రంగారెడ్డి

ముగిసిన పెద్దమ్మ దేవాలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మే 26: చిల్కానగర్‌లోని మల్లిఖార్జున్‌నగర్‌లో గల చిలుకేశ్వరగుట్టపైన శ్రీ పెద్దమ్మ దేవాలయంలో ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ముగిసాయి. మూడురోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకల్లో పెద్దమ్మ తల్లి కల్యాణం, అమ్మవారికి లలిత సహస్రనామ సామూహిక కుంకుమార్చన, బోనాలు, ఫలహార బండ్ల ఊరేగింపువంటి కార్యక్రమాలతో వార్షికోత్సవ వేడుకలు ముగిసాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవ నిర్వాహకులు, ఇతర ప్రముఖులను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఫలహార బండి ఊరేగింపులో స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్, నగరంలోని వేర్వేరు డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు జి.సరస్వతి, పులి జగన్, సామల హేమ, ఆలయ చైర్మన్ గోనె అంజయ్య, సభ్యులు అంబటి జగదీష్, బిక్షపతి, విఠల్, గోనె శ్రీకాంత్, పిట్టల నరేష్, పాల్గొని పోతరాజుల విన్యాసాలకు ఆకర్షితులై స్టెప్పులతో అనందాన్ని పంచుకున్నారు. ముదిరాజ్ సంఘానికి తెలపకుండా పెద్దమ్మ తల్లి వార్షికోత్సవ వేడుకలను నిర్వహించడంపై కొందరు సంఘం సభ్యులు వ్యతిరేకించడం గమనార్హం.