రంగారెడ్డి

రూ. 400 కోట్లతో మంచినీటి సరఫరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, మార్చి 27: రూ. 400 కోట్లతో శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇస్తామని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం తారానగర్‌లోని టిఆర్‌ఎస్ కార్యాలయం వద్ద శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్‌యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్‌పర్సన్ రాగం సుజాతయాదవ్, శేరిలింగంపల్లి కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి, గచ్చిబౌలి కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబ, నియోజకవర్గ సీనియర్ నేత మొవ్వ సత్యనారాయణతో కలిసి సభ్యత్వ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రూ. 1900 కోట్లతో నగర శివారు ప్రాంతాల్లో, రూ. 2000 కోట్లతో పూర్వ రంగారెడ్డి జిల్లా పరిధిలో తాగునీటి రిజర్వాయర్ల నిర్మాణం, కొత్త పైపులైన్ల పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ రాష్ట్రంలోనే అభివృద్ధిలో ముందంజలో ఉన్న నియోజకవర్గంలో భారీ స్థాయిలో పార్టీ సభ్యత్వం చేయించి మొదటి స్థానంలో నిలపాలని కోరారు. శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్‌యాదవ్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో ముందు వరసలో ఉన్న శేరిలింగంపల్లి డివిజన్‌ను మరింత అధివృద్ధి చేయడానికి సహకరించాలని మంత్రిని కోరారు.
పాత నోట్ల డిపాజిట్‌తో నోటీసులు పొందినవారు
పిఎజికెవైని సద్వినియోగం చేసుకోవాలి

వికారాబాద్, మార్చి 27: బ్యాంకుల్లో రద్దయిన నోట్లను డిపాజిట్ చేసి ఇన్‌కంట్యాక్స్ శాఖ నుండి నోటీసులు అందుకున్నవారంతా ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇన్‌కంట్యాక్స్ అదనపు కమిషనర్ ఎస్.శ్రీనివాస్ సూచించారు. సోమవారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో మాట్లాడుతూ నవంబర్ 8న రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో బ్యాంకులో డిపాజిట్ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు ఇచ్చామని గుర్తుచేశారు. డిపాజిట్ల సమయంలో ఐదు లక్షల నుండి నాలుగైదు కోట్ల వరకు పాత నోట్లను జమ చేశారని చెప్పారు. వాటిని నిశితంగా పరిశీలిస్తే కొందరు సరైన లెక్కలు చూపలేకపోయారని తెలిపారు. అలా చూపని వారికి నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న వారు పిఎంజికెవై పథకం మార్చి 31తో ముగుస్తున్నందున ఆ పథకంలో భాగస్వాములు కావాలని అన్నారు. జమ చేసిన డబ్బులో 50 శాతం పన్ను పోగా మిగిలిన 25శాతం డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీని పేదల పథకాలకు వినియోగిస్తారని, నాలుగేళ్ల తర్వాత తీసుకోవచ్చని, మిగతా 25 శాతం డబ్బు ఖాతాలో ఉంటుందని వివరించారు. పథకాన్ని వినియోగించుకోని యెడల ఏప్రిల్ నుండి చర్యలు ఉంటాయని, ప్రభుత్వం కొత్త నిబంధనలు తెస్తోందని స్పష్టం చేశారు. వికారాబాద్ కార్యాలయంలో పరిధిలో 20 నుండి 25 కోట్లకు సంబంధించి 100కుపైగా నోటీసులు ఇచ్చామని, రేంజ్-8 పరిధిలో 1200 నోటీసులు ఇచ్చామని వివరించారు. వికారాబాద్ ఇన్‌కంట్యాక్స్ ఆఫీసర్ యు.కళ్యాణ్‌కుమార్, ఇన్‌స్పెక్టర్ పి.శ్రీనివాస్, సూపరింటెండెంట్ టి.పురుషోత్తంరావు పాల్గొన్నారు.

ప్రజావాణి, దిన పత్రికల్లో వచ్చిన వార్తలకు
స్పందించాలి: కలెక్టర్

కీసర, మార్చి 27: ప్రజావాణిలో, నిత్యం దినపత్రికల్లో వచ్చే వార్తలకు అధికారులు తక్షణమే స్పందించాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవి రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. డిపిఓ, డిఎంహెచ్‌ఓ, డిఆర్‌డిఓ, విద్యుత్ తదితర శాఖల ఫిర్యాదులు పెండింగ్‌లో ఉంటున్నాయని, వాటిని పరిష్కరించి ఫిర్యాదుదారులకు సమాచారం పంపాలని కలెక్టర్ కోరారు. ఏ శాఖకు అయితే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయో, ఏఏ అంశంపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయో పరిశీలించి, ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదులు తగ్గేలా క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా అధికారులు తమ కార్యాలయాల పరిధిలో విస్తృత తనిఖీలు చేయాలని కోరారు. దినపత్రికల్లో వచ్చిన ప్రతికూల వార్తలపై అదే రోజు వివరణ ఇవ్వాలని అన్నారు. డిపిఓ, విద్యుత్, విద్యా, సంక్షేమ శాఖలపై ప్రతికూల వార్తలు వస్తున్నాయని, వీటిపై స్పందించాలని వివరించారు.