రంగారెడ్డి

వారం రోజుల్లో ఇన్‌పుట్ సబ్సిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొడంగల్, ఏప్రిల్ 21: కొడంగల్ నియోజకవర్గంలో రైతు ఆత్మహత్యలు నివారించాలని అధికారులను జిల్లా కలెక్టర్ దివ్య ఆదేశించారు. శుక్రవారం స్థానిక తహశీల్ కార్యాలయంలో రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. జిల్లాల విభజన తరువాత నియోజకవర్గంలోని మూడు మండలాలు వికారాబాద్‌లో, రెండు మండలాలు పాలమూరులో ఉండిపొయాయని అన్నారు. నియోజకవర్గం రెండు ముక్కలు కావడంతో ఆ ప్రాంత ప్రజలు బాధపడటం అవసరం లేదన్నారు. నియోజకవర్గంపై జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. కొడంగల్, దౌల్తాబాద్, బోంరాస్‌పేట మండలాల్లో కనీసం నెలకు ఒకసారైన తాను పర్యటించి సమస్యలను పరిష్కరిస్తున్నానని అన్నారు. జిల్లా ల విభజన తరువాత రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ (కరవు డబ్బులు) అందడంలో కాస్త ఆలస్యమైన మాట వాస్తమేనని, ఈ విషయంపై వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించి వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పట్టణ శివారులోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను ఆకస్మాకంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని విద్యార్థులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. సబ్ కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, తహశీల్దార్ శివకుమార్, వ్యవసాయాధికారి వినయ్‌కుమార్, ఎవోలు బాలాజీ ప్రసాద్, పరశురాం పాల్గొన్నారు.

వర్సిటీకి విద్యార్థులు, అధ్యాపకులే బలం
రాజేంద్రనగర్, ఏప్రిల్ 21: ప్రతిభ కలిగిన విద్యార్థులు, అధ్యాపకులే విశ్వవిద్యాలయాలకు గొప్ప బలమని భారత వ్యవసాయ పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మోహపాత్ర అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో భారత వ్యవసాయ పరిశోధనా మండలి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నిధులతో నూతనంగా నిర్మించిన విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం భవనాన్ని శుక్రవారం ప్రారంభించారు. విశ్వవిద్యాలయం అధికారులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. విద్యార్థులకు ఆసక్తి కలిగించేలా బోధన ఉండేట్లు సౌకర్యాలు కల్పించడమే కాకుండా, అధ్యాపకులను కూడా నిరంతరం నూతన పద్ధతులపై నైపుణ్యాభివృద్ధి కల్పస్తే విద్యాలయాల్లో అత్యుత్తమ ప్రమాణాల నెలకొంటాయని అన్నారు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. మెరుగైన వౌలిక సదుపాయాలు, బోధన ఉన్న విశ్వవిద్యాలయాలకు ప్రతిభ కలిగిన విద్యార్థులు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. రానున్న రోజుల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు ర్యాంకింగ్‌లు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు వివరించారు. దీంతో విశ్వవిద్యాలయాల మధ్య పోటి పెరిగి బోధన, పరిశోధనలకు ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పారు. వ్యవసాయంలో ఆదాయం పెరిగితేనే యువత ఈ రంగం వైపు మొగ్గు చూపుతారని అన్నారు. ఈ రంగంలో సవాళ్లతో పాటు అనేక అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవడంపై శాస్తవ్రేత్తలు దృష్టి నిలపాలని సూచించారు. నూతనంగా ఏర్పడిన జయశంకర్ విశ్వవిద్యాలయానికి తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. కొత్తగా ప్రారంభమైన ఎగ్జామినేషన్ బిల్డింగ్‌లో వసతులు మిగతా విశ్వవిద్యాలయాలకు ఆదర్శంగా నిలుస్తాయని ఆకాంక్షించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్‌రావు సత్కరించారు. ఐసిఎఆర్ నుంచి విశ్వవిద్యాలయానికి నైతికంగా, ఆర్థికంగా అందుతున్న సహకారానికి ఉపకులపతి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యులు డాక్టర్ మనోహర్‌రావు, డాక్టర్ సురేందర్‌రాజు, ఉన్నతాధికారులు డాక్టర్ సుధీర్‌కుమార్, డాక్టర్ ఎఎస్ డాంగి, డాక్టర్ ఆనంద్ సింగ్, డాక్టర్ రాజిరెడ్డి, డాక్టర్ కేవి ఎస్ మీనాకుమారి, డాక్టర్ వీరాంజనేయులు, డాక్టర్ సదాశివరావు, డాక్టర్ జమునారాణి, శ్రీ్ధర్, ఇమ్మాన్యుయెల్ పాల్గొన్నారు.