రంగారెడ్డి

ప్రతి ఒక్కరికీ వ్యాయామం తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంద్రాయణగుట్ట, మార్చి 30: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా మెలగాలంటే వ్యాయామం చేయాల్సిందేనని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ(శాట్స్) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎ.దినకర్‌బాబు అన్నారు. నగరంలో రోజురోజుకూ పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గురువారం దినకర్‌బాబు సికింద్రాబాద్ సైనిక్‌పురిలోని తన నివాసం నుండి ఐఎఎస్ అధికారి స్థాయిలో ఉండి సైకిల్‌పై లాల్‌బహదూర్ స్టేడియంలోని శాట్స్ కార్యాలయానికి వచ్చి పలువురి మన్ననలు పొందారు. వెస్ట్రన్ కంట్రీలో సైకిల్ వినియోగాన్ని అధికంగా వాడుతున్నారని, ఇది మన దేశంలో కూడా పాపులర్ కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి అవసరాల నిమిత్తం సైకిల్‌పై వెళ్లడం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని చెప్పారు. తాను ఒక సంస్థకు అధికారిగా ఉన్నప్పటికీ వారంలో రెండు రోజులు సైకిల్‌పై ఆఫీసుకు వచ్చి వెళ్తున్నానని, దీన్ని ప్రతి ఒక్కరూ అదర్శంగా తీసుకోవాలని కోరారు. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శాట్స్‌కు సంబంధించిన ప్లేగ్రౌండ్‌లు, స్టేడియాల్లో ఏప్రిల్ 15 నుంచి మే 31 వరకు 45 రోజుల పాటు బాలబాలికలు వివిధ క్రీడాంశాల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని చిన్నారుల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారికి నచ్చిన క్రీడల్లో శిక్షణి ఇప్పించేందుకు శాట్స్ వేసివి క్రీడా శిక్షణ శిబిరాల్లో చేర్పించాలని కోరారు. సైనిక్‌పురి నుండి లాల్‌బహదూర్ స్టేడియం వరకు 17 కిలోమీటర్ల దూరం సైకిల్‌పై వచ్చిన శాట్స్ విసి, ఎండిని చైర్మన్ అలీపురం వెంకటేశ్వర్‌రెడ్డి అభినందించారు. నేటి యువతరం కూడా సైకిల్‌ను అధికంగా వాడేందుకు ప్రయాత్నించాలని తద్వారా వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో శాట్స్ డిప్యూటీ డైరెక్టర్ శోభా, రమణ పాల్గొన్నారు.

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ స్థల పరిశీలన
ఘట్‌కేసర్, మార్చి 30: ఘట్‌కేసర్ మండల కేంద్రంలో నిర్మించనున్న ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు నిర్మాణ స్థలాన్ని మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి గురువారం పరిశీలించారు. మండల కేంద్రంలోని అవుటర్ రింగ్‌రోడ్డు సమీపంలోని ప్రభుత్వ స్థలంలో నిర్మించనున్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం స్థలాన్ని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో పాటు ఆర్‌అండ్‌బి, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. క్యాంపు కార్యాలయాన్ని నిర్మించే స్థలం అవుటర్ రింగ్‌రోడ్డుకు ఆనుకుని ఉన్నందున ప్రజలు సందర్శించేందుకు అనుకూలంగా ఉంటుందా? సమస్యాత్మకంగా ఉంటుందా? అని అధికారులతో సంప్రదింపులు జరిపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలకు అనుకూలంగా ఉంటుందని నిర్ణయించారు. స్థల పరిశీలన జరిపిన వారిలో ఆర్‌అండ్‌బి ఇఇ రాయమల్లునాయక్, డిఇ ధర్మారెడ్డి, ఎఇ బాలునాయక్, తహశీల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపిపి బండారి శ్రీనివాస్‌గౌడ్, జడ్పీటిసి మంద సంజీవరెడ్డి, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు బైనగారి నాగరాజు, సింగిల్‌విండో డైరక్టర్ బొక్క ప్రభాకర్‌రెడ్డి, నాయకులు కందుల కుమార్ ఉన్నారు.