రంగారెడ్డి

లారీల సమ్మెతో పెరిగిన కూరగాయల ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, ఏప్రిల్ 3: ఐదు రోజులుగా లారీల సమ్మె కొనసాగుతుండటంతో కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గతంలో 20 రూపాయల నుండి 40రూపాయల వరకు ఉన్న కూరగాయలు ప్రస్తుతం లారీల సమ్మె కారణంగా 40రూపాయల నుంచి 80రూపాయల వరకు చేరిపోయాయి. పెరిగిన కూరగాయల ధరలను సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే వేసవి కాలం.. ఎప్పుడు లేనివిధంగా కూరగాయల ధరలు పెరిగిపోవడంతో ఏమి చేయాలో తెలియక ప్రజానీకం అనేక అవస్థలు పడుతున్నారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, ఫరూఖ్‌నగర్, కేశంపేట, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ గ్రామాల నుండి రైతులు పండించిన కూరగాయలను ఇతర మార్కెట్లకు తీసుకువెళ్లాలంటే లారీల సమ్మె అడ్డురావడంతో ఆటోలు, జీపుల్లో తీసుకువెళ్తున్నారు. షాద్‌నగర్ చుట్టుపక్కల మండలాల నుండి దాదాపు అన్ని రకాల కూరగాయలు షాద్‌నగర్ కూరగాయల మార్కెట్‌కు వస్తుంటాయి. ధరలు మాత్రం ఒక్కసారిగా పెరిగిపోయాయి.
బయటి మార్కెట్‌కు నుండి కూరగాయలు ఆశించి స్థాయిలో దిగుమతి కాకపోవడంతో స్థానికంగా ఉన్న కూరగాయలపై ప్రభావం ఎక్కువగా చూపిస్తుందని ప్రజలు అంటున్నారు. స్థానిక మార్కెట్‌కు వచ్చిన కూరగాయల్లో కొన్ని కూరగాయలను హైదారాబాద్‌లోని గుడిమల్కాపూర్, శంషాబాద్ మార్కెట్‌లకు ఆటోలు, జీపుల్లో రైతులు తరలిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన ఆటోలు, జీపు యజమానులు సైతం ధరలను పెంచడంతో గిట్టుబాటు ఏమి రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఐదవ రోజుకు చేరుకున్న లారీల సమ్మె
సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ లారీ యజమానులు చేస్తున్న సమ్మె ఐదవ రోజుకు చేరుకుంది. సోమవారం షాద్‌నగర్ లారీ ఒనర్స్ అసొసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ సాధిక్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే మహబూబ్‌నగర్ రోడ్డు, పరిగి రోడ్డుల్లో వెళ్తున్న లారీలను అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్‌గౌడ్, నవాజ్‌ఘోరి, కాలేద్, షబ్బీర్ అలీ, ఖాజామియా, రవీందర్‌రెడ్డి, ఖలీల్, జమీల్‌లు పాల్గొన్నారు.