రంగారెడ్డి

ఫీ‘జులుం’ నియంత్రించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మార్చి 27: ప్రైవేటు విద్యాసంస్థల్లో అధిక ఫీజులను నియంత్రించి, వౌలిక వసతుల కల్పనతో పాటు నాణ్యమైన విద్యను అందించేలా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దుబ్బాక విష్ణువర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం జంట పురపాలక సంఘాలైన పీర్జాదిగూడ, బోడుప్పల్ కమిటీ కార్యవర్గ సమావేశం జరిగింది. అధ్యక్షుడు ఎడవెల్లి రఘువర్ధన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు శ్రీనివాస్, రాజశేఖర్‌రెడ్డి, మల్లెల సంతోష్, గీత, అభిలాష్, జైపాల్‌రెడ్డి పాల్గొని ప్రైవేటు విద్యాసంస్థల తీరుపై భగ్గుమన్నారు. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు పాఠశాలలో వౌలిక వసతులు కల్పించకుండానే ఇరుకైన గదులలో విద్యాబోధన చేస్తూ మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. చట్టవిరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌ను విక్రయిస్తూ దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలకు కల్పించిన ఉచిత విద్యను అమలు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలో కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్యను అమలు చేస్తామంటున్న ప్రభుత్వం.. ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీపై ఎందుకు నిఘా పెట్టడంలేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ విద్యాశాఖ కళ్లుతెరిచి నిబంధనలను ఉల్లంఘించే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిచో బిజెపి ఆధ్వర్యంలో ప్రజాందోళన చేపడతామని విష్ణువర్ధన్‌రెడ్డి హెచ్చరించారు.

విద్యార్థి దశలో కష్టపడితేనే బంగారు భవిష్యత్తు

మేడ్చల్, మార్చి 27: విద్యార్థి దశలో కష్టపడితేనే భవిష్యత్తు బంగారుమయంగా ఉంటుందని మల్కాజిగిరి ఎంపి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం కండ్లకోయ గ్రామ పరిధిలో గల సిఎంఆర్ సెట్ 15వ వార్షికోత్సవం ఆదివారం రాత్రి ‘కార్పేడియం 2కె17’ పేరుతో ఆట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపి మల్లారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడేతత్వాన్ని అలవర్చుకోవాలని అదే విజయానికి సోపానం వంటిదని వివవరించారు. ప్రపంచంలో ఏ రంగాన్ని తీసుకున్నా మన దేశానికి చెందినవారే ఉంటారని, మన దగ్గర ఉన్న 60 శాతం యువశక్తి గొప్ప వరమని పేర్కొన్నారు. యువత తమ శక్తి సామర్థ్యాలను వృథా చేయకుండా అవకాశాలను అందిపుచ్చుకుని నూతన ఒరవడుల ఆవిష్కరణకు కృషి చేయాలని సూచించారు. వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్ ఎంవి రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం కాకుండా ఎంటర్‌ప్రైన్యూర్‌గా ఎదగడం కళాశాలకు కొలమానం కావాలని సూచించారు. విద్యార్థులు ఉన్నతంగా ఎదిగి ఉద్యోగాలను, సంపదను సృష్టించాలని అకాంక్షించారు. తమలోని శక్తియుక్తులను ధారపోసి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా అకట్టుకున్నాయి. లేజర్‌షో నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, ప్రముఖ నేపథ్య గాయకుడు హేమచంద్ర తన బృందంతో ఆలపించిన గీతాలు విద్యార్థులను ఉర్రూతలూగించాయి. కార్యక్రమంలో సిఎంఆర్ విద్యాసంస్థల కార్యదర్శి సిహెచ్ గోపాల్‌రెడ్డి, నగర ట్రాఫిక్ డిసిపి రంగనాథ్, హెచ్‌ఆర్‌డి శివాజీ బిశ్వాస్, మల్కాజిగిరి ఎమ్మెల్యే కనకారెడ్డి, డిటిఓ పుప్పాల శ్రీనివాస్, ఎసిపి శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ నరేందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ జంగారెడ్డి, రామలింగారెడ్డి పాల్గొన్నారు.

తాండూరులో భయం భయం
* చిన్నారులపై అఘాయిత్యాలపట్ల ఆందోళనలు
* పోలీస్ యంత్రాంగానికి సవాల్‌గా మారిన వైనం
తాండూరు, మార్చి 27: అభం శుభం తెలియని చిన్నారులపై సభ్య సమాజం తల దించుకునే రీతిలో అఘాయిత్యాలకు పాల్పడుతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయ. గతంలో ఎన్నడూ లేని విధంగా తాండూరు ప్రాంతంలో కనివినీ ఎరుగని విధంగా చిన్నారులపై దారుణాలకు పాల్పడుతున్న దుర్మార్గుల ఉదంతాలతో జనం బెంబేలెత్తుతున్నారు. తాండూరు డివిజన్‌లో పసికందులను, చిన్నారులను తొమ్మిది నెలలు మోసి కన్న సొంత తల్లిదండ్రులే అనాథలుగా రోడ్డు పాల్జేసిన సంఘటనలపై ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి దురాగతాలు గతంలో ఎరగమంటూ చిన్నారుల తల్లి దండ్రులు వాపోతున్నారు. పిల్లల్ని స్కూళ్ళకు పంపేందుకు జనం జంకుతన్నారంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చెప్పకనే చెబుతున్నాయ. కాగా, తాండూరు పోలీస్ యంత్రాంగానికి చిన్నారులపై గుర్తుతెలియని దుండగుల అఘాయిత్యాల సంఘటనలు మరో సవాల్‌గా మారింది.