రంగారెడ్డి

శోభాయాత్రకు జనమే జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 11: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం శేరిలింగంపల్లి ప్రాంతంలో పలు చోట్ల భారీగా శోభాయాత్రలు నిర్వహించారు. గోపీనగర్‌లోని హనుమాన్ దేవాలయంలో జరిగిన వేడుకల్లో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్‌తో కలిసి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం కాషాయ జెండా ఊపి శోభాయాత్రలో పాల్గొన్నారు. వేడుకల్లో మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్, మాజీ కౌన్సిలర్ దుర్గం వీరేశంగౌడ్, నాయకులు బద్దం కొండల్‌రెడ్డి, శ్రీనివాస్‌రాజ్, చింతకింది రవీందర్‌గౌడ్ పాల్గొన్నారు. చందానగర్ వద్ద హనుమాన్ శోభాయాత్రలో బిజెపి సీనియర్ నాయకులు నరేష్, కసిరెడ్డి భాస్కరరెడ్డి, రవీంద్రప్రసాద్ దూబె, రాంరెడ్డి పాల్గొన్నారు. యూత్ నాయకుడు జెరిపాటి రాజు ఆధ్వర్యంలో శాంతినగర్‌లో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రకు హఫీజ్‌పేట, మాదాపూర్ కార్పొరేటర్లు వి.పూజిత, జగదీశ్వర్‌గౌడ్ పూలతో స్వాగతం పలికారు.
హనుమాన్ జయంతిని పురస్కరించుకుని చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంటలో గల వేణుగోపాలస్వామి దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కార్పొరేటర్ ప్రారంభించి భక్తులకు వడ్డించారు. కృష్ణదాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో నాయకులు బొబ్బ విజయ్‌రెడ్డి, అక్బర్‌ఖాన్, జె.కృష్ణారెడ్డి, ఆశ, హరీశ్‌రెడ్డి పాల్గొన్నారు.
నార్సింగి: హనుమాన్ జయంతి పురస్కారించుకుని పలు దేవాలయాలలో వేడుకలను నిర్వాహకులు నిర్వహించారు. లంగర్‌హౌస్ సంగం రామాలయంలో మఠాధిపతి బాల్‌వీర్‌దాస్ బాబా యతిరాజ్ స్వామిజీ ఆధ్వర్యంలో పంచమూఖి హనుమాన్ విగ్రహానికి ఆకు పూజలతో పాటు ప్రత్యేక పూజలను నిర్వహించారు. వేకువ ఝాము నుంచి మధ్యాహ్నం వరకు భక్తులు భారీగా వచ్చి దర్శించుకున్నారు. అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
లంగర్‌హౌస్ సంగం రామాలయం వద్ద భక్తులు పెద్ద ఎత్తున వచ్చి పంచమూఖీ హనుమాన్‌ను దర్శించుకుని భారీగా శోభయాత్రలో పాల్గొని తరలివెళ్లారు. శోభయాత్రను బాల్‌వీర్‌దాస్ బాబా యాతిరాజ్ స్వామిజీ ప్రారంభించారు. షేక్‌పేట్, గోల్కొండ, నానల్‌నగర్, లంగర్‌హౌస్, గుడిమల్కాపూర్, మెహిదీపట్నం, మాసాబ్‌ట్యాంక్, విజయనగర్ కాలనీ, మల్లేపల్లి, కార్వాన్, జియాగూడ, పూరానాపూల్, ధూల్‌పేట్, మంగళహాట్, గోషామహల్ తదితర ప్రాంతాల మీదుగా శోభయాత్ర కొనసాగింది. శోభయాత్రకు పోలీస్ బందోబస్తును నిర్వహించినట్లు పశ్చిమ మండల డిసిపి ఎ.వెంకటేశ్వర రావు తెలిపారు.
మర్పల్లి: హనుమాన్ జయంతిని మండలంలో ఘనంగా నిర్వహించారు. మర్పల్లి హనుమాన్ దేవాలయంలో పూజారి కైలాస్ పంతులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జడ్పీటిసి శోభారాణి, సర్పంచ్ పాండు నాయక్, ఎంటిసి శేఖర్ పాల్గొన్నారు. కోటమర్పల్లిలో నిర్వహించిన వేడుకల్లో మాజీ మంత్రి జి.ప్రసాద్‌కుమార్ పాల్గొన్నారు.
మోమిన్‌పేట: మండలంలోని వెల్‌చాల్, మోరంగ్‌పల్లి, అంరిద్దకుర్దు, మేకవనంపల్లి, ఎనె్కపల్లి, చీమల్‌దరి, ఎన్కతల గ్రామాల్లో హనుమాన్ జయంతి నిర్వహించారు. కార్యక్రమాల్లో హిందూ వాహిని, బజరంగ్ దళ్ సభ్యులు వడ్ల వేణుగోపాల్, శ్రవణ్‌కుమార్, రవికుమార్ పాల్గొన్నారు.

గొల్ల, కుర్మల సంఘాలను ఏర్పాటు చేయాలి
వికారాబాద్, ఏప్రిల్ 11: గొర్రెలు పంపిణీ చేసేందుకు జిల్లాలో గొల్ల, కుర్మ కులానికి చెందిన వారిని గుర్తించి ప్రతి గ్రామ పంచాయతీలో సంఘాలను ఏర్పాటు చేయాలని అధికారులను వికారాబాద్ జిల్లా కలెక్టర్ డి.దివ్య ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఎంపిడివో, తహశీల్దార్‌లు, పశుసంవర్థకశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో జూన్ నుండి గొర్రెల పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. పంచాయతీల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు సంఘాలను ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. పథకం ఇంతర కులాలకు వర్తించకుండా యాదవులను మాత్రమే ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. పథకంలో రూ.1.25 లక్షల యూనిట్‌కు కాగా 75 శాతం సబ్సిడీ లభిస్తుందని, మిగతా 25 శాతాన్ని లబ్ధిదారులు భరించాలని పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపికను గ్రామ కమిటీ లాటరీ ద్వారా ఎంపిక చేయాలని అన్నారు. నాణ్యమైన గొర్రెలను ఎంపిక చేయడానికి పశుసంవర్థక శాఖ అధికారులు సహకారం అందిస్తారని అన్నారు. సంఘాలను ఈనెల 20 వరకు పూర్తి చేసుకోవాలని, మొదటగా తహశీల్దార్లు గ్రామాల వారీగా యాదవుల వివరాలను సేకరించాలని వివరించారు. మార్గదర్శకాలు వచ్చేలోగా జిల్లా, మండల, గ్రామ కమిటీల ద్వారా వివరాలను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే జూన్ రెండు నుండి పంపిణీ చేసే పింఛన్ కొరకు ఒంటరి మహిళలను గుర్తించాలని స్పష్టం చేశారు. ఒంటరి మహిళలంటే.. వితంతువులు, భర్తలు విడిచిపెట్టిన మహిళలు, ఎవరూలేని ఒంటరి మహిళలు, అత్యాచారాలకు గురైనవారు, జోగిని వ్యవస్థకు చెందిన ఒంటరి మహిళలు ఈ పింఛన్‌కు అర్హులని తెలిపారు. ఈనెల 20 నుండి 30 వరకు మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని గ్రామాల వారీగా వీరి వివరాలనుతెలుసుకోవాలని పేర్కొన్నారు. జిల్లాలో వచ్చే వర్షాకాలంలో కోటి 20 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధం చేసుకున్న ప్రణాళికల ప్రకారం స్థలాలను గుర్తించి గోతులు తీసుకోవాలని తహశీల్దార్, ఎంపిడివోలను ఆదేశించారు. ఎంపిడివోలు నర్సరీలను సందర్శించి ఏయే మొక్కలు ఉన్నాయి, ఏ మొక్కలు నాటేందుకు పనికి వస్తాయో గుర్తించి వాటి వివరాలను సేకరించాలని వివరించారు. సిపివో పంపే ప్రొఫార్మాలో ఈ మొక్కలకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలని తెలిపారు. పాఠశాలలు, ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాలను గుర్తించి మొక్కలు నాటేందుకు వాటి వివరాలను సేకరించాలని అన్నారు. సాదాబైనామా డాక్యుమెంట్లను గ్రామాల వారీగా పంచనామా చేసి పేద రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని తహశీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. సిసిఎల్‌ఎ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో ఉన్న సాదాబైనామాలకు సంబంధించిన భూములకు పట్టాదారు పాసుపుస్తకాలను, టైటిల్ డీడ్లు, పహాణీలను త్వరగా రూపొందించాలని చెప్పారు. గ్రామాల్లో శ్మశానవాటికలకు, డంపింగ్ యార్డులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి త్వరగా గుర్తించాలని తహశీల్దార్లను ఆదేశించారు. గ్రామాల్లో శ్మశానవాటికలు లేక ఇబ్బందులు పడుతున్నారని అలాంటి ఇబ్బందులు ఇక ముందు జరగకూడదని స్పష్టం చేశారు. డంపింగ్ యార్డులకు సైతం భూములను గుర్తించి అట్టి భూములను వినియోగించుకోవాలని పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రారంభం కాని ఉపాధి హామీ పనులను త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సురేష్‌పొద్దార్, సబ్‌కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా, ఆర్డీవో విశ్వనాథం, డిఆర్‌డివో జాన్సన్, సిపివో దశరథ్, పశుసంవర్థక శాఖ అధికారి సుబ్బారావు పాల్గొన్నారు.