రంగారెడ్డి

అంతర్‌రాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ ముఠాలు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, ఏప్రిల్ 15: ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌లకు అత్యంత క్రేజ్ వచ్చింది. ఈ క్రేజ్‌ను బెట్టింగ్ నిర్వాహకులు క్యాష్ చేసుకుంటున్నారు. బెట్టింగ్ నిర్వాహకులు అందివచ్చిన ఏ ఆవకాశాన్ని విడిచి పెట్టడం లేదు. తమ సాంకేతిక పరిజ్జానాన్ని కూడా వినియోగించుకొని క్రికెట్ బెట్టింగ్‌లు కొనసాగిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన రెండు ముఠాలు రాచకొండ కమిషనరేట్ పరిధిలో నిర్వహిస్తున్న బెట్టింగ్‌కు బ్రేకు వేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం, కుషాయిగూడ ప్రాంతాలలో బెట్టింగ్ నిర్వహిస్తున్న రెండు ముఠాలకు చెందిన 10మందిని ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్దనుండి సుమారు 10లక్షలు రూపాయలు నగదు 13 సెల్‌ఫోన్లు ఒక ల్యాప్ టాప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ తెలిపారు. లైవ్ క్రికెట్ యాప్‌తో బాల్ టూబాల్, ఒవర్ టూ ఒవర్, టీమ్‌లపై బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగత్ తెలిపారు. సైబరాబాద్ కమిషరేట్‌లో సాయంత్రం ఏర్పాటుచేసిన విలేఖరులు సమావేశంలో లైవ్ క్రికెట్ బెట్టింగ్ వివరాలను వెల్లడించారు. ఖమం జిల్లా భద్రాచలంకు చెందిన కలకత్తా నాగరాజు (43), అదే జిల్లాకు చెందిన తుల్లూరి శ్రీనివాస్ (32), జూపల్లి చంద్ర శేకర్ (31), కలకత్తా సుబ్బారావు (46), ఇబ్రహీంపట్నంకు చెందిన గొట్టం రాజు (33), ముత్యాల సంతోష్ కుమార్ (24)తోపాటు ప్రకాశం జిల్లా ఎర్రగుంట్లపాలెంకు చెందిన వెంకటేశ్వర్లు, ఉదయకుమార్‌లు ఇబ్రహీంపట్నం సమీపంలో స్థావరాలు ఏర్పాటు చేసుకుని క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని కమిషనర్ తెలిపారు. 8మంది ముఠాలోవెంకటేశ్వర్లు, ఉదయకుమార్‌లు పరారీలో ఉన్నారని చెప్పారు. వీరినుండి 7లక్షల, 65 వేలు నగదు, 9 సెల్‌ఫోన్లు ఒక ల్యాప్ టాప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు భగత్ తెలిపారు.
కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలో బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగుర్ని అరెస్టు చేశారు. ఖమం జిల్లా సత్తుపల్లికి చేందిన బత్తుల రవికుమార్ (35), కుషాయిగూడ నివాసి యాగంటి సుమన్ (28), ఎల్లాగడ్డ శ్రీ్ధర్ (32), యాకరి ప్రమోద్ (27) కుషాయిగూడలోని వివిధ ప్రాంతాల నుండి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వీరితో పాటు సికింద్రాబాద్‌లోని లాల్‌బజార్‌కు చేందిన అంజనేయులు గౌడ్, కుషాయిగూడకు చేందిన చింటులు బెట్టింగ్ ముఠాలో ఉన్నారని ప్రస్తుతం ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు కమిషనర్ చెప్పారు, నలుగురి నుండి 2లక్షల, 25వేల, 500 రూపాయలు నగదు నలుగురు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

రూ.35కోట్ల వ్యయంతో పర్యావరణ ఉద్యానవనం
* టెండర్లను పిలిచేందుకు సిద్ధమైన హెచ్‌ఎండిఏ
ఉప్పల్, ఏప్రిల్ 15: ప్లాట్ల అమ్మకాల ద్వారా ఆధాయ వనరులను సమకూర్చుకోవడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం అందిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండిఏ) మరో అడుగు ముందుకు వేస్తోంది.
విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న మహానగరానికి సరికొత్త పూదోట అందాలతోపాటు వినోదాత్మక, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు నగర శివారు హిమాయత్‌సాగర్ సమీపంలోని కొత్వాల్‌గూడలో పర్యావరణ ఉద్యానవనం (ఎకో-పార్క్)ను అభివృద్ధి చేయడానికి హెచ్‌ఎండిఏ కమిషనర్ చిరంజీవులు శ్రీకారం చుట్టబోతున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విదంగా రూ.35కోట్ల వ్యయంతో నిర్మించబోయే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎకో-పార్కు ప్రాజెక్టుకు త్వరలో టెండర్లు పిలిచేందుకు సిద్దమవుతున్నారు. అద్భుతమనిపించే అందమైన పూదోటలు, కృత్రిమ ఈతకొలను, నీటి ధారలు, ప్రదర్శన శాలలు, కేబుల్ కార్ వంటి ఆహ్లాదకరమైన వాతావరణం అందించే ఉద్యానవనంపై ప్రాధమిక అధ్యయనం పూర్తయింది. కాంట్రాక్టర్ల నుంచి ఆసక్తి వ్యక్తీకర (ఎక్స్‌ప్రెన్సన్) ఆఫ్ ఇంట్రెస్ట్)ను టెండర్ల పద్ధతిలో పిలువబోతుంది. ఇప్పటికే ఉద్యానవనంకు సంబంధించిన లావాదేవీల సలహాదారు (ట్రాన్సాక్షన్) అడ్వయిజర్‌గా దారాషా అనే ప్రైవేటు సంస్థను అథారిటీ నియమించింది. ఎకో-పార్కు కోసం అధ్యయనం, ప్రస్తుత పరిస్థితులు, అవకాశాలు, ఆర్ధికపరమైన ప్రణాళిక, ఎంపిక చేయు విధానం వంటి అంశాలపై సమగ్రమైన వివరాలతో కూడిన నివేదికను లావాదేవిల సలహాదారు అథారిటీకి గప్పగించిన విషయం తెలిసిందే. పూర్తి నివేదికను పరిశీలించిన కమిషనర్ చిరంజీవులు కాంట్రాక్టర్ల నుంచి ప్రతిపాదనలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి టెండర్లను త్వరలో పిలిచి పనులను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. 111జీవో కింద ఉన్న 85 ఎకరాల విస్తీర్ణంలో దుబాయి తరహాలో ప్రపంచ స్థాయిలో సరికొత్త అందాలతో నూతన నమూనాలతో పర్యావరణ ఉద్యానవనంను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు.
జంట నగరాలకు తాగు నీరందించే హిమాయత్‌సాగర్‌కు సమీపంలో అవుటర్ రింగ్‌రోడ్డులో పర్యావరణ ఉద్యానవనంను ఏర్పాటు చేస్తే పర్యాటక కేంద్రంగా హైదరాబాద్ మరోసారి ప్రపంచ పఠంలోకి ఎక్కబోతుందని చెప్పవచ్చు.