రంగారెడ్డి

ఆహార, పోషక భద్రత సాధించడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, ఏప్రిల్ 21: వ్యవసాయ విస్తరణ సేవలను సమర్థవంతంగా వినియోగించుకొని ఆహార, పోషక భద్రత సాధించడమే లక్ష్యంగా శనివారం నుంచి మూడు రోజుల పాటు ఎక్స్‌టింకన్ - 2017 పేరిట జాతీయ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని సదస్సు చైర్మన్, ప్లానింగ్ కమిషన్ మాజీ సలహాదారుడు (వ్యవసాయం) డాక్టర్ సదామతే అన్నారు. సర్వారెడ్డి వెంకురెడ్డి ఫౌండేషన్, పార్టిసిపేటరీ రూరల్ డెవ్‌లప్‌మెంట్ ఇనిషియేటివ్ సొసైటీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా మూడు రోజుల పాటు యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న జాతీయ సదస్సు వివరాలను శుక్రవారం డాక్టర్ ఎంఎన్ రెడ్డి, డాక్టర్ హేమనాధరావు, డాక్టర్ జయరాంరెడ్డితో కలిసి మీడియా సమావేశంలో వివరించారు. వాతావరణ మార్పులపై రైతులకు అవగాహన కల్పించేందుకు అనుసరించాల్సిన విస్తరణ సేవలు, రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి అనుసరించాల్సిన వ్యవసాయ విస్తరణ వ్యూహాలు రూపొందించడంపై ఈ సదస్సులో చర్చిస్తారని తెలిపారు. మెరుగైన విస్తరణ సేవలతో రైతులను చైతన్యపరిచి గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో రైతు సమాఖ్యలను ఏర్పాటు చేసి వారిని సంఘటితపరిచి, పండించిన పంటలకు లాభదాయకమైన ధర వచ్చేలా సదస్సు చర్చించనున్నామని తెలిపారు. మూడు రోజుల సదస్సులో శాస్తవ్రేత్తలు, విధాన రూపకర్తలు, రైతులు విస్తృతంగా చర్చించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు తగిన సిఫార్సులు చేస్తామని చెప్పారు. దేశంలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, రైతు సంఘాలు, విధాన నిర్ణయాలు చేస్తున్న సుమారు 300 నుంచి 400 మంది ప్రతినిధులు సదస్సులో పాల్గొంటారని వివరించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగే సదస్సును భారత వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ అశోక్ దళ్వాయి ప్రారంభిస్తారని తెలిపారు. వ్యవసాయ విస్తరణకు నూతన దశ, దిశను నిర్దేశించడానికి ఈ సదస్సు దోహదం చేస్తుందని మేనేజ్ మాజీ సంచాలకుడు డాక్టర్ ఎంఎన్ రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయాన్ని ఆకర్షణీయ రంగంగా మార్చడం, సుస్థిర వ్యవసాయ దిశగా విస్తరణ సేవల వినియోగంపై పరిశోధనా పత్రాలు సమర్పిస్తారని నిర్వాహణ కమిటీ సభ్యుడు డాక్టర్ హేమనాధరావు తెలిపారు.

వెట్టిచాకిరీ విముక్తిలో శంకరన్ కృషి మరువలేనిది
వికారాబాద్, ఏప్రిల్ 21: లక్ష్యాలను నిర్ధేశించుకొని పనిచేస్తే.. తప్పనిసరిగా అది సాధ్యమవుతుందని వికారాబాద్ కలెక్టర్ డి.దివ్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మాజీ ఐఎఎస్ శంకరన్ చిత్రపటానికి పూలమాల వేసి సివిల్స్ సర్వీసెస్ డే (పౌర హక్కుల దినోత్సవం)ను నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులందరూ సేవా దృక్పథంతో పనిచేయాలని అపుడే మనకు ఎంతో సంతృప్తిని కలుగజేస్తుందని చెప్పారు. సేవ చేయాలనే మనస్సు ఉంటే మార్గం ఉంటుందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యున్నతి కోసం శంకరన్ ఎంతగానో కృషి చేశారని కొనియాడుతూ, శంకరన్‌ను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు. వెట్టిచాకిరితో పనిచేస్తున్న వారిని గుర్తించి వెట్టిచాకిరి విముక్తి చట్టాన్ని తీసుకురావడంలో ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు. ముఖ్యంగా ఎంతోమందిని దత్తత తీసుకుని వారిలో ఉన్నత స్థాయిలో నిలిపిన గొప్ప వ్యక్తని కొనియాడారు. ఇటీవలే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ ఒక చేతిలో శంకరన్, మరో చేతిలో అంబేద్కర్ ఫొటోను పట్టుకుని ఆశయాన్ని ఛేదించారని గుర్తుచేశారు. గిరిజనుల అభివృద్ధి కొరకు ఐటిడిఎ సంస్థలకు ఐఎఎస్ అధికారిని నియమించి వారి అభ్యున్నతికి మార్గదర్శకంగా నిలిచారని వివరించారు. జాయింట్ కలెక్టర్ సురేష్ పొద్దార్, డిఆర్‌వో జి.సంధ్యారాణి మాట్లాడుతూ ప్రజలకు మనము సేవ చేస్తే లబ్ధి పొందినవారు మనల్ని ఎక్కువగా గుర్తుంచుకుంటారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు సానుకూలంగా ఆలోచిస్తే తప్పనిసరిగా మార్గం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. పౌర సేవల దినోత్సవం సందర్భంగా జిల్లా యంత్రాంగంతో పాటు సిబ్బంది జిల్లా ప్రజలకు మంచి సేవలందించాలని తెలిపారు. కార్యక్రమంలో వికారాబాద్ ఆర్‌డివో విశ్వనాథం, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ విజయ్‌మోహన్, డిసిఎస్‌వో పద్మజ, డిడబ్ల్యువో జ్యోత్స్న, డివైఎస్‌వో హన్మంత్‌రావు, సంక్షేమ శాఖల అధికారులు మోహన్‌రెడ్డి, సత్యనారాయణ, ఈశ్వర్‌రావు, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.