రంగారెడ్డి

కత్తితో దాడి.. పరార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంకర్‌పల్లి జూన్ 17: హెల్మెట్ ధరించిన ఒక గుర్తు తెలియని వ్యక్తి మరొకరిపై కత్తితో దాడి చేయగా.. ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ఉన్న సంఘటన శనివారం శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ సంఘటన గ్రామంలో కలవరం లేపింది. స్థానిక ఎస్‌ఐ-2 బాల్‌రాజ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మహరాజ్‌పేట పరిదిలోని గోపులారం గ్రామానికి చెందిన పి.శ్రీను (34) తండ్రి బుచ్చయ్య ఎస్సీ కులానికి చెందినవాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే శ్రీనుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎప్పటి లాగానే టంగటూరు, కొజ్జగూడెం పరిధిలోని సర్వే నెంబర్ 466 భూమిని గతంలో వెంకట్‌రెడ్డి ద్యారా కొన్నాడు. ఆ భూమిని పార్టీకి చూపడానికి శనివారం ఉదయం సమారు పదిన్నర గంటల ప్రాంతంలో శ్రీనివాస్‌రావ్‌తో వెళ్లాడు. ఇంతలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ముఖానికి బట్ట కట్టుకుని హెల్మెట్ ధరించి శ్రీనుపై దాడిచేసి కడుపులో రెండు, మూడుసార్లు పొడిచి హత్యాయత్నం చేశాడు. అంతలో ఎదురుగా ట్రాక్టర్ రావడం చూసి పారిపోయాడు. బాగా రక్తం కారి కడుపులోని పేగు బయటకు వచ్చింది. అయినప్పటికీ శ్రీను తన కారును తానే నడిపించుకుంటూ టంగటూరుకు రావడంతో బంధువులకు విషయం తెలిసింది. వెంటనే మామ నర్సింలు చికిత్స నిమిత్తం శ్రీనును నగరంలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ విషయమై ఎస్‌ఐ-2 బాల్‌రాజ్ మాట్లాడుతూ శ్రీను పరిస్థితి విషమంగానే ఉందన్నారు. కత్తితో దాడి చేసిన వ్యక్తి ఎవరో తనకు తెలియదని ఆసుపత్రిలో శ్రీను చెప్పినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

కూతురు దగ్గరకు వచ్చి తప్పిపోయిన తండ్రి
బాలాపూర్, జూన్ 17: మీర్‌పేట్ తిరుమలనగర్‌లో ఉండే తన కూతురు దగ్గరకు వచ్చి తప్పిపోయిన ఓ తండ్రి ఉదంతం మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నెల్లురు జిల్లా కొండపూర్ మండలం చింతలదేవి గ్రామానికి చెందిన సుంకర నర్సింహ (68) వృత్తి వ్యవసాయం. నర్సింహ మీర్‌పేట్ తిరుమలనగర్‌లోని తన కూతురు దగ్గరకు వచ్చి, ఈనెల 15న బయటకు వెల్లి వస్తానని ఇంటి నుంచి వెళ్లాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి ఎంతకూ తిరిగి రాకపోవడంతో అతని బంధువు మామిడిపల్లి మహేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య

కొత్తూరు, జూన్ 17: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వివరించారు. శనివారం కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా సర్కారు బడుల్లో వౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు వివరించారు. పాఠశాలకు వచ్చే ప్రతి విద్యార్థికి పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు వంటి ఎన్నో సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని వివరించారు. ప్రతి చిన్నారి ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విధంగా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని కోరారు. కార్పొరేట్ స్కూళ్లకు వెళ్లితే లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఫలితం రావడం లేదని, కానీ ప్రభుత్వ బడుల్లో విద్యను అభ్యసిస్తే ఎంతో మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కొందుర్గు: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని కొందుర్గు ఎంపిడివో యాదయ్య వివరించారు. శనివారం మండల పరిధిలోని చిన్నఎల్కిచర్ల గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేస్తున్నట్లు వివరించారు. ప్రైవేట్ పాఠశాలలకు విద్యార్థులను పంపించకుండా సర్కారు బడులకు పంపించేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలని అన్నారు.
త్వరలోనే కెజి నుండి పిజి వరకు ఉచిత విద్యను కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని, ఈ అవకాశాన్ని అన్ని వర్గాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంఇఓ కిష్టారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసచారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.