రంగారెడ్డి

నేడు పాలిసెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఏప్రిల్ 21: పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే టిఎస్ పాలిసెట్-2017 పరీక్ష శనివారం జరుగనుంది. పరీక్షా నిర్వహణకు సంబంధిత అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. పాలిసెట్ రీజినల్ కోఆర్డినేటర్, మేడ్చల్ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ వై.నర్సయ్యగౌడ్ శుక్రవారం వివరాలను వెల్లడించారు. మేడ్చల్ జిల్లాలో పాలిసెట్ పరీక్ష నిర్వహణ కోసం 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 2414 మంది విద్యార్థులు హజరుకానున్నారు. పరీక్ష ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందని, నిర్ణీత సమయానికి నిముషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు. విద్యార్థులు పరీక్షా సమయానికంటే గంట ముందే పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోవాలని సూచించారు. జిల్లాలో మొదటిసారి నిర్వహిస్తున్న పాలిసెట్ పరీక్షకు రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత మేడ్చల్ జిల్లాలోనే అత్యధికంగా పరీక్షకు విద్యార్థులు హజరవుతున్నారని పేర్కొన్నారు. రాష్టవ్య్రాప్తంగా లక్షా 31వేల మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నట్లు వివరించారు. డిఇఓ, ఎంఇఓలు ప్రత్యేక స్క్వాడ్‌లుగా వ్యవహరిస్తారని, ఒక్కో సెంటర్‌కు ఒక్కో అధ్యాపకుడు పరిశీలకుడిగా పనిచేస్తారని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రశ్నాపత్రాలు పోలీసు స్టేషన్‌కు చేరుకున్నాయని నేడు ఉదయం 8 గంటలకు పరీక్షా కేంద్రాలకు చేర్చుతామని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు కావాల్సిన తాగునీరు, ఫ్యాన్‌లు, లైట్లు తదితర ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు. అసిస్టెంట్ కోఆర్డినేటర్‌లుగా శ్రావణ్‌కుమార్, దిక్షిత్‌రెడ్డి వ్యవహిరిస్తారని చెప్పారు. పరీక్షకు హజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్, బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్, హెచ్‌బి పెన్సిల్, ఇరేజర్, షార్ప్‌నర్‌కు మాత్రమే అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. ఇతర ఏ రకమైన వస్తువులకు, సెల్‌ఫోన్, వాచ్ ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. మేడ్చల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 250 మంది, మేడ్చల్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 240, మేడ్చల్ బాలికల ఉన్నత పాఠశాలలో 220, మేడ్చల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 350, అత్వెల్లి ప్రభుత్వ పాఠశాలలో 200, దూలపల్లి ప్రభుత్వ పాఠశాలలో 200, కొంపల్లి ప్రభుత్వ పాఠశాలలో 400, గుండ్లపోచంపల్లి ప్రభుత్వ పాఠశాలలో 200, మేడ్చల్ నాగారుజ్జన టాలెంట్ స్కూల్‌లో 230, మేడ్చల్ సైబరేజ్ పాఠశాలలో 124 మంది విద్యార్థులు పరీక్షకు హజరుకానున్నారని ప్రిన్సిపాల్ వై.నర్సయ్యగౌడ్ వివరించారు.

టిఆర్‌ఎస్ నిరంకుశత్వానికి నిదర్శనం మత రిజర్వేషన్
వికారాబాద్, ఏప్రిల్ 21: మత రిజర్వేషన్ బిల్లు టిఆర్‌ఎస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని బిజెవైఎం జాతీయ కార్యదర్శి బద్దం మహీపాల్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట మతపరమైన రిజర్వేషన్‌లకు వ్యతిరేకంగా బిజెపి నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యఅతిథిగా హాజరైన మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ రిజర్వేషన్ల పేర ప్రజాస్వామ్యాన్ని నిలువునా చీల్చారని చెప్పారు. కనీసం ప్రతిపక్షాలతో చర్చించకుండా సెలవు రోజున బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించుకోవడం విడ్డూరమని తెలిపారు. మైనారిటీలకు ప్రతిపాదిత నాలుగు శాతం రిజర్వేషనే కోర్టు కేసులో ఉండగా, 12 శాతం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. బిల్లుతో బిసి, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అది నిలబడలేని బిల్లని, బిల్లు విషయంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం.. పార్లమెంటుకు కనీసం నివేదిక ఇవ్వలేదని, స్పీకర్‌తో చర్చించలేదని పేర్కొన్నారు. మత రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు గళాన్ని ఎత్తుకోవాలని పిలుపునిచ్చారు. వరుసగా అనేక నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం విచిత్రకరమని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లున్నాయనే విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు. ముస్లింలకు బిజెపి వ్యతిరేకం కాదని, అన్ని కులాలకు సమన్యాయం చేయడానికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని అన్నారు. ఏ బిల్లయినా కేంద్రంలో ప్రధాని మోది అన్ని ప్రతిపక్షాలతో చర్చించి మంచి బిల్లయితేనే ఆమోదిస్తున్నారని వివరించారు. టిఆర్‌ఎస్ ప్లీనరీలో చెప్పుకునేందుకే ఆదరాబాదరాగా బిల్లును ఆమోదించుకున్నారని, చట్టబద్ధత లేనిది సుధీర్ కమిటీ అని, ప్రజలు స్పందించి ప్రతిఘటించకపోతే నష్టపోతారని స్పష్టం చేశారు. రాష్ట్రం కేసిఆర్ జాగీరు కాదని, ప్రతిపక్షాల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు పోకల సతీష్, మండల పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ సుచరిత, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు టి.సదానంద్‌రెడ్డి, బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు కె.వివేకానంద్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కె.విజయభాస్కర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎస్.అమరేందర్ రెడ్డి, బిజెవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు జగదీశ్, పట్టణ ఉపాధ్యక్షుడు రవితేజ, జిల్లా ప్రధానకార్యదర్శి హరికృష్ణ, నాయకులు నరోత్తం రెడ్డి, ప్యాట శంకర్‌లు పాల్గొన్నారు. అనంతరం తహశీల్దార్ చినప్పలనాయుడుకు మత రిజర్వేషన్‌లు ఉపసంహరించాలని వినతిపత్రం సమర్పించారు.
చెరువులో యువకుల
మృతదేహాల వెలికితీత
జీడిమెట్ల, ఏప్రిల్ 21: ఈతకని వెళ్లి చెరువులో మునిగి మృతి చెందిన యువకుల మృతదేహాలను శుక్రవారం వెలికితీశారు. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. గాజులరామారం డివిజన్ రోడామేస్ర్తినగర్, వల్లభాయ్ పటేల్‌నగర్‌కు చెందిన జహంగీర్ జహంగీర్ (18), సంజీవరెడ్డి కుమారుడు వైభవ్ (14) బతుకమ్మ బండలోని చెరువుకు గురువారం ఈతకు వెళ్లి గల్లంతైన సంగతి తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం గజఈతగాళ్ల సహాయంతో చెరువులో నుండి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గాజులరామారం డివిజన్ దేవెందర్‌నగర్, బతుకమ్మ బండలలోని చెరువుల్లో ముగ్గురు బాలురులు మునిగి మృతి చెందారనే విషయాన్ని తెలుసుకున్న మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి చెరువులను పరిశీలించారు.

డ్రైవర్ మృతికి కారణమైన
ముగ్గురి అరెస్టు
నేరేడ్‌మెట్, ఏప్రిల్ 21: కాలువ నిర్మాణ పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి జెసిబి డ్రైవర్ మృతికి కారణమైన కాంట్రాక్టర్, సూపర్‌వైజర్‌ను అరెస్టు చేశారు. మల్కాజిగిరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 11న మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని జ్యోతినగర్‌లో కాంట్రాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులను జెసిబి సహాయంతో చేయిస్తుండగా ప్రమాదవశాత్తు గోడ కూలి జెసిబి డ్రైవర్ మృతిచెందిన సంఘటన తెలిసిందే. కాంట్రాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి(54) నిర్లక్ష్యం కారణంగానే బాధితుడి మృతిచెందాడని పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రహరీ గోడ ఇంటి యజమాని భార్గవరావు, సూపర్‌వైజర్ భానువర్దన్‌ను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.