రంగారెడ్డి

భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఏప్రిల్ 29: మేడ్చల్ మండలం కండ్లకోయ గ్రామ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద శనివారం హెచ్‌ఎండిఎ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య అనధికారిక కట్టడాల కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు. కండ్లకోయ ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్థల వివాదం కోర్టులో ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం జూన్ 2వ తేదీ వరకు జంక్షన్ పనులు పూర్తి చేసి రాకపోకలు ప్రారంభించాలని ఉద్ధేశ్యంతో పనులను వేగవంతంగా నిర్వహిస్తున్నారు. జంక్షన్ చుట్టూ నిర్మిస్తున్న సర్వీసు రోడ్డులో భాగంగా సుత్తారిగూడ గ్రామ పరిధిలో నిర్మించే సర్వీసు రోడ్డులో ఎస్.సుధాకర్‌రెడ్డికి చెందిన భవనాలు, గిడ్డంగులు ఉన్నాయి. శుక్రవారం రాత్రి హెచ్‌ఎండిఎ అధికారులు సుధాకర్‌రెడ్డికి తాఖీదులు జారీ చేశారు. శనివారం ఉదయం 8 గంటలకు హెచ్‌ఎండిఎ అధికారులు పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో యంత్రాలతో సుత్తారిగూడ సర్వీసు రోడ్డు నిర్మించే స్థలానికి చేరుకున్నారు. సర్వీసు రోడ్డు నిర్మించే స్థలంలో ఉన్న భవనాలను, గోడౌన్‌ను కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇంతలో సమాచారం అందుకున్న సుధాకర్‌రెడ్డి, అతని కుమారులు పలువురు కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. కూల్చివేతలు ప్రారంభించగానే సుధాకర్‌రెడ్డి, అతని కుమారులు కూల్చివేతలను అడ్డుకున్నారు. రాత్రికిరాత్రి నోటీసులు ఇచ్చి తెల్లవారుఝామున కూల్చివేతలు ఎలా చేపడతారని అడ్డుకున్నారు. కూల్చివేతలు చేడతున్న యంత్రాలకు అడ్డుపడ్డారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు సమయం ఇవ్వాలని సుధాకర్‌రెడ్డి, అతని కుమారులు.. హెచ్‌ఎండిఎ అధికారులకు మొరపెట్టుకున్నారు. తాము చేసేదేమిలేదని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకోవాల్సిందేనంటూ స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న బిజెపి మాజీ అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి అక్కడకు చేరుకుని హెచ్‌ఎండిఎ అధికారులతో తీవ్ర వాగ్వివాదానికి దిగారు. నోటీసులు ఇచ్చిన వెంటనే కూల్చివేతలు ఎలా చేపడతారని నిలదీశారు. బాధితులకు సమయం ఇవ్వాలని కోరారు. భవనాలు, గోడౌన్‌లలో ఉన్న వస్తువులను తొలగించకుండా కూల్చివేతలు చేపడితే యాజమానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, వారం రోజులు సమయం ఇస్తే భవనాల్లో ఉన్న వస్తువులను తొలగిస్తామని చెప్పారు. తమ పరిధిలో ఏమి లేదని ఉన్నతాధికారులతో మాట్లాడుకోవాలని హెచ్‌ఎండిఎ అధికారులు సూచించారు. ఫోన్‌లో ఉన్నతాధికారులతో మాట్లాడినప్పటికీ పెద్దగా స్పందించలేదు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఎన్‌ఫోర్స్‌మెంటు డిఎస్‌పి శ్రీనివాస్ తన సిబ్బందితో వచ్చి అడ్డుకున్న వారినందరినీ దూరం పంపించి కూల్చివేత పనులను వేగవంతం చేశారు. దీంతో భవన యాజమాని సుధాకర్‌రెడ్డి, అతని కుటుంబ సభ్యులు తీవ్ర అవేదన వ్యక్తం చేశారు. లక్షలు వెచ్చించి నిర్మించిన నిర్మాణాలు కళ్లెదుటే పేకమేడల్లా కూలిపోతుంటే తట్టుకోలేక బోరున విలపించారు. హెచ్‌ఎండిఎ ఎన్‌ఫోర్స్‌మెంటు సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు కూడా కూల్చివేతల్లో పాలుపంచుకున్నారు. హెచ్‌ఎండిఎ ఇంజనీరింగ్ విభాగం, లాండ్ సర్వే విభాగం అధికారులు కిషోర్‌కుమార్, దినేశ్ పాల్గొన్నారు.

జిల్లాలో 17 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

జెసి సురేష్ పొద్దార్ వెల్లడి
వికారాబాద్, ఏప్రిల్ 29: వికారాబాద్ జిల్లాలో 17 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ సురేష్ పొద్దార్ వెల్లడించారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో మే ఒకటో తేదీన సాయంత్రం నాలుగు గంటలకు తాండూర్‌లోని డిసిఎంఎస్ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి డాక్టర్ పి.మహేందర్‌రెడ్డి ప్రారంభించనున్నట్లు చెప్పారు. అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు లక్ష్మినారాయణపూర్, ఐదు గంటలకు యాలాల్‌లో కేంద్రాలను మంత్రి ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
ఐకెపి ద్వారా కొనుగోలు చేసే కేంద్రాన్ని ధారూర్ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో వికారాబాద్ శాసనసభ్యుడు బి.సంజీవరావు ప్రారంభిస్తారని అన్నారు. అదే రోజు తాండూర్ డివిజన్‌లోని తాండూర్, లక్ష్మినారాయణపూర్, యాలాల్, మంబాపూర్, నాగారం, బషీరాబాద్, జుంటుపల్లిలో డిసిఎంఎస్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జెసి వివరించారు. కులకచర్ల, పాలెపల్లిలలో ఐకెపి ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గతవారంలో పరిగి డివిజన్‌లోని పరిగి, దాదాపూర్, గండీడ్, మహ్మదాబాద్, నంచర్ల, దోమ, కులకచర్లలో ఏడు కేంద్రాలను ప్రారంభించామని, అందులో ఐదు డిసిఎంఎస్, రెండు పిఎసిఎస్‌లు నిర్వహిస్తున్నాయని తెలిపారు. వికారాబాద్ జిల్లాలో విలీనమైన మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న బొంరాస్‌పేట్, దౌల్తాబాద్, కొడంగల్ మండలాలకు సంబంధించి ఎనిమిది కేంద్రాలను ఐకెపి ద్వారా ఏర్పాటుకు నిర్ణయించినట్లు జెసి పేర్కొన్నారు. అందులో ఇప్పటికే ఆరు కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు.
ఇందులో కొడంగల్, పెద్ద నందివాగు, దౌల్తాబాద్ మండలంలో బాలంటపేట, నంచారం, బొంరాస్‌పేట మండలంలో నాగిరెడ్డిపల్లి, ఏరువుమల్ల, మెల్లకుంటలో ఏర్పాటు చేసినట్లు వివరించారు.
దౌల్తాబాద్, బొంరాస్‌పేట్ మండలాల్లో సోమవారం నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.