రంగారెడ్డి

హరహర మహాదేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కులకచర్ల, మార్చి 28: పాంబండ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా అగ్నిగుండాల కార్యక్రమం మంగళవారం తెల్లవారుఝామున ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో కులకచర్ల రక్షకభటులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎర్రటి నిప్పులపై అనేకమంది భక్తులు ఉదయానే్న స్నానమాచరించి శివాభిషేకం నిర్వహించాక హరహర మహాదేవ అంటూ ఆలయం నుంచి ఊరేగింపుగా అగ్నిగుండం నిర్వహించే వరకు వచ్చి నిప్పులపై నడిచారు. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ అగ్నిగుండాల్లో భక్తులు నడుస్తుంటే తిలకించేవారు వారి పాదాలకు నమస్కరించేందుకు పోటీలు పడ్డారు. అనంతరం అగ్నిగుండంలోని బూడిద కోసం కూడా తొక్కిసలాటే జరిగే సూచనలు కనిపించడంతో రక్షకభటులు వారించి అందరికి అందేలా చూశారు. అనంతరం అగ్నిగుండాలను తిలకించేందుకు వచ్చిన భక్తులు ఆలయంలోని రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి జాతరలో నిమగ్నమయ్యారు.

చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టిన
ఆగంతుకుడు ఎక్కడ?
తాండూరు, మార్చి 28: తాండూరు పట్టణ, పరిసర ప్రజలు గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. పట్టణ పరిసరాల్లో అందరి నోట ఇదే మాట. జిల్లా ఆస్పత్రిలో వైద్యం కోసం వచ్చిన అవ్వ మహదేవమ్మ వెనక వచ్చిన ఏడేళ్ల చిన్నారిని మాయమాటలతో అపహరించుకుపోయన ఉదంతం జరిగి నాలుగు రోజులైంది. కాగా, ఇంతవరకు నిందితుడి ఆచూకీ లభించలేదు. కాగా, చిన్నారిని అపహరించింది ఎంతమంది అన్న సందేహాలు స్థానికుల్లో వ్యక్తవౌతు న్నాయ. కాగా, వారం పది రోజుల క్రితం స్థానిక మాణిక్‌నగర్ నుండి 15 ఏళ్ళ బాలికను అపహరించుకు వెళ్ళిన సంఘటనతో పాటు, పట్టణంలోని సాయిపూర్ ప్రాంతంలో మరోబాలికపై అఘాయిత్యం జరిగిన సంఘటన వెలుగు చూసింది. కాగా, గత శనివారం రాత్రి పట్టణ పరిసర ప్రాంతం తాండూరు మండలం ఎల్మకనే్న గ్రామానికి చెందిన మహదేవమ్మ తన ఏడేళ్ళ మనవరాలితో కలిసి జిల్లా ఆస్పత్రిలో వైద్యం కోసం ఆస్పత్రిని ఆశ్రయించింది. ఆస్పత్రి ఆవరణలో ఉండగా మనవరాలు ఆకలి అవుతుందని ఏడవటంతో అమ్మాయి మామ మ్యాథరి రమేష్ తాను ఇంటి నుండి టిఫిన్ తెస్తానంటూ బయటకు వెళ్ళాడు అంతలోనే వీరిని గమనించిన గుర్తు తెలియని దుండగుడు వారితో మాటలు కలిపి అమ్మాయి ఆకలితో ఏడుస్తోంది కదా, అంటూ చిన్నారి అవ్వకు చెప్పి బాలికకు హోటల్‌లో టిఫిన్ ఇప్పిస్తానంటూ తీసుకు వెళ్ళాడు. కాగా ఇంటి నుండి టిఫిన్ తెచ్చిన బాలిక మామ రమేష్ అమ్మాయి గురించి ఆరా తీయగా గుర్తు తెలియని యువకుడు హోటల్‌కు తీసుకుపోయి ఇంకా తిరిగి రాలేదని తెలిపింది. దాంతో వారు జిల్లా ఆస్పత్రి ఆవరణతో పాటు, పట్టణంలో పలు ఏరియాల్లో వెతికినా ఫలితం కానరాలేదు. దాంతో ఈవిషయం పట్టణ పోలీసులకు సమాచరం అందింది. పోలీసులు సైతం సంఘటన జరిగిన శనివారోం అర్ధరాత్రి నుంచి ముమ్మర గాలింపు చేపట్టారు. కాగా, చిన్నారి, అవ్వ మహదేవమ్మ ఆస్పత్రిలో చికిత్సల కోసం పోద్దుపోయాక ఏందుకు వచ్చింది, జిల్లా ఆస్పత్రిలో ఆమె వైద్య చికిత్సలు పోందినట్లు ఎలాంటి రిపోర్టు, కేర్ షీట్ రికార్డులు లేవు అనే వాదనలు వినపడుతున్నాయి. కాగా, శనివారం గుర్తు తెలియని దుండగుడు చిన్నారి (వౌనిక)ని పట్టణంలోని రైల్వే ఫ్లైవోవర్ బ్రిడ్జి ప్రాంతంలో వదిలేసి ఉడాయించాడు. కాగా, చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడి ఆచూకీ ఇంతవరకు లభించక పోవడంపట్ల పట్టణ ప్రజల ఆందోళనలతోపాటు, స్థానిక పోలీస్ యంత్రాంగం వేటను ముమ్మరం చేశారు.
ఇప్పటికే ఒకరిద్దరు అనుమానితులను పోలీసులు తమ నిర్భంధంలోకి తీసుకొని విచారించినట్లు సమాచారం. కాగా ఆరు నూరైనా బుధవారం సాయంత్రానికి ఈ కేసు మిస్టరీని చేధించాలనే పట్టుదలతో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.