రంగారెడ్డి

ఫుట్‌బాల్ క్రీడాకారులకు శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంద్రాయణగుట్ట, మార్చి 27: అక్టోబర్ మాసంలో ఫిఫా వరల్డ్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఫుట్‌బాల్ క్రీడను అభివృద్ధి పరిచేందుకు విస్తృతంగా టోర్నమెంట్‌లను నిర్వహిస్తోంది. ముందుగా రాష్ట్ర స్థాయిలో.. అనంతరం దేశంలోని ఆరు జోన్‌లలో టోర్నమెంట్‌లను నిర్వహించి ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను వెలికితీసి ప్రత్యేక శిక్షణనివ్వనున్నారు. హైదరాబాద్ నగరంలో మొత్తం ఎనిమిది మంది ఫుట్‌బాల్ క్రీడాకారులు ఒలింపియన్‌లుగా ఉండటం హైదరాబాద్‌కు ఎంతో గర్వకారణం. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్టస్థ్రాయి ప్రైమ్ మినిస్టర్ అండర్-19 ఫుట్‌బాల్ టోర్నమెంట్ మే 1వ తేదీ నుంచి 10 వరకూ హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తారు. సోమవారం లాల్‌బహదూర్ స్టేడియంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో టోర్నమెంట్ వివరాలను శాట్స్ చైర్మన్ అలీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, ఎండి ఎ.దినకర్‌బాబు, ఒలింపిక్ సంఘం తెలంగాణ అధ్యక్ష, కార్యదర్శులు రంగారావు, ఎస్‌ఆర్ ప్రేంరాజ్.. సిఐఎస్‌ఎఫ్ అధికారులు జగ్బీర్‌సింగ్, విక్రమ్, ఎంఆర్ నాయక్‌తో కలిసి వెల్లడించారు. పది రోజుల పాటు జరుగనున్న ఈ టోర్నమెంట్‌లో మొత్తం బాలబాలికల విభాగంలో మొత్తం ఎనిమిది జట్ల చొప్పున పాల్గొంటున్నాయి. టోర్నమెంట్‌లో తెలంగాణ స్కూల్ గేమ్స్ సమాఖ్య (ఎస్‌జిఎఫ్), కేంద్రియ విద్యాలయ పబ్లిక్ స్కూల్ జట్లు పాల్గొననున్నాయి. జోనల్‌తో పాటు రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న టోర్నమెంట్‌లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి ప్రైజ్‌మనీని అందజేస్తారు. సమావేశంలో తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం అధ్యక్షుడు మహ్మద్ ఆలీరఫత్, కార్యదర్శి జిపి పాల్గుణ తదితరులు పాల్గొన్నారు.

అధికారుల సమన్వయంతో సమస్యల పరిష్కారం
కీసర, మార్చి 27 :గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అధికారులు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని పరిష్కారం దిశగా ముందుకు సాగాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవి రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. గత శుక్రవారం ప్రత్యేక అధికారులు గ్రామాల్లో సందర్శంచినప్పుడు ఎదురైన సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారో తెలపాలంటూ అధికారులను కోరారు. ఘట్‌కేసర్‌లో ఆర్‌అండ్‌బిరోడ్డు రేలింగ్ ప్రమాదంతో దెబ్బతిందని, ప్రత్యేక అధికారి పేర్కొన్నారు. వెంటనే మరమ్మతులు చేయాలని ఆర్‌అండ్‌బి ఎఇని కలెక్టర్ ఆదేశించారు. ఘట్‌కేసర్‌లో మరో అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరారు. గ్రామాల్లో బెల్ట్‌షాపులు పూర్తిగా తొలగించాలని కలెక్టర్ తెలిపారు. మద్యం షాపుల బయటనే మందుబాబులు మద్యం సేవిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని, దీన్ని వెంటనే ఎక్సైజ్ అధికారులు అరికట్టాలని అన్నారు. మిషన్ భగీరథ పనులతో దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయాలని అధికారులను కోరారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని రికార్డులు పరిశీలించాలని అధికారులను వివరించారు. గ్రామాల్లోని రేషన్ దుకాణాలు శుక్రవారం బదులు మంగళవారం బంద్ నిర్వహించాలని తెలిపారు. తగు ఆదేశాలు జారీ చేయాలని డిఎస్‌ఓను ఆదేశించారు. ఏప్రిల్ 1న జరిగే జిల్లా పరిషత్ సమావేశానికి ఎజెండా ప్రకారం నివేదిక అందజేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జెసి ధర్మారెడ్డి, డిఆర్‌ఓ సురేందర్‌రావు, డిపిఓ సురేశ్‌మోహన్ పాల్గొన్నారు.
డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
జిల్లాలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవి రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఛాంబర్‌లో డబుల్ బెడ్‌రూం ఇళ్ల పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తుర్కపల్లి, యాద్‌గార్‌పల్లి, చీర్యాల్, కీసర, చెంగిచెర్ల, ఫిర్జాదిగూడలలో వివిధ దశలలో ఉన్న ఇళ్ల నిర్మాణానాలను వేగవంతం చేసి సకాలంలో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ఇతర ప్రాంతాల్లో మంజూరైన ఇళ్ల నిర్మాణాల టెండరు ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని తెలిపారు. నిర్మాణాలకు సంబంధించి ఇసుక, సిమెంటు తదితర సామగ్రికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి రెవెన్యూ, హౌసింగ్ అధికారులతో కూడిన కమిటీ సమావేశమై చర్యలు తీసుకోవాలని అన్నారు. మీ-సేవ కేంద్రాల్లో లబ్ధిదారులు తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉన్నందున, అధికారులు నమోదు ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిఆర్‌ఓ సురేందర్‌రావు, ఆర్‌అండ్‌బి ఇఇ రెహమాన్, ఆర్‌డిఓలు మధుసూదన్, హన్మంత్‌రెడ్డి, లా అధికారి సురేశ్‌కుమార్, ఆర్‌డబ్లుఎస్ ఇఇ వెంకటస్వామి, హౌసింగ్ డిఇ నరేందర్ పాల్గొన్నారు.