రంగారెడ్డి

వంటగ్యాస్ రాయితీని వదులుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, మార్చి 30: నాయకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వంటగ్యాస్ రాయితీని వదులుకొని పేదలకు బాసటగా నిలవాలని, తాను కూడా రాయితీని వదులుకున్నానని ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి అన్నారు. గురువారం మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయంలో సమావేశ మందిరంలో ఎంపిపి విజయలక్ష్మీ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని మండలంలోని 15 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ పథకం కింద చెక్కులను అందజేశారు. నగర పంచాయతీ పరిధిలో 128 మంది లబ్ధిదారులకు దీపం పథకం కింద వంటగ్యాస్ సిలిండర్‌లను అందజేశారు. పేదల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలతో పాటు నాయకులు కూడా తమకు తోచిన విధంగా సహయపడాలని కోరారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తుందని దీనిని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నిరుపేద కుటుంబాలపై ఆడపిల్లలు భారం కాకుడదని సిఎం కెసిఆర్ ఎన్నికల మెనిఫెస్టోలో హమీ ఇవ్వకున్నా కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌లాంటి బృహత్తరమైన పథకాలను ప్రవేశపెట్టి అమలుచేస్తూ వారి వివాహలు సజావుగా సాగేందుకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారని ఏప్రిల్ 1వ నుండి ప్రభుత్వం ఈ పథకం కింద రూ.51వేలకు బదులుగా రూ.75వేలకు పెంచి అందించనుందని వివరించారు. ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యునతే ధ్యేయంగా ముందుకుసాగుతుందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.35వేల కోట్లతో రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్న ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదని అన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపిడిఓ దేవసహయం, ఎఎంసి చైర్మన్ సత్యనారాయణ, సర్పంచ్ రాజమల్లారెడ్డి, నాయకులు భాస్కర్ యాదవ్, మల్లికార్జున్, విష్ణు, శివకుమార్, మర్రి నర్సింహ్మరెడ్డి, మోహన్‌రెడ్డి, మల్లేశ్, పానుగంటి రవీందర్ పాల్గొన్నారు.