రంగారెడ్డి

పార్టీలో గ్రూపులు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఏప్రిల్ 15: పార్టీలో గ్రూపులను ప్రోత్సహించవద్దని, గ్రూపులు చేయవద్దని వికారాబాద్ శాసనసభ్యుడు బి.సంజీవరావు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని గౌలికర్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనను ఎవరు తిట్టారో తెలుసునని, ఎవరినీ తాను తిట్టలేదని, ఎవరి వద్ద రూపాయి తీసుకోలేదని స్పష్టం చేశారు. పది రోజులుగా నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ వ్యవహారాలు చూస్తున్నామని చెప్పారు. నియోజకవర్గానికి ఇప్పటి వరకు మంత్రి, ఎంపి, తనకు సంబంధించి 15 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని, రెండేళ్ళలో భారీ నిధులు రానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు గ్రామాల్లో పర్యటించగా సిఎం కేసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలు భేషుగ్గా అమలవుతున్నాయని తెలిపారు. పార్టీ సభ్యత్వంలో వెనుకబడి ఉన్నామని, సభ్యత్వ నమోదు రుసుము 13 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉండగా కేవలం నాలుగు లక్షలే చెల్లించామని అన్నారు. ప్రమాదవశాత్తు చనిపోతే సభ్యత్వం తీసుకున్న కార్యకర్తకు పార్టీ రెండు లక్షల రూపాయల బీమా చెల్లిస్తుందని వివరించారు.
అధ్యక్షుడిగా ప్రభాకర్‌రెడ్డి
వికారాబాద్ టిఆర్‌ఎస్ అధ్యక్షుడు డి.ప్రభాకర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శిగా టి.శంకర్ ఎన్నికవగా, వికారాబాద్ మండల పార్టీ అధ్యక్షుడిగా వెంకటయ్య, ధారూర్ మండల పార్టీ అధ్యక్షుడిగా వేణుగోపాల్‌రెడ్డి, మర్పల్లి మండల పార్టీ అధ్యక్షుడిగా సురేష్, మోమిన్‌పేట అధ్యక్షుడిగా మహంత్‌స్వామిలు ఎన్నికయ్యారు.

వచ్చే సాధారణ ఎన్నికల్లో
కేంద్రంలో, రాష్ట్రంలో బిజెపిదే అధికారం
* బద్దం బాల్ రెడ్డి ధీమా
చేవెళ్ల, ఏప్రిల్ 15: వచ్చే సాధారణ ఎన్నికల్లో అటు కేంద్రంలో, ఇటు తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని మిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బద్దం బాల్‌రెడ్డి అన్నారు. శనివారం చేవెళ్లలోని సిహెచ్‌ఆర్ గార్డెన్‌లో భాజపా చేవెళ్ల నియోజకవర్గంస్థాయి పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోదీ చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షణీయులై ఇతర పార్టీల నుండి బిజెపిలో చేరుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ముఖ్యమంత్రి కెసిఆర్ తమ పథకాలుగా చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో తెరాసకు ప్రజలు తొందరలోనే తగిన బుద్ధి చెప్పనున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని తెలిపారు. ముస్లింలను మభ్యపెట్టడానికే 12 శాతం రిజర్వేషన్‌లు కల్పిస్తామని చెప్పుతున్నారని వివరించారు. కాగా, భాజపా మండల అధ్యక్షునిగా దేవర పాండు రంగారెడ్డిని నియమించారు. ఈ మేరకు బద్దం బాల్‌రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమ్‌రాజ్, జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి చేతుల మీదిగా నియామక పత్రం అందజేశారు.

ఉద్యమంలో పోరాడిన వారికి
గుర్తింపు: ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్
రాజేంద్రనగర్, ఏప్రిల్15: తెలంగాణ సాధనలో పోరాడిన నాయకులకు టిఆర్‌ఎస్‌లో ప్రత్యేక స్థానం కల్పిస్తామని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ అన్నారు. శనివారం మైలార్‌దేవ్‌పల్లిలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాజేంద్రనగర్ సర్కిల్లోని నాలుగు డివిజన్ల టిఆర్‌ఎస్ అధ్యక్షులను అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు ఉంటుందని, ఆశావాహులకు ఎలాంటి అన్యాయం జరుగకుండా చూస్తానన్నారు.