రంగారెడ్డి

ఇంటింటికీ కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూన్ 18: హబ్సిగూడ డివిజన్ పరిధిలోని రామంతాపూర్‌లో భారతీయ జనతా పార్టీ నాయకులు ఆదివారం పాదయాత్ర నిర్వహించారు. వెంకట్‌రెడ్డినగర్, రాంరెడ్డినగర్, వాసవీనగర్, కామాక్షిపురం కాలనీలలో ఇంటింటికీ వెళ్లి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
బిజెపి నాయకుడు వేములకొండ సోమశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో బస్తీ బస్తీకి బిజెపి కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో లింగయ్య గుప్త, పి.సోమయ్య గౌడ్, రఘు, ఎవి చారి, సంగప్ప, పి.వెంకన్న, గోపాల్, శంకర్‌రావు, రాజు గుప్త, విశ్వనాథం, భవనాంద్, జ్ఞానేశ్వర్, మల్లేష్, సర్వయ్య, లక్ష్మణ్, వెంకటేశ్వర్లు పాల్గొని ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో విజయవంతంగా అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. పలు పథకాలపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ రానున్న రోజుల్లో బిజెపి పాలన కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.

మైనారిటీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

జీడిమెట్ల, జూన్ 18: మైనారిటీల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేక్ అన్నారు. గాజులరామారం సర్కిల్ పరిధిలోని జగద్గిరిగుట్ట డివిజన్ రాజీవ్ గృహకల్ప, మగ్దూమ్‌నగర్, పొలాలబస్తీ, సీసలబస్తీ, శ్రీనివాస్‌నగర్, షరిఢీహిల్స్, శివానగర్‌లో రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లింలకు ఎమ్మెల్సీ రాజుతో కలిసి దుస్తులను పంపిణీ చేశారు. గాజులరామారం డివిజన్ చంద్రగిరినగర్‌లోని మసీదులో ముస్లింలకు దుస్తులను అందజేశారు. వివేక్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ అభివృద్ధి చేసి చూపుతున్నారని అన్నారు. నిరుపేద ముస్లింలను దృష్టిలో పెట్టుకుని షాదీ ముబారక్ పథకాన్ని అమలుపరిచారని తెలిపారు. రంజాన్ పండుగను అధికారికంగా నిర్వహించడంతో పాటు ఇఫ్తార్ విందు, బట్టల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌లు జగన్, రావుల శేషగిరి, నాయకులు సయ్యద్ రషీద్, సురేశ్‌రెడ్డి, జైహింద్, మహమూద్, హజ్త్ అలి, హజి, ముస్త్ఫా, షర్‌ఫుద్దీన్, అన్వర్, అహ్మద్, ఖలీల్, ఖయ్యూమ్, పాషా, మారయ్య, కిషన్, ఉమాపతి, మనోహర్, రవిందర్‌రావు, శివాజిరావు, సుధాకర్, నవీన్, అంజయ్య పాల్గొన్నారు.
టిఆర్‌ఎస్‌లో టిడిపి కార్యకర్తల చేరిక
గాజులరామారం డివిజన్ ఇంద్రానగర్, రోడామిస్రీనగర్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు టిఆర్‌ఎస్‌లో చేరారు. కెపి వివేక్ వారికి పార్టీ కండువాలను వేసి ఆహ్వానం పలికారు. వివేక్ మాట్లాడుతూ ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి తెరాసని పటిష్టం చేయాలని సూచించారు. కార్పొరేటర్ రావుల శేషగిరి, బాబు, గోపి, హనీఫా, తిరుపతి, ప్రభు, సలీమ్ పాల్గొన్నారు.