రంగారెడ్డి

కీసరను జిల్లా కేంద్రం చేసేందుకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, మే 27: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలకు కార్యకర్తలు ప్రచారం చేయాలని మేడ్చల్ ఎమ్మెల్యే ఎం.సుధీర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కీసరలోని కెబిఆర్ ఫంక్షన్‌హాల్‌లో మండల స్థాయి టిఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సుధీర్‌రెడ్డి హాజరయ్యారు.
కీసరను జిల్లా కేంద్రం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు. ఉద్యంమం వేరు ప్రభుత్వాన్ని నడపడం వేరని చెప్పారు. ఉద్యమ సమయంలో ఆత్మార్పణ చేసుకున్న అమరవీరుల కుటుంబాలకు పది లక్షలు ఆర్థిక సాయంతో పాటు జూన్ 2న కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. కల్యాణలక్ష్మీ, సిఎం రిలీఫ్‌ఫండ్ పథకాలతో ఎంపిడిఓకు ఎలాంటి సంబంధం ఉండదని వివరించారు.
మిషన్ కాకతీయ పధకం ద్వారా గ్రామాల్లోని చెరువులన్నీ అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అర్హులందరికీ రేషన్‌కార్డులు, ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందించడంలో స్థానిక నేతలు ముందుండాలని అన్నారు. ప్రతి మూడు నెలలకోసారి కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా కుత్బుల్లాపూర్, భువనగిరి, యాదగిరిగుట్ట, ఉప్పల్ ప్రాంతాలను కలిపి యాదాద్రి జిల్లా పేరుతో ఏర్పాటు చేసి, కీసరను జిల్లా కేంద్రంగా ఎర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కొరు. కార్యక్రమంలో ఎంపిపి ఆర్.సుజాత, వైస్‌ఎంపిపి ఎం.స్వప్న వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌లు కె.చంద్రారెడ్డి, నానునాయక్, అనిల్, గణేశ్, రాజలింగం, లావణ్య, ఖలీల్, ఎంపిటిసిలు ఎం.పెంటయ్య, రాధిక, సంగీత, ఉపసర్పంచ్‌లు వెంకట్‌రాంరెడ్డి, ఆర్.శ్రావణ్‌కుమార్, అమరేందర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు ఎం.రవికాంత్, ఎ.జంగయ్య, ఎం.రాఘవేందర్, నర్సింహగౌడ్, యాదగిరిగౌడ్, లక్ష్మారెడ్డి, భరత్‌రెడ్డి, వెంకటేశ్, కిరణ్‌గుప్తా, సాయినాథ్‌గౌడ్ పాల్గొన్నారు.