హైదరాబాద్

సమసమాజ స్థాపనకు బసవేశ్వరుడి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఏప్రిల్ 29: సమ సమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడు మహాత్మా బసవేశ్వరుడని వికారాబాద్ శాసనసభ్యుడు బి.సంజీవరావు కొనియాడారు. శనివారం బసవేశ్వరుడి 834వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎంఆర్‌పి కూడలి వద్ద బసవేశ్వరుడి విగ్రహానికి జిల్లా కలెక్టర్ దివ్యతో కలిసి పూలమాల వేసారు. వీరశైవ సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సమాజంలో కుల, మత బేధాలను వీడి అందరు కలిసి మెలసి ఉండాలని కోరుకున్న మహనీయుడు మహాత్మా అని చెప్పారు. బాల్య వివాహ వ్యవస్థ నిర్మూలనతో పాటు ఇతర సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడాడని గుర్తుచేశారు. విద్యాకేంద్రంగా ఉన్న వికారాబాద్ మరింతగా విద్యకు అవకాశాలు పెరగాల్సిన అవసరముందని తెలిపారు. ఈ ప్రాంతం నుండి ఐఎఎస్, ఐపిఎస్‌లుగా విద్యార్థులు ఎంపిక కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సురేష్ పొద్దార్ మాట్లాడుతూ ఎందరో మహానుభావులు సమసమాజ స్థాపనకు కృషి చేశారని, అందులో ముఖ్యమైన వ్యక్తి బసవేశ్వరుడని, ఆశయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా ఏర్పడిన ఆరు నెలల్లోనే నలుగురు మహనీయుల జయంతిని నిర్వహించామని చెప్పారు. జిఐడి నుండి నిధులు తెచ్చుకుంటే జయంతిని ఘనంగా నిర్వహించవచ్చని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా జీవనం గడపాలనే సత్యం నేడు కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుతం అన్ని కులాలు, మతాల వారు కలిసే తింటున్నారని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్య, సంక్షేమం, వౌలిక వసతుల అభివృద్ధి చైర్మన్ జి.నాగేందర్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ వి.సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.రాంచంద్రారెడ్డి, ఆర్డీవో విశ్వనాథం, జడ్పీటిసి ముత్తార్‌షరీఫ్, తహశీల్దార్ చినప్పలనాయుడు, ఎంపిడివో సత్తయ్య, వీరశైవ సమాజం అధ్యక్షుడు ఆర్‌ఎం ఆనందం, వేద పండితుడు సాంబశివ శర్మ, మున్సిపల్ కౌన్సిలర్లు ఎ.సుధాకర్‌రెడ్డి, మధుకర్, మేక చంద్రశేఖర్‌రెడ్డి, రాజమల్లు, వీర శైవ సమాజం సభ్యులు పటేల్ సంగమేశ్వర్, ప్యాట మల్లేశం, ప్రశాంత్, శివరాజ్ పాల్గొన్నారు.
జీడిమెట్ల: ప్రజలందరూ సమానమే అనే భావనను ప్రబోధించి ఎన్నో సంఘ సంస్కరణలు చేపట్టిన మహా వ్యక్తి బసవేశ్వరుడని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి కొనియాడారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని సూరారం కాలనీలో భాష, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 884వ బసవేశ్వర జయంతిని నిర్వహించారు. బసవేశ్వరుని విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళి అర్పించారు. బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆయన జీవించి ఉన్న కాలంలోనే సమానత్వం గురించి బోధించిన మహా వ్యక్తి అని అన్నారు. ప్రభుత్వం వెనుతబడిన వర్గాల సంక్షేమానికి అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారని చెప్పారు. కల్యాణలక్ష్మి, ఉపకార వేతనాలు తదితర వేతన పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బసవేశ్వర జయంతిని అధికారికంగా ఘనంగా నిర్వహించాలని ఆదేశించారని అన్నారు. వీర శైవ లింగాయత్ కుటుంబ సభ్యులకు బసవేశ్వర జయంతి సందర్భంగా కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. సూరారం కాలనీలో శ్మశాన వాటిక ఏర్పాటుకు ఆర్‌డిఓ, తహశీల్దారులు స్థలాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ప్రాంతంలో క్వారీ గుంతలు ఎక్కువగా ఉన్నాయని గుంతలను వెంటనే పూడ్చివేసేలా చూడాలని, క్వారీల చుట్టూ ప్రహారీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఆర్‌డిఓ మధుసూదన్, తహశీల్దార్ సురెందర్, బిసి సంక్షేమాధికారి కేశురామ్, వీర శైవ లింగాయత్ ప్రతినిధులు బస్వరాజ్, శ్రీ్ధర్, రవిందర్ మురారి, రాజయ్య పాల్గొన్నారు.
జగద్గిరిగుట్టలో..
గాజులరామారం సర్కిల్ పరిధిలోని జగద్గిరిగుట్టలో బసవేశ్వర 884వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జగద్గిరిగుట్ట వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర వీర శైవ లింగాయత్ సమాజం ప్రతినిధులు విచ్చేసి బసవేశ్వరు విగ్రహానికి పూలమాల వేసి పూజలు చేశారు. బసవేశ్వరుడు చేసిన కార్యక్రమాలను స్మరించుకున్నారు.
కార్యక్రమంలో వీర శైవ లింగాయత్ సమాజం ప్రతినిధులు శివన్నో నేతి మహేశ్, నేతి జ్ఞానేశ్వర్, రామ్‌శెట్టి, బందరి శివకుమార్, కోనపురం రాచయ్య, విజయ్‌కుమార్, శంకర్, విజయ్ పాల్గొన్నారు.

చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్టు

మేడ్చల్, ఏప్రిల్ 29: మధ్యాహ్న సమయాల్లో తాళాలు వేచి ఉన్న ఇళ్లనే టార్గెట్‌గా చేసుకుని తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను మేడ్చల్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 12 తులాల బంగారు ఆభరణాలు, ఓ ల్యాప్‌టాప్, ఒక టాటాఏస్ ఆటోను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. శనివారం మేడ్చల్ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కానుకుంట ముల్లగూడెం ప్రాంతానికి చెందిన పిట్ల నరేశ్(22) ప్రస్తుతం ఆటోడ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నరేశ్ ఇంటర్ చదివే రోజుల్లో మేడ్చల్ ప్రాంతంలోని శ్రీగురు వెంకటేశ్వర డిష్ కేబుల్‌లో పనిచేసేవాడు. ఆర్ధిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో చదువు ఆపేసి రెండు సంవత్సరాలు మేడ్చల్ ప్రాంతంలో సెంట్రింగ్ పనిచేశాడు. తర్వాత 2013 సంవత్సరంలో స్వప్న అనే యువతితో ప్రేమ వివాహం జరిగింది. పెళ్లి అనంతరం ఆటో నడిపిస్తూ జీవనం సాగిస్తున్న నరేష్‌కు ఆర్ధిక ఇబ్బందులు తెలెత్తడంతో సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచన చేశాడు. ఈ క్రమంలో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న నరేష్ జనవరి 3వ వారంలో మధ్యాహ్న వేళ పట్టణంలోని బాలాజీనగర్‌లో సెంట్రింగ్ పని కోసం తిరుగుచుండగా ఎక్కడా పని లభించకపోవడంతో శ్రీలక్ష్మీ నిలయం అపార్ట్‌మెంటు 2వ అంతస్తుకు చేరుకుని ఓ ఫ్లాట్‌కు తాళం ఉన్న విషయాన్ని గమనించి తన వద్ద ఉన్న సుత్తితో ఇంటి తాళం పగులగొట్టి లోనికి చొరబడి బీరువా తెరిచి అందులోని బంగారు ఆభరణాలు, నోకియా ఫోన్‌తో పాటు నగదును దొంగలించాడు. తిరిగి 20 రోజుల తర్వాత ముకుంద్ సినిమా హాల్ వెనుక కాలనీలో నడుచుకుంటూ వెళ్తుండగా భారత్ రెసిడెన్సీలో తాళం వేసి ఉన్న ఓ ఇంటిని గమనించి తాళం పగులగొట్టి అల్మారాలోని బంగారు ఆభరణాలను, వెండి వస్తువను దొంగలించాడు.