రంగారెడ్డి

ఆర్టీసి మనుగడే లక్ష్యంగా శ్రమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, మే 19: ఆర్టీసి సంస్థ మనుగడే లక్ష్యంగా ప్రతి కార్మికుడు మరింత శ్రమించి లాభాల బాటలోకీ తీసుకురావాలని తెలంగాణ ఆర్టీసి చైర్మన్, రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అన్నారు. ఆర్టీసి ఉప్పల్ బస్సు డిపో, ఆర్టీసి జోనల్ వర్కు షాపులను గురువారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. డిపో పరిసరాలను తిరిగి గ్యారేజి, వాషాంగ్ ప్లాంట్‌ను పరిశీలించారు. డిపో ఆవరణలో మొక్కను నాటారు, ఇంకుడు గుంత నిర్మాణపనులను ప్రారంభించారు. అనంతరం కార్మికులనుద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని 95 డిపోల ద్వారా నిత్యం 90 లక్షల మంది ప్రయాణికులను చేరవేసేందుకు 56 వేల మంది కార్మికులు పని చేస్తున్నట్టు తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం తెలంగాణ ఆర్టీసి అందిస్తూ మన్ననలను పొందుతున్నట్లు పేర్కొన్నారు. గతంలో రెండు వేల 200 కోట్ల అప్పుల్లో ఉన్న ఆర్టీసికి ఈ సంవత్సరం మరో 700 కోట్ల భారం పెరిగినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసి కార్మికులకు ముఖ్యమంత్రి కేసిఆర్ పెద్ద మనస్సుతో 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చి చరిత్ర సృష్టించినట్లు చెప్పారు. మూడు వితడలుగా ఇవ్వాల్సిన వేతన బకాయిలను ఒక్క ధపా ఇప్పటికే ఇచ్చినట్లు, ఉగాదికి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించేందుకు సంస్థకు భారంగా మారిందన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ సానుకూలంగా స్పందించి త్వరలో చెల్లిస్తారని భరోసా ఇచ్చారు. సంస్థను పరిరక్షించుకునేందుకు కార్మికులు, అధికారులు చేస్తున్న ప్రయత్నాలు పలిస్తాయనే విశ్వాసం ఉందన్నారు. సంస్థకు వచ్చే ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని, మరింత అదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రయాణికుల ఆదరణ పొందాలన్నారు.
అహర్నిశలు పని చేసి ఆక్యుపెన్సీ రేషియోను పెంచుకోవాలని, బస్సుల ఫెయిల్యూర్ పూర్తిగా తగ్గించాలని, సమయపాలన పాటిస్తూ ప్రయణికులను నిర్ణిత సమయంలో గమ్యస్థానానికి చేర్చేందుకు కార్మికుల నిరంతర కృషి ఉండాలన్నారు. మధ్యాహ్న సమయంలో సమయాన్ని వృథా చేయకుండా కిలోమీటర్లు పెరుగకుండా చెంజ్ ఓవర్ పాయింట్‌లను ఏర్పాటు చేసి ఆదాయాన్ని కొంతమేర పెంచినట్టు పేర్కొన్నారు. ఆర్టీసి సంస్థను పరిరక్షించటంతో పాటు కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ తనపై పెట్టిన బాద్యతను కర్యవ్య దీక్షతో నెరవేరుస్తానన్నారు. ఉప్పల్ డిపో అన్ని డిపోల కంటే మెరుగ్గా ఉందని, ప్రమాదరహిత డిపోలలో ముందు వరుసలో ఉందన్నారు.
ఆర్టీసి సంస్థను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. చైర్మన్ సోమారపు సత్యనారాయణ వెంట ఎగ్జిక్యూటివ్ డైరక్టర్లు రవీందర్, పురుషోత్తం, హైద్రాబాద్ రీజినల్ మేనేజర్ ఎం వెంకటేశ్వర్‌రెడ్డి, హైద్రాబాద్ డివిజనల్ మేనేజర్ ఆర్ కవిత, డిప్యూటీ సిఎంఇ మాధవరావు, డిపో మేనేజర్ జే రవీందర్‌రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్( ట్రాఫిక్) పి ఇందిర, అసిస్టెంట్ మేనేజర్ (పర్సనల్) సుభాషిణి, యూనియన్ నాయకులు కృష్ణ, సాయిలు తదితరులు ఉన్నారు.