రంగారెడ్డి

మియాపూర్ భూములపై సిబిఐ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జూన్ 17: మియాపూర్ భూముల విషయంలో సిబిఐచే విచారణ చేయించాలని మాజీ హోంమంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని క్లబ్‌లో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు మహ్మద్ హఫీజ్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరైన ఆమె విలేఖరులతో మాట్లాడారు. భూముల విషయంలో మంత్రి హరీష్‌రావు ఎక్కువ మాట్లాడారని, భూముల వెనుక కాంగ్రెస్ వారున్నారని, బండారం బయటపెడతామన్నారని, అందులో కాంగ్రెస్ వారున్నా సిబిఐ విచారణ జరగాల్సిందేనని అది ప్రజల ఆస్తి అని అభిప్రాయపడ్డారు. సిఎం కెసిఆర్ కులాల వారీగా విభజించి పాలించే ప్రయత్నం చేస్తున్నారని, భవిష్యత్ తరాలకు ఇది మంచిది కాదని సూచించారు.

మారని పాఠశాలల బోర్డులు..
విద్యార్థుల అయోమయం
కొత్తూరు రూరల్, జూన్ 17: జిల్లా మారినా..మండలం మారినా..పాఠశాల బోర్డులో పేర్లు మారకపోవడంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. జిల్లా, మండలం మారి దాదాపు 10నెలలు గడుస్తున్నా నేటి వరకు పాఠశాల బోర్డులో పేర్లు మార్చకపోవడం విడ్డూరంగా ఉంది. జిల్లాలు, మండలాల పునర్విభజన జరిగిన సమయంలోనే విద్యాసంస్థల్లోని బోర్డుల్లో పేర్లు మార్చాల్సి ఉంటుంది..కానీ నేటి వరకు ఉపాధ్యాయులు మార్చకపోవడం విద్యార్థులు తికమకపడుతున్నారు. ఇది ఎక్కడో కాదు..నందిగామ మండలం మామిడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నెలకొంది. నేటికి కొత్తూరు మండలం, మహబూబ్‌నగర్ జిల్లా పేర్లతో కూడిన బోర్డులు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే విద్యాశాఖ అధికారులు ఏ స్థాయిలో పనిచేస్తున్నారో అర్థమవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా మండల విద్యాశాఖ అధికారులు స్పందించి తక్షణమే బోర్డుల్లో పేర్లను మార్చాలని కోరుతున్నారు.