రంగారెడ్డి

కేసిఆర్‌కు పతనం తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, మే 20: నియంతలా వ్యవహరిస్తూ ప్రతి పక్ష పార్టీల నాయకులను అవమానపరుస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్‌కు పతనం తప్పదని జిల్లా బిజెపి అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి హెచ్చరించారు. మండల కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం నుండి వచ్చిన నిధులను తాము చేస్తున్న అభివృద్ధిగా చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కేసిఆర్‌ను కేంద్ర ప్రభుత్వ నిధులపై శే్వతపత్రం విడుదల చేయాలని కోరితే కొత్త బిచ్చగాళ్లని సంబోధించటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం అని విమర్శించారు. కేసిఆర్‌కు మతి తప్పి సోయి లేకుండా మాట్లాడుతున్నాడని, కేంద్రం విడుదల చేస్తున్న నిధులతో రెండు పడకల గదుల ఇళ్లనిర్మాణం, పింఛన్లు, కరువు నిధులను సొంతంగా చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు.
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కేసిఆర్ వీధి కార్యకర్తలగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో నియంతలా ప్రవర్తిస్తూ ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులను పార్టీలో చేర్చుకునే శ్రద్ధ అభివృద్ధిపై ఉందా అని ప్రశ్నించారు. కేంద్రం నుండి 790 కోట్ల నిధులు కరవు నివారణకు, జాతీయ రహదారుల అభివృద్ధికి 44వేల కోట్ల నిధులు ఇచ్చినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచినా ఆయన చేపట్టిన అభివృద్ధి శూన్యం అన్నారు. కల్లబొల్లి మాటలు చెప్పి కాలం గడుపుతున్న కేసిఆర్ చిత్తశుద్ధి ఉంటే చేపట్టిన అభివృద్ధిపై పెదవి విప్పాలని డిమాండ్ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటులో రంగారెడ్డి జిల్లాను అస్థిర పర్చే ఆలోచనను విరమించుకోవాలని, అఖిల పక్ష పార్టీల సలహాలు తీసుకుని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీలను అవమాన పరిచే సోయి తప్పిన మాటలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. మరోసారి చిల్లర మాటలు మాట్లాడితే రాష్టవ్య్రాప్త ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర నాయకులు గుండ్ల బాల్‌రాజు, నానావత్ బిక్కునాయక్, నాయకులు సగ్గు మోహన్‌రావు, కొమ్మిడి మోహన్‌రెడ్డి, పత్యపు పాండురాజు, రాజిరెడ్డి పాల్గొన్నారు.