రంగారెడ్డి

లారీల సమ్మెతో నిలిచిన రవాణా వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, ఏప్రిల్ 2: లారీల సమ్మెతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. సమ్మె ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. దీంతో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, కేశంపేట, ఫరూఖ్‌నగర్, కొందుర్గు, చౌదరిగూడ మండలాలతోపాటు షాద్‌నగర్ పట్టణంలో లారీల సమ్మెతో రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. నియోజకవర్గంలో సుమారు 500లారీలు నిలిచిపోవడంతో అటు పరిశ్రమలు ఇటు వ్యాపారవేత్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నాలుగు రోజుల నుండి లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రజలు తంటాలు పడుతున్నారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఎక్కువగా ఉండటం, ఇక్కడి నుండి ఇతర ప్రాంతాలకు సరుకులు ఎగుమతి చేస్తుండేవారు. కానీ, లారీల సమ్మెతో ఎక్కడి సరుకులు అక్కడే నిలిపోయాయి. దీంతో భారీ స్థాయిలోనే నష్టాలు వచ్చినట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్‌ను తక్షణమే రద్దు చేయాలని లారీ యజమానులు డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం అవేమి పట్టించుకోవడం లేదు. దీంతో లారీ యజమానులు సమ్మెకు దిగడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ప్రతి నెల 1న సంబంధిత రేషన్ షాపులకు సరుకులు రావాల్సి ఉన్నప్పటికీ సమ్మెతో ఆలస్యం జరిగింది. ఇతర రాష్ట్రాల నుండి లారీలను తీసుకువచ్చి సరుకులను రవాణా చేస్తున్నట్లు స్థానిక లారీ యజమానులు పేర్కొంటున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టించేశారు. సమ్మెను దృష్టిలో పెట్టుకొని వ్యాపారస్థులు ఇప్పటికే ధరలు పెంచినట్లు సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతానికి కర్ణాటక, తమిళనాడు మహారాష్ట్రాల నుండి ఎక్కువగా నిత్యావసర సరుకులు దిగుమతి అవుతుంటాయి. ఈ ప్రాంతం నుండి హైదారాబాద్, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. సమ్మె ప్రభావంతో ఎక్కడికక్కడే లారీలు నిలిచిపోయాయి.
డిమాండ్లు పరిష్కరిస్తేనే సమ్మె విరమిస్తాం
* లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సాధిక్
థర్డ్‌పార్టీ ఇన్సురెన్స్‌ను రద్దు చేయడంతోపాటు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకూ లారీల సమ్మె విమరించే ప్రసక్తి లేదని షాద్‌నగర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ సాధిక్ డిమాండ్ చేశారు. లారీ యజమానులకు టోల్‌గేట్లలో మినహాయింపు చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించే వరకూ ఎన్నిరోజులైనా సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
సమస్యలను పరిష్కరించాలి
కొడంగల్: మూడు రోజులుగా లారీ యాజమానులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఆదివారం కొడంగల్‌లో లారీలను నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. లారీల యాజమానుల సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి కొడంగల్‌కు వచ్చిన లారీలను సైతం నిలిపివేసి మద్దతుగా నిలిచారు.

ఆరుగురు తహశీల్దార్‌ల నియామకం

హైదరాబాద్, ఏప్రిల్ 2: రంగారెడ్డి జిల్లాలో ఆరుగురు తహశీల్దార్‌లను నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు ఉత్తర్వులను జారీ చేశారు. ప్రభుత్వం ఇద్దరు డిప్యూటీ కలెక్టర్‌లు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సెక్షన్ ఆఫీసర్స్ ట్రైనీ తహసీల్దార్‌లను రంగారెడ్డి జిల్లాకు నియమించడంతో వారికి కలెక్టర్ ఉతర్వులు జారీ చేశారు. సెక్రెటరియేట్‌లో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డిప్యూటీ కలెక్టర్ జి.సురేశ్‌కుమార్‌ను శంషాబాద్ తహశీల్దార్‌గా నియమించారు. అక్కడ పనిచేస్తున్న తహశీల్దార్ డి.నిర్మలను రాజేంద్రనగర్ తహశీల్దార్‌గా బదిలీ చేశారు. సెక్రటరియేట్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డిప్యూటీ కలెక్టర్ కె.రామారావును ఫారూఖ్‌నగర్ (షాద్‌నగర్) తహశీల్దార్‌గా నియమించారు. ప్రస్తుతం పనిచేస్తున్న తహశీల్దార్ బి.చందర్‌రావును రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు.
ల్యాండ్ రికార్డ్స్ అండ్ సర్వే సెటిల్‌మెంట్స్ కమిషనరేట్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఎంఎ అజీజ్‌ను షాబాద్ మండల తహశీల్దార్‌గా నియమించారు. అక్కడ పనిచేసిన ఎ.ఉషాకిరణ్‌ను కందుకూరు డివిజన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాకు కేటాయించిన ముగ్గురు ట్రైనీ తహశీల్దార్‌లు రెండు సంవత్సరాల పాటు ఈ స్థాయిలో విధులు నిర్వహిస్తారు.