాటలకు మోసపోయే రోజులు పోయాయని అన్నారు. 2014 ఎన్నికలలో చంద్రబాబు తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే బిసి నాయకుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించేందుకు ఎమ్మెల్యేగా పోటీ చేసినట్లు తెలిపారు. కాగా వచ్చే 2019 ఎన్నికల్లో పోటీ చేసేది, లేనిది ఇప్పుడే చెప్పలేమని అన్నారు. కాగా తెలంగాణ సాధనలో బిసి వర్గాల రాష్ట్ర సాధన పోరాటం ఉన్నతమైనదని పేర్కొన్నారు.
నేడు తెలంగాణ పాలకులు బిసిలకు తీరని అన్యాయం చేస్తున్నట్లు విమర్శించారు. ఎమ్మెల్యేగా చట్టసభలో బిసిల అభ్యున్నతి కోసం పోరాటం చేస్తునే ఉన్నట్లు, ఇటీవల బిసి వర్గంలో అగ్రగామిగా ఉన్న కురుమ గొల్ల యాదవులకు గొర్రెలు పెంపకానికీ సబ్సిడీ రుణాలు సాధించటంలో విజయం సాధించామని అన్నారు. బిసి విద్యార్థులకు ఉపకార వేతనాల పెంపు, ఫీజు రీయింబర్స్‌మెంట్ సాధిస్తామని చెప్పారు. బిసి రిజర్వేషన్లు కుదింపు, ఇతర కులాలు, మతస్థులకు బిసి రిజర్వేషన్లలో కోత విధించి అమలు పర్చుతామంటే, బిసి రిజర్వేషన్లకు ఎలాంటి అవరోధాలు కల్పించినా చూస్తూ ఊరుకునేది లేదన్నారు. రాబోయే ఎన్నికల నాటికి తెలంగాణ ప్రభుత్వం, సిఎం కెసిఆర్.. బిసిలకు ఇచ్చిన వాగ్ధానాలు అన్నింటిని అమలు పరచాలని, లేదంటే బిసి సంఘాలు మరో మహోద్యమానికి సిద్ధమవుతారని కృష్ణయ్య హెచ్చరించారు. మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.

ఏడేళ్ల చిన్నారి అపహరణ, అత్యాచారం
తాండూరు, మార్చి 26: నేరాలు ఘోరాలకు అశాంతియుత వాతావారణానికి నిలయంగా మారిన తాండూరు పట్టణంలో శనివారం రాత్రి మరో దారుణం చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్న ఈ దారుణ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి. పట్టణ శివారు తాండూరు మండలం ఎల్మకనే్న గ్రామానికి చెందిన దళిత కుటుంబానికి చెందిన ఓ ఏడేళ్ల బాలిక తన అవ్వ మహాదేవమ్మతో కలిసి శనివారం సాయంత్రం తాండూరు జిల్లా ఆసుపత్రిలో వైద్య చికిత్సల కోసం ఆశ్రయించారు. కాగా ఏడేళ్ల చిన్నారి ఆకలి వేయడంతో ఏడుపు మొదలెట్టింది. దాంతో బాలిక అవ్వ మహాదేవమ్మ ఓదార్చుతుండగా, ఆసుపత్రి ఆవరణలో సంచరిస్తున్న ఓ గుర్తు తెలియని యువకుడు.. బాలిక ఏడుస్తోందని, అమ్మాయికి ఏమైనా కొనిపెడతానంటూ అవ్వ మహాదేవమ్మకు నచ్చజెప్పి బాలికతో ఉడాయించాడు. అనంతరం బాలిక అవ్వ, తల్లి లక్ష్మీ బంధువులు.. అమ్మాయిని గుర్తుతెలియని దుండగులు అపహరించిన విషయం గ్రహించి లబోదిబోమంటూ జిల్లా ఆసుపత్రి ఆవరణతోపాటు, పట్టణంలోని పలు ప్రాంతాలలో వెతకటం మొదలు పెట్టారు. కాగా అర్థరాత్రి 1.30 గంటల సమయంలో బాలికను దుండగులు తాండూరు - మహబూబ్‌నగర్ రహదారిలోని రైల్వేఫ్లై ఓవర్ బ్రిడ్జి దగ్గర నిర్జన ప్రదేశంలో వదిలివెళ్లారు. అప్పటికే దారుణానికి గురైన అమ్మాయి తీవ్ర రక్తస్రావంతో స్పృహ కోల్పోయి ఉండటాన్ని ఆ చుట్టూ ప్రక్కల ప్రజలు, మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది.. బాలిక ములుగుతున్న శబ్ధం విని గుర్తించారు. కాగా వెనువెంటనే బాలికను తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్సల అనంతరం తెల్లవారుఝామున 3.30గంటలకు హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రికి మెరుగైన వైద్య చికిత్సల కోసం తరలించారు. బాలిక మేనమామ మ్యాదరి రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు, రాత్రి సమాచారం అందిన వెంటనే ఐడి పార్టీ పోలీసులను రంగంలోకి దించినట్లు తాండూరు డిఎస్పీ రామచంద్రుడు ఆదివారం సాయంత్రం వెల్లడించారు.
కాగా మైనర్ బాలికలపై అత్యాచారం ఘటనలు విన్న తాండూరు పట్టణ పరిసరాల ప్రజలు, మహిళలు.. ఏడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం సంఘటన ఇప్పుడే వింటున్నామని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని తాండూరు మహిళా సంఘాల ప్రతినిధులు విజయలక్ష్మీ పండిత్, జ్యోతి డిమాండ్ చేస్తున్నారు. వారం పది రోజులుగా పట్టణంలోని సాయిపూర్, మాణిక్‌నగర్ ఏరియాలకు చెందిన పదేళ్లలోపు మైనర్ బాలికలపై ఇలాంటి అత్యాచార దురాగతాలు జరిగినట్లు సమాచారం. ఈ సంఘటనలతో తాండూరు పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు తమ చిన్నారుల్ని స్కూళ్లకు సైతం పంపడానికి భయపడుతున్నట్లు పేర్కొంటున్నారు.