రంగారెడ్డి

ఖరీఫ్ సీజన్‌పై మంత్రి పట్నం సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శామీర్‌పేట, మే 24: రానున్న ఖరీఫ్ సీజన్‌లో సాధారణ వర్షపాతం నమోదు కానున్న దృష్ట్యా రైతులకు విత్తనాలు, ఎరువులు సమయానికి ముందే అందజేయాలని రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారులను రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం మంత్రి సచివాలయంలోని తన చాంబర్‌లో రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో ఖరీఫ్ సీజన్ సంబంధిత ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో దాదాపు 200935 హెక్టార్ల భూమి సాగులోకి రానుందని అన్నారు. ఈ ఏడాది సోయా, మొక్కజొన్న, కందుల పంటలను పండించేందుకు ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విత్తనాల పంపిణీ చేస్తోందని చెప్పారు. దాదాపు 7333 లక్షల రూపాయలు ఇన్‌పుట్ సబ్సిడీ ద్వారా ఇస్తున్నట్టు చెప్పారు. సాధారణ వర్షపాతం ఉంటుందని ఆశిస్తూ మొక్కజొన్న 54937 హెక్టార్లు, కందులు 63247, పత్తి 19147, వరి 25184, పెసర్లు 8881, మినుములు 5355, జొన్నలు 9630, సోయా 11597 ఇతర పంటలు 36984 హెక్టార్ల భూమి సాగులోకి రానున్నట్లు తెలిపారు. ఎరువుల పంపిణీలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాలని అన్నారు. జిల్లాలో తాండూరు, పరిగి, వికారాబాద్, ఇబ్రహీంపట్నం, శంకర్‌పల్లి, హైదరాబాద్‌లోని మూసాపేటలో ఎరువుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈసారి మండలాల్లో ఉన్న వివిధ వ్యవసాయ సొసైటీల ద్వారా విత్తనాలు ఎరువులు రైతులకు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలో దాదాపు 166379 మెట్రిక్ టన్నుల ఎరువులు ఆవశ్యకత ఉంటుందని తెలిపారు. వీటిలో డీలర్ల ద్వారా 29985, మార్క్‌ఫెడ్ ద్వారా 27809, బఫర్ స్టాక్ కింద 65000 మెట్రిక్ టన్నుల ఎరువులు ఉన్నట్లు మంత్రి తెలిపారు. భూసార పరీక్ష కోసం ఇప్పటి వరకు 7050 సాంపిళ్లను పరీక్ష చేసినట్లు వెల్లడించారు. 2016-17 సంవత్సరంలో వ్యవసాయ పరికరాలు ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు సబ్సిడీ ద్వారా అందిస్తామని అన్నారు. దాదాపు 28 కోట్ల నిధులు వ్యవసాయ పరికరాలు కొనుగోలు కోసం మంజూరు చేశామని పేర్కొన్నారు. సరైన లబ్ధిదారులను గుర్తించి వ్యవసాయ పరికాలను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.
బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించామని, రైతులకు ఇబ్బంది కలుగుకుండా ఈ ఖరీఫ్ సీజన్‌లో ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని వివరించారు. సమావేశంలో కలెక్టర్ రఘునందన్‌రావు, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ జగదీష్, బ్యాంకర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.