రంగారెడ్డి

నకిలీ పత్రాలతో స్థలాల కబ్జా: ముఠా రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, మార్చి 28: నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లను కబ్జా చేసి అమ్ముకుంటున్న ఓ ముఠాను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ జగదీశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. సరూర్‌నగర్ జల్‌పల్లికి చెందిన వాదేయి ముస్త్ఫా కాలనీకి చెందిన ఇర్ఫాన్ మర్ఫానీ, అదే ప్రాంతానికి చెందిన ఇమ్రాన్, అక్బర్, డానియెల్, హబీబ్ ఉమర్ జిలానీ అలియాస్ పాషా, హబీబ్ అలీ జిలానీ, చార్మినార్ సుల్తాన్ షాహీకి చెందిన సూర్యప్రకాష్, శ్రీను, ఇంతియాజ్, మహ్మద్ నరుూమ్ నాసర్, సయ్యద్ జబర్ అలియాస్ చాంద్ బాయ్, ఇర్ఫాన్ హుస్సేన్ లు ఓ ముఠాగా ఏర్పడి ఖాళీ స్థలాలను కబ్జా చేసి నకిలీ పత్రాలను సృష్టించి అమ్ముకుంటున్నారు. ఇదే క్రమంలో శాస్ర్తిపురంలోని సర్వే నెంబర్ 130/20 ఓపెన్ స్థలం(507/2) 250 గజాల స్థలంపై కన్నుపడింది. ప్లాట్‌కు నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేశారు. పాతబస్తీ లాల్‌దర్వాజకు చెందిన స్వామి శరణంకు చెందిన స్థలం. కాగా కబ్జా చేసిన ముఠా సభ్యులు స్థలం తమదేనని, స్వామి శరణం నకిలీ యజమాని అని కేసు పెట్టారు. పోలీసులు విచారణ చేపట్టి 13 మంది నకిలీ యజమానులుగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా గుట్టురట్టు చేశారు. ప్లాట్ అసలు యజమాని స్వామి శరణం పేరుమీద ఆధార్‌కార్డు, ఓటర్‌కార్డు, పాన్‌కార్డులను నకిలీ సృష్టించి రిజిస్ట్రేషన్ చేసి వేరే వారికి అమ్మారు. గుర్తించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటికే కబ్జాదారులు ప్లాట్ మాదేనని బుకాయించి, స్వామి శరణంపై ఫిర్యాదు చేశారు. ముఠా సభ్యులే అసలు నేరస్థులను గుర్తించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో 11 మంది పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. వారిని రిమాండ్‌కు తరలించామని పోలీసులు వివరించారు.

బాలికపై బురిడీ బాబా లైంగిక వేధింపులు
జీడిమెట్ల, మార్చి 28: ఓ బురిడీ బాబా బ్లాక్ మెయిల్‌తో మహిళతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ ఓ బాలిక పై లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సిఐ డివి రంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... గుడివాడకు చెందిన శ్రీ్ధర్‌రావు, శిరీషతో 1997లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు. వీరి మధ్య గొడవల నేపథ్యంలో శిరీష మరొకరితో అక్రమ సంబంధం కొనసాగిస్తుందన్న విషయం బట్టబయలైంది. వనస్థలిపురంకు చెందిన మధుకిరణ్ (30)తో శిరీషకు పరిచయం ఏర్పడిన క్రమంలో తన కుటుంబంలో తరుచూ గొడవలు జరుగుతున్నాయని చెప్పగా శ్రీశైలం శైవక్షేత్రంలో పూజలు చేస్తానని మంచి జరుగుతుందని నమ్మబలికి శిరీషను లోబరుచుకున్నాడు. శిరీషతో అక్రమ సంబంధం కొనసాగిస్తూనే అంతటితో ఆగకుండా ఇద్దరు కూతుళ్లపై మధుకిరణ్‌కు కన్నుపడింది. బాలిక పై మధుకిరణ్ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు గురిచేశాడు. తండ్రి శ్రీ్ధర్‌రావు ఫిర్యాదు మేరకు పోలీసులు మధుకిరణ్‌తో పాటు ప్రోత్సహించిన శిరీష, అమ్మమ్మ సీతామహాలక్ష్మిల పై కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.