రంగారెడ్డి

ఉద్యమంలా బడిబాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, ఏప్రిల్ 3: ప్రజల సహకారంతో బడిబాట కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవి రెడ్డి, ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కీసర మండలం చీర్యాలలోని జిల్లా పరిషత్ పాఠశాలలో జ్యోతి వెలిగించి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఉన్నత పదవుల్లో ఉన్నవారంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారేనని తెలిపారు. విద్యార్థులు చక్కగా చదువుకొని అన్ని రంగాల్లో రాణించాలని తెలిపారు. బడిబాట కార్యక్రమాన్ని పవిత్ర ఉద్యమంలా భావించి, బడి బయట ఉన్న చిన్నారులను బడిలో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరేలా ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో.. ప్రైవేట్ పాఠశాలల్లో కంటే మెరుగైన సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తోందని పేర్కొన్నారు. విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, సన్నబియ్యంతో అన్నం, యూనిఫాం అందిస్తున్నామని తెలిపారు. గ్రామంలోని ప్రధాన రహదారుల వెంట విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డిఇఓ ఉషారాణి, ఎంపిపి సుజాత, తహశీల్దార్ వెంకట ఉపేందర్‌రెడ్డి, మండల విధ్యాధికారి శశిధర్, ఎంపిడివో వినయ్‌కుమార్, సర్పంచ్ లావణ్య శ్రీనివాస్, ఎంపిటిసి సంగీత బాల్‌రెడ్డి, ఉప సర్పంచ్ రమేశ్ పాల్గొన్నారు.
ఇక పెద్ద చెరువు అభివృద్ధి :కెటిఆర్
నార్సింగి, ఏప్రిల్ 3: పెద్ద చెరువులోకి మురికినీరు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సూచించారు. సోమవారం గండిపేట మండలంలోని మణికొండ, నెక్నాంపుర తదితర గ్రామాల్లో మంత్రి పర్యటించారు. నెక్నాంపురలో గ్రామస్థులు సమస్యలను మంత్రికి విన్నవించారు. కెటిఆర్ మాట్లాడుతూ నగర శివారు ప్రాంతంలోని నెక్నాంపుర పరిధిలోని ఇబ్రహీంబాగ్ పెద్ద చెరువులోకి మురికినీరు వస్తుందని పేర్కొన్నారు. అపార్ట్‌మెంట్‌ల నిర్మాణాలతోనే మురికినీరు వచ్చి చేరుతుందని చెప్పారు. గుర్రండెక్కతో పాటు దుర్గందంగా చెరువు మారిందని పేర్కొన్నారు. దుర్గం చెరువుతో పాటు పైన ఉన్న చెరువుల మురికినీరు కూడా వస్తుండటంతోనే చెరువు పరిస్థితి మరింత మురికిగా మారిందని తెలిపారు. చెరువును పార్లమెంట్ సభ్యుడు కొండా విశే్వశ్వర్‌రెడ్డి దత్తత తీసుకుని వేగవంతంగా అభివృద్ధి చేయాలని కోరారు. ప్రాజెక్ట్‌కు అవసరమైన నిధులను కూడా వెంటనే మంజూరు చేస్తామని పేర్కొన్నారు.
మురికినీటి శుద్ధి ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ముందుగా మణికొండలోని కైరోస్ గ్లోబల్ స్కూల్‌ను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపి కొండా విశే్వశ్వర్‌రెడ్డి, మంత్రి మహేందర్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, జడ్‌పిటిసి ముంగి జ్యోతి జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మణికొండ సర్పంచ్ కె.నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.