రంగారెడ్డి

రెండు మండలాల మధ్య సాగునీటి వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొంరాస్‌పేట, జూన్ 14: ఎన్నో సంవత్సరాలుగా మేం నష్టపోతున్నాం.. మాకు న్యాయం చేయండి.. ప్రాజెక్టు మాత్రం నిండుతోంది.. పంటలు చేతికి వచ్చే దశలో ఎండుతున్నాయి.. ప్రాజెక్టు నీటిని చౌర్యం చేస్తూ తమ పంటలను వారు పండించుకుంటున్నారు... ఆయకట్టు రైతులం మాత్రం అన్యాయమయిపోతున్నాం.. అంటూ మండల పరిధిలోని ఎర్పుమళ్ల గ్రామ రైతులు ఇటీవల జిల్లా కలెక్టర్ దివ్యను కలిసి ఫిర్యాదు చేశారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని బొంరాస్‌పేట, దోమ మండలాల తహశీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. దీంతో బుధవారం బొంరాస్‌పేట తహశీల్దార్ రాజేందర్‌రెడ్డి, దోమ తహశీల్దార్ అజిమున్నీసా బేగం.. ఇరు మండలాలల సాగునీటి అధికారులు, సర్వేయర్, ఎస్‌ఐలతో కలిసి కాకరవాణి ప్రాజెక్టు దగ్గరకు వచ్చారు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండితే నిల్వ ఉండే శిఖం భూమిని సర్వే చేసి హద్దులు నిర్ణయించారు. కాగా దోమ మండలానికి చెందిన గిరిజన రైతులు కొద్దిసేపు సర్వేను అడ్డుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో తమ పొలాలు మునిగి పోయాయని, మిగిలిన కొద్దిపాటి భూములకు ప్రాజెక్టు నీటిని వాడుకొని సాగు చేసుకుంటున్నామని ఇప్పుడు నీటిని వాడుకోవద్దంటే ఎలా అని అధికారులను ప్రశ్నించారు.
కలెక్టర్ ఆదేశాల ప్రకారం తాము హద్దులు నిర్ణయించేందుకు వచ్చామని, ఏమైన ఇబ్బందులు ఉంటే కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని, సర్వేను అడ్డుకోవడం సరికాదని సూచించారు. రెండు మండలాలకు చెందిన రైతులు అక్కడే ఉండటంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అక్కడే ఉండటంతో రైతుల మధ్య గొడవలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నీటి పారుదల శాఖ డిఇలు రామార్జునం, కిరణ్, ఎఇ వినయ్, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, హరిప్రసాద్, ఆర్‌ఐలు అనిత, సురేష్, సర్వేయర్ మల్లేషం పాల్గొన్నారు.

వైద్య ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని ఆందోళన

ఘట్‌కేసర్, జూన్ 14: వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని జిల్లా మెడికల్ ఎంప్లారుూస్ యూనియన్ అధ్యక్షుడు జి.మల్లేష్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఘట్‌కేసర్ మండల కేంద్రంలోని వైద్య విధాన పరిషత్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో తెలంగాణ మెడికల్ ఎంప్లారుూస్ యూనియన్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బందితో పాటు జిల్లా యూనియన్ నాయకులు, సిపిఐ, ఎఐటియుసి నాయకులు ఆసుపత్రి ముందు ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిత్యం విధి నిర్వహణలో భాగంగా రోగులకు సేవలు అందిస్తున్నామని, ఉద్యోగులకు ఆరోగ్య సమస్యలు వస్తే ఆదుకునే నాథుడు లేడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో పని చేస్తున్న శానిటరీ సిబ్బందిని వెంటనే రెగ్యులర్ చేస్తు ఇఎస్‌ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగులకు వెంటనే పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బాలునాయక్, మెడికల్ కాంట్రాక్టు యూనియన్ జిల్లా కార్యదర్శి కల్లూరి జయచంద్ర, మండల యూనియన్ అధ్యక్షుడు జానకి పాల్గొన్నారు.