రంగారెడ్డి

పనుల పురోగతిపై మంత్రి సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెపిహెచ్‌బికాలనీ, మార్చి 28: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు సమస్యలపై మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మంచినీటి సమస్య, అసంపూర్తి పనులు, రిజర్వాయర్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
10 నుండి 15 రోజులకు ఒకసారి మంచినీరు సరఫరా అయ్యే పరిస్థితి మెరుగుపడేవిధంగా చర్యలు తీసుకోవాలని, పైపులైన్ పనులు త్వరగా పూర్తి చేసి శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు దాహార్తిని తీర్చాలన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో 5 రిజర్వాయర్లు ప్రజలకు అందుబాటులోకి తెచ్చేవిధంగా తేదిలు నిర్ణయించాలన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పథకం కోసం చేపట్టిన కార్యక్రమానికి టెండర్లు పిలవడం జరిగిందని ఇంకా 20 ఎకరాలు శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, చందానగర్, మాదాపూర్, హపీజ్‌పేట్‌లలో స్థలాలను చూపించడం జరిగిందని అదీ కాకుండా ఎల్లమ్మబండ సర్వేనెం.336లో ఆరు ఎకరాలు జరిగిందన్నారు.
వీటన్నింటికి తొందరలో టెండర్లు పిలిపించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. అనంతరం ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పేద ప్రజలకు న్యాయం జరిగేవిధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు.
నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

దళితులకు భూపంపిణీపై శ్రద్ధ అవసరం
* జిల్లా కలెక్టర్ దివ్య సూచన
వికారాబాద్, మార్చి 28: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూమిలేని ఎస్సీలకు భూ పంపిణీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళేందుకు తహశీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని వికారాబాద్ కలెక్టర్ డి.దివ్య సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జాయింట్ కలెక్టర్ సురేష్ పొద్దార్‌ను కలిసి భూమి కొనుగోలు, రైతుల ఆత్మహత్యలు, రుణ అర్హత కార్డులు, హరితహారం, డంపింగ్ యార్డులు, శ్మశానవాటికలకు స్థలాల గుర్తింపు తదితర అంశాలపై తహశీల్దార్లతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నాటికి మండలానికి 20 ఎకరాల భూమిని నిరుపేద ఎస్సీలకు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని తహశీల్దార్లను ఆదేశించారు. గ్రామాల్లో భూములను అమ్మడానికి ముందుకు వస్తున్న వారి భూములను పరిశీలించి సాగుకు ఉపయోగపడే విధంగా ఉందా? లేదా? అనేది స్వయంగా క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలించాలని చెప్పారు. ముందుగా పూర్తిగా భూమి లేని నిరుపేదలను గుర్తించి భూమిని ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులుంటే.. లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. భూముల గుర్తింపు ప్రక్రియను ఏప్రిల్ ఐదు, ఆరు తేదీల్లోగా పూర్తి చేయాలని అన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో గ్రామ సభల ద్వారా రుణ అర్హత కార్డులకు సంబంధించిన వారిని ఎంపిక చేయాలని సూచించారు. ఇప్పటికే రుణాలు పొందనివారికి రెన్యువల్ చేయాలని చెప్పారు.
నూతనంగా దరఖాస్తులు చేసుకున్న వారికి సైతం ఏప్రిల్ నెలాఖరులోగా కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రుణ అర్హత కార్డులు అందజేసేందుకు ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని పేర్కొన్నారు. హరితహారంలో మొక్కలు నాటేందుకు ముందస్తుగా స్థలాలను గుర్తించాలని గ్రామాల వారీగా లక్ష్యాలను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఇప్పటినుండే గుంతలు సిద్ధం చేసుకుంటే జూన్, జూలైలో మొక్కలు నాటడం సులభమవుతుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చనిపోయిన వారి జాపకార్థం ప్రతి గ్రామంలో స్మృతివనం ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని వివరించారు. మొక్కలు అధిక సంఖ్యలో నాటేందుకు ప్రభుత్వ బీడు భూములను ఎంపిక చేయాలని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లోనూ మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎంపిడివోలు, తహశీల్దార్లు సమన్వయంతో పనిచేస్తే కార్యక్రమం విజయవంతమవుతుందని స్పష్టం చేశారు. జిల్లాలోని 367 గ్రామ పంచాయతీల్లో డంపింగ్‌యార్డుల ఏర్పాటుకు స్థలాలను గుర్తించాలని పేర్కొన్నారు. ఉపాధిహామీ కింద శ్మశానవాటికలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను వెనువెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమీక్షలో వికారాబాద్ ఆర్డీవో విశ్వనాథం, డిఎస్‌సిడివో మోహన్‌రెడ్డి, కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీనివాస్, తహశీల్దార్లు పాల్గొన్నారు.