రంగారెడ్డి

ట్యాంకర్లతో మంచినీటి సరఫరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిగి, ఏప్రిల్ 29: మంచి నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో అవరసమైన చోట ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. పరిగి మండల పరిషత్ అధ్యక్షురాలు జ్యోతి అధ్యక్షతన శనివారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది.
సునీతారెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని, ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మిషన్ కాకతీయ పనులు చేసే దగ్గర నల్లమట్టిని చెరువుకట్టపై వేయకూడదని అన్నారు. పరిగి నుంచి నస్కల్ మీదుగా వికారాబాద్‌కు రోడ్డు పనులు తొందరగా అయ్యేవిధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు మీర్‌మైమూద్, మండల కోఆష్షన్ సబ్యుడు మునీర్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు ఉప్పరి రవి, జడ్పీటిసి పద్మమ్మ పాల్గొన్నారు.
సమస్యలతో కుటుంబాలను పాడు చేసుకొవద్దు
గచ్చిబౌలి, ఏప్రిల్ 29: భార్యభర్తలు చిన్న సమస్యలతో కుటుంబాన్ని పాడు చేసుకొవద్దని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్యా సూచించారు. రాయదుర్గంలో ఏర్పాటు చేసిన మాదాపూర్ జోన్ ఫ్యామిలీ కౌన్సిల్ సెంటర్ ప్రారంభోత్సవానికి సిపి ముఖ్యఅతిధిగా విచేసి మాట్లాడుతూ భార్యభర్తల మధ్య చిన్నపాటి గొడవలు వచ్చినప్పటికీ సామరస్యంగా పరిష్కరించు కోవాలని చెప్పారు. కౌనె్సలింగ్‌తో కూకట్‌పల్లిలో విడిపొవాలని అనుకున్న 20కుటుంబాలు తిరిగి సుఖంగా కలిసి ఉంటున్నారని గుర్తుచేశారు. మాజీ న్యాయమూర్తి నాగేశ్వరరావు మాట్లాడుతూ గతంలో ఎఫ్‌ఐఆర్ అయిన తరువాతే కేసులు న్యాయస్థానాలకు వచ్చేవని, దీంతో బాధితుడు కొంత ఇబ్బంది పడేవారని కౌన్సిలింగ్ సెంటర్ వలన చిన్న సమస్యలు పరిష్కారం అవుతాయని సూచించారు.
మాదాపూర్ డిసిపి విశ్వప్రసాద్ మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థ వలనే మనకు ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. అంకుర ఫౌండేషన్ నిర్వహకురాలు సునీత మాట్లాడుతూ భార్యభర్తల గొడవలో రాజకీయ నాయకుల జోక్యం తగదని సూచించారు.
చందానగర్ మహిళ మండలి అధ్యక్షురాలు రేణుక మాట్లాడుతూ గృహ హింస పేరుతో ఒక్క మగవారినే బాధపెడుతున్నారని చిన్న సమస్యలను కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కరం అవుతాయని అలాంటి వారికి కౌన్సిలింగ్ సెంటర్లు మంచి వేదిక అని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు నవతారెడ్డి, పూజిత జగదీశ్వర్ గౌడ్, మాదాపూర్ ఎసిపి రమణకుమార్, మియాపూర్ ఎసిపి రవి కుమార్ పాల్గొన్నారు.