రంగారెడ్డి

శాంతిభద్రతల మెరుగుతోనే వెల్లువలా పరిశ్రమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జూన్ 19: తెలంగాణ పోలీసులు శాంతిభద్రతలు పరిరక్షించడంలో ముందున్నందుకే ప్రపంచ దేశాలు.. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌లో 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పోలీస్‌స్టేషన్ భవనాన్ని, 70 లక్షల రూపాయల వ్యయంతో జిల్లా కేంద్రంలో నిర్మించిన మహిళా పోలీస్‌స్టేషన్ భవనాన్ని, మోమిన్‌పేట మండలం కేంద్రంలో నిర్మించిన సిఐ కార్యాలయాన్ని ప్రారంభించారు. విలేఖరుల సమావేశంలో నాయిని మాట్లాడుతూ భారతదేశంలో తెలంగాణ పోలీస్ అకాడమీ నెంబర్ స్థానంలో నిలవనుందని చెప్పారు. ఇప్పటికే 500 కోట్ల రూపాయలతో అకాడమీలో నిర్మాణాలు జరిగాయని తెలిపారు. పోలీసు శాఖను పటిష్టం చేసేందుకు 18వేల ఉద్యోగాలను క్యాబినెట్ మంజూరు చేసిందని, ఖాళీగా ఉన్న 8900 పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. మూడు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా ఒక్క సంఘటన జరగలేదని చెప్పారు. కానిస్టేబుల్ మొదలుకొని పోలీసు ఉన్నతాధికారి వరకు అభినందనీయులని తెలిపారు. భారతదేశానికి తెలంగాణ పోలీసు ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. యూత్ ఆర్గనైజింగ్, బస్తీల్లో జాబ్‌మేళాలు తదితర కార్యక్రమాలు పోలీసు శాఖ చేపడుతోందని వివరించారు. మిషన్‌కాకతీయ కింద చెరువులను దత్తత తీసుకుని పూడికతీయించి పోలీసు ఉన్నతాధికారులు.. అభివృద్ధికి కృషి చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌కు ఇన్నోవా, ఇతర వాహనాల కోసం నిధులను ఇచ్చామని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త పోలీస్‌స్టేషన్‌ల ఏర్పాటుతో పాటు, పాత పోలిస్‌స్టేషన్ భవనాలు ఆధునీకరించి కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దామని పేర్కొన్నారు. 31 జిల్లాలకు పూర్తిస్థాయిలో పోలీసు ఉన్నతాధికారులను కేటాయించామని వివరిచారు. త్వరలోనే 11వేల మంది పోలీసు కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభం కానుందని, అనంతరం ఎస్‌ఐల శిక్షణ ప్రారంభమవుతుందని తెలిపారు. గిట్టనివారు తెలంగాణ వస్తే నక్సలిజం, హిందూ-ముస్లిం గొడవలు జరుగుతాయని దుష్ప్రచారం చేశారని, వాటిని తలదనే్న విధంగా పోలీసులు పని చేస్తున్నారని అభినందించారు. సింగిల్‌విండో విధానంతో 15 రోజుల్లో పరిశ్రమల ఏర్పాటుకు సిఎం అనుమతి ఇవ్వడంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో 300 పరిశ్రమలు ఏర్పాటు కాగా, 150 పరిశ్రమలకు ఇటీవలే అనుమతి లభించిందని, మరో 150 పరిశ్రమలకు దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. కోట్లాది రూపాయలు.. మిషన్ కాకతీయకు వెచ్చించినందుకే చెరువులు కళకళలాడుతున్నాయని, మన నిధులు మనం ఖర్చు చేస్తున్నందుకే మిషన్ భగీరథ పనులు కొనసాగతున్నాయని, ఆర్థికంగా రాష్ట్రం నెంబర్ వన్‌గా నిలిచిందని వివరించారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న 1500 మందిపై కేసులు ఎత్తివేశామని, అమరవీరుల కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రవాణ శాఖ మంత్రి డాక్టర్ పి.మహేందర్‌రెడ్డి, డిజిపి అనురాగ్‌శర్మ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, వికారాబాద్, చేవెళ్ల ఎమ్మెల్యేలు బి.సంజీవరావు, కె.యాదయ్య, ఐజి స్టీఫెన్ రవీంద్ర, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డి, జిల్లా ఎస్పీ టి.అన్నపూర్ణ, డిఎస్పీ టి.స్వామి, సిఐలు నిర్మల, ఉపేందర్ పాల్గొన్నారు.

కెసిఆర్ మాటలకు.. పనులకు పొంతన లేదు

వికారాబాద్, జూన్ 19: మూడు సంవత్సరాల క్రితం కెసిఆర్ చెప్పిన మాటలకు చేసిన పనులకు పొంతన లేకుండా ఉందని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం సోదరుడు మర్రి రవీందర్‌రెడ్డి 75వ జన్మదిన వేడుకలకు హాజరైన సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ ప్రజలను ఆకర్షించే విధంగా ఎప్పటికపుడు మాటలను మార్చుకుంటూ ముందుకు వెళ్తున్నారే తప్ప చెప్పిన మాటలు ఆచరించే ధోరణి లేదని చెప్పారు. మర్రి చెన్నారెడ్డి సిఎంగా ఉన్నపుడు జివో బయటకు వస్తేనే విమర్శలు వచ్చేవని, అలాంటిది సిఎం కెసిఆర్.. గంటకో జీవో తీస్తున్నారని ఎద్దేవా చేశారు. క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ, బిసిల భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారే తప్ప అతీగతీ లేదని, మిగతా అన్ని వర్గాలను మోసం చేసేదిగా వ్యవహారం ఉందని పేర్కొన్నారు. గతంలో టిడిపి ప్రభుత్వం పెట్టిన ఆదరణ పథకం మాదిరిగానే గొర్రెల పథకం ఉందని, క్షేత్ర స్థాయిలో పూర్తి అధ్యయనం చేయకుండా పథకాలు ప్రారంభించడం ఏమిటని ప్రశ్నించారు. ఉత్తర భారతం నుండి గొర్రెలు తెస్తే ఈ వాతావరణానికి తట్టుకుంటాయో లేదో ఆలోచించకపోవడం విడ్డూరమని చెప్పారు. రెండు సంవత్సరాల్లో గొర్రెలతో రూ.20వేల కోట్లు సంపాదిస్తారనడం హాస్యాస్పదమని తెలిపారు. సూచనలు, సలహాలు తీసుకుని పథకాలు ప్రారంభించాలని హితవు పలికారు. ఎవరూ ఊహించని రీతిలో సంగారెడ్డిలో రాహుల్‌గాంధీ సభ విజయవంతమైందని, ప్రజల్లో ఉత్సాహం కనిపిస్తోందని, రాహుల్ నాయకత్వంపై ఆశగా ఎదురు చూస్తున్నారని న్నారు. తెలంగాణలోనే కాకుండా దేశంలో కాంగ్రెస్‌కి ప్రత్యేక స్థానం, ఓటు బ్యాంకు ఉందని అభిప్రాయపడ్డారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ విఫలమైందని పేర్కొన్నారు. ప్రాజెక్టులకు రిజర్వాయర్‌ల నిర్మాణం అవసరం లేకున్నా ఖర్చు పెంచి కమిషన్‌ల సంపాదనకే రీడిజైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు. 20 టిఎంసిల నీటి నిలువ విషయంలో సిఎంను బహిరంగ చర్చకు రమ్మని సవాల్ చేశామని.. రాలేదని, హుస్సేన్‌సాగర్ పరిసర మురికివాడల విషయంలో కెటిఆర్‌పై చీటింగ్ కేసు పెట్టామని గుర్తుచేశారు.