హైదరాబాద్

ప్రజా పోరు గర్జనతో టిడిపి సత్తా చాటుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, ఏప్రిల్ 27: ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు పాటుపడుతూ అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలను అందించిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎస్.సుశీల్ రాజూ గౌడ్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించ తలపెట్టిన టిటిడిపి ప్రజాపోరు గర్జన మహాసభకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన రాజూ గౌడ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో అధికార టిఆర్‌ఎస్ పాలకులు తమ అధికార దర్పంతో పార్టీ ప్లీనరీలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ బలం చూపుతుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం తమ ఉనికిని చాటుకునేందుకు తాండూరులో బడుగు బలహీన వర్గాల గర్జన పేరుతో డొల్ల సభను నిర్వహించారని రాజుగౌడ్ విమర్శించారు. కాగా, టిడిపికి నేటికీ ప్రజాభిమానం మెండుగా ఉందన్నారు.
టిఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు కంగుతినేలా..
తాండూరులో శుక్రవారం సాయంత్రం నిర్వహిస్తున్న టిడిపి ప్రజాపోరు గర్జన భారీ బహిరంగసభ అధికార టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు కంగు తినేలా ఉంటుందని టిడిపి నాయకుడు, రేవంత్‌రెడ్డి ముఖ్య అనుచరుడు జయసింహ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న జయసింహ విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన సాగిస్తూ ప్రజలను మభ్య పెడుతూ హైడ్రామాలతో కాలం వెళ్లదీస్తున్న టిఆర్‌ఎస్ పాలకులు తమంతట తామే గొప్పలు చెప్పుకుంటూ భారీ సభలు, ప్లీనరీలు నిర్వహిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు జయసింహ విమర్శించారు. రాష్ట్రంలో గత మూడేళ్ల టిఆర్‌ఎస్ పాలనలో ప్రజలకు ఈ పాలకులు ఒరగబెట్టింది శూన్యమని అన్నారు. కుల, మత రాజకీయాలతో మోసపూరిత ప్రకటనలు చేస్తూ అభివృద్ధి మంత్రం జపిస్తున్నారని పేర్కొన్నారు. తాండూరులో మంత్రి పట్నం అధ్వర్యంలో టిఆర్‌ఎస్ సభను నిర్వహించగా, కాంగ్రెస్ నేతలు తమ ఉనికిని చాటుకునేందుకు బడుగు, బలహీన వర్గాల గర్జన పేరుతో సభను నిర్వహించారని, కాంగ్రెస్ సభలో ప్రజాహితం కోసం ఏ ఒక్క నాయకుడు మాట్లాడిన పాపాన పోలేదన్నారు.
ప్రజాపోరు యాత్రకు తరలిరావాలి
ఉప్పల్: తాండూరులో ఈనెల 28న నిర్వహించే తెలుగుదేశం ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా పోరుయాత్రకు పార్టీ శ్రేణులు తరలి రావాలని తెలుగు యువత పీర్జాదిగూడ పురపాలక సంఘం కమిటీ అధ్యక్షుడు దేశగోని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసికెళ్లి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని, వచ్చే ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. కెసిఆర్ పాలనపై విసుగు చెందిన ప్రజలు స్వచ్ఛమైన పాలన అందించే టిడిపి కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు ఫిట్స్
తృటిలో తప్పిన ప్రమాదం
చేవెళ్ల, ఏప్రిల్ 27: ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో రోడ్డు పక్కన ఉన్న చిరువ్యాపారులు ఏర్పాటు చేసుకున్న డబ్బాను బస్సు ఢీకొట్టింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. సంఘటన చేవెళ్ల పోలీసు స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ బస్‌స్టేజీ వద్ద గురువారం చోటు చేసుకుంది. సిఐ గురువయ్య తెలిపిన వివరాల ప్రకారం పరిగి డిపోకు చెందిన ఆర్టీసీ డీలక్స్ బస్సు ప్రయాణికులతో పరిగి నుంచి హైదారాబాద్‌కు బయల్దేరింది. చేవెళ్ల మండలం ఖానాపూర్ బస్‌స్టేజీ వద్దకు రాగనే బస్సు డ్రైవర్ వీరభద్రంకు ఆకస్మాత్తుగా ఫిట్స్ వచ్చింది. డ్రైవర్ అప్రమాత్తమై రోడ్డు పక్కన ఉన్న కూల్‌పాంయిట్ డబ్బాను ఢీకొట్టి నిలిపివేశాడు. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. డ్రైవర్ వీరభద్రంను ఫిట్స్ నుండి కొలుకునేలా ప్రయాణికులు చేశారు. కూల్ పాయింట్ డబ్బాకు జరిగిన నష్టపరిహారం డ్రైవర్ ఇస్తానని ఒప్పుకున్నాడని తెలిపారు. దీంతో బస్సును తిరిగి అక్కడి నుండి పంపించామని సిఐ తెలిపారు.