రంగారెడ్డి

ఆలయంలో విగ్రహం చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెపిహెచ్‌బీ కాలనీ, జూన్ 27: గుర్తు తెలియని దుండగులు ఆలయాల్లోని హుండీ పగుల గొట్టడంతో పాటు మరో ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని అపహరించుకపోయిన సంఘటన కెపిహెచ్‌బి కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... కూకట్‌పల్లి జెఎన్‌టియు సమీపంలో ఉన్న శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున ఆలయంలో అర్ధరాత్రి ఆలయ ముఖ ద్వార తాళాలు పగులగొట్టి గర్భ గుడిలో ఉన్న పంచలోహ భ్రమరాంబ అమ్మవారి విగ్రహాన్ని ఎత్తుకెళ్ళారు. అదే దేవాలయంలో హుండీని సైతం అపహరించేందుకు యత్నించగా శబ్దం రావడంతో వాచ్‌మెన్ లేచి స్థానికులకు ఫోన్ చేయగా స్థానికుల రాకతో దుండగులు అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్తూ హుండీని పగులగోట్టి స్వామి వారి విగ్రహాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

శిథిలావస్థలో ప్రభుత్వ పాఠశాలలు
అమనగల్లు, జూన్ 27: అమనగల్లు మండలంలోని పలు గ్రామల్లో ప్రభుత్వ పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. చక్కని వాతవరణంలో విద్యాబుద్ధులు నేర్వాల్సిన చిన్నారులు సమస్యలతో సతమతమవుతున్నారు. ఎండకు, వర్షాలకు నిలువ నీడలేక చిల్లులు పడిన భవనాల్లో మొండి గోడల మధ్య భయం గుప్పిట్లో చదువులు చాలిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కెజి టు పిజి వరకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేస్తామని ఇచ్చిన హామీలు నీటి ముటలుగానే మిగిలిపోయాయి. భవనాలు శిథిలావస్థలో ఉండటంతో గత్యతరం లేకపోవడంతో కష్టంగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అమనగల్లు, కడ్తాల్ మండలల్లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దయానీయంగా ఉంది. అమనగల్లు పట్టణంలో బస్టాండ్ సమీపంలోని మండల పరిషత్ సిబ్బంది గృహాలలో ప్రాథమిక పాఠశాలలను నిర్వహిస్తున్నారు. ఇది పూర్తిగా పడిపోయే స్థితికి చేరింది. గతంలో పూర్వపు అమనగల్లు సమితిగా ఉన్నప్పడు నాలుగు దశబ్దాల క్రితం నిర్మించిన భవనాల్లోనే విద్యార్థులు విద్యను అభ్యసించడం శోఛనీయం. పలు పాఠశాలలో పైకప్పులపై చెట్లు ఏపుగా పెరగడం, ఇనుప చువ్వలు దర్శనమివ్వడం, పెచ్చులు ఉడిపడటం నిత్యకృత్యమైంది. విఠాయిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పెంటతాండలో ఉన్న ప్రాథమిక పాఠశాల భవనం మూగజీవులకు నిలయంగా మారింది.