రంగారెడ్డి

కాంగ్రెస్‌కు బడుగు వర్గాల అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, వికారాబాద్, ఏప్రిల్ 20: కాంగ్రెస్‌కు బడుగు, బలహీన వర్గాల మద్దతు ఉందని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ అన్నా రు. గురువారం తాం డూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన బడుగు, బలహీన వర్గాల గర్జన సభలో మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతున్నది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. దేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ రచించిన అంశాలు.. దేశంలోని బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలను ప్రస్తుతం కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వాపోయారు. అంబేద్కర్ ఆశయాలను గాలికి వదిలేసి, పేదలు, బడుగు వర్గాల అభ్యున్నతిని తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. దళితులకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో తగిన న్యాయం చేకూరడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పేదలకు చేయూతనందించి ఎన్నో పథకాలను రూపొందించి అమలుపర్చింది కేవలం దివంగత ప్రధానులు నెహ్రూ, ఇందిరాగాంధీ అని వివరించారు. వారి బాటలోనే రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, రాహుల్ పయనిస్తున్నారని తెలిపారు. దేశంలో సెక్యులర్ విధానాలు సన్నగిల్లిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మతతత్వ రాజకీయాలు ఉద్ధృతమయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ పాలకులు.. బడుగు, బలహీనవర్గాలను మాయమాటలతో మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. దానికి ఉదాహరణే రిజర్వేషన్ల తంతు అని చెప్పారు.
కెసిఆర్ ద్రోహం : ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శ
బడుగు, బలహీన వర్గాలను సిఎం కెసిఆర్ మోసం చేస్తున్నారని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. కేంద్ర పాలకులు.. దళితులపై అన్ని రంగాల్లో వివక్ష చూపుతుండగా, రాష్ట్రంలో కెసిఆర్.. దళితులతో పాటు మైనారిటీలను మాయమాటలతో వంచిస్తున్నారని చెప్పారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు రాష్ట్రంలోని మెదక్, హైదరాబాద్‌లో మాత్రం నిర్మించి రాష్టమ్రంతటా ప్రజల్ని అయోమయంపాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన మరుక్షణమే దళిత, గిరిజనులకు అమలు చేయాల్సిన రిజర్వేషన్ అమలు చేయకుండా అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల పేరిట ముస్లింలకు టోకరా ఇస్తున్న కెసిఆర్.. కులవృత్తులకు ప్రోత్సాహమంటూ బిసి వర్గాలను వలలో వేసుకుంటున్నారని ఆరోపించారు. ఇదంతా ఓట్ల పన్నాగమేనని, ఆయా వర్గాలు గుర్తించాలని సూచించారు. రాబోయే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని దీమా వ్యక్తం చేశారు.

తాగునీటికి 3వేల కోట్లు

కెసిఆర్ ఓటు బ్యాంకు
రాజకీయాలు మానుకోవాలి
కీసర ఏప్రిల్ 20: కెసిఆర్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలని కీసర మండల భాజపా అధ్యక్షుడు ఏనుగు రాజిరెడ్డి పేర్కొన్నారు.
గురువారం కీసర మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ముస్లింలకు బిసి కోటాలో రిజర్వేషన్ బిల్లు తెచ్చి తీవ్ర అన్యాయం చేశారన్నారు. సామాజిక వెనుకబాటు ఆధారంగా ఏర్పాటైన రిజర్వేషన్‌ల విధానానికి వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ, రజాకార్ల పాలన దిశగా ప్రభుత్వం పయనిస్తుందని ఆవేదన వ్యక్తం చేసారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసే వరకు భాజపా పోరాటాలు చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, కందాడి సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు ఎస్.వెంకట్‌రెడ్డి, జిల్లాల తిరుమల్‌రెడ్డి, మునిగంటి సురేశ్, బాలరాజు, అశోక్, ఎల్లారెడ్డి, కృష్ణ, నగేశ్, నర్సింహగౌడ్, ఆంజనేయులు, వెంకటేశ్, నల్ల వెంకట్‌రెడ్డి, ఎం.మహేందర్ యాదవ్‌లు పాల్కొన్నారు.
ముగ్గురి ప్రాణాలు
బలిగొన్న ఈత సరదా
జీడిమెట్ల, ఏప్రిల్ 20: మండుతున్న ఎండల తాకిడి తట్టుకోలేక విద్యార్థులు, యువకులు సరదాగా ఈతకు వెళ్లి తిరిగి రానిలోకాలకు వెళ్లిపోయారు. వేర్వేరు చెరువుల్లో ముగ్గురు మృతి చెందిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గాజులరామారం డివిజన్ రోడామేస్ర్తినగర్, వల్లభాయ్ పటేల్ నగర్‌కు చెందిన జహంగీర్ (18) ఎసి, కూలర్‌ల రిపేరింగ్ హెల్పర్‌గా పనిచేస్తాడు. సంజీవరెడ్డి కుమారుడు వైభవ్ (14) తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. వీరితో పాటు పవన్, ఆంజనేయులు కలిసి బతుకమ్మ బండలోని చెరువుకు ఈతకు వెళ్లారు. నలుగురు చెరువులో దిగారు. జహంగీర్, వైభవ్‌లు చెరువులోనే మునిగిపోయారు. దీంతో పవన్, ఆంజనేయులు తెలిపిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దేవేందర్‌నగర్ సమీపంలోని చింతల్ చెరువులో 13 సంవత్సరాల వయస్సు కలిగిన ఓ బాలుడు ఈతకని వెళ్లి చెరువులోనే మునిగి మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుని వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.