రంగారెడ్డి

సత్వరమే పెండింగ్ కేసుల పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, మే 30: పెండింగ్‌లో ఉన్న కేసులు, వారెంటు కేసులను సత్వరమే పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా ఎస్పీ బి.నవీన్‌కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ పెండింగ్ కేసుల పరిష్కారానికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదిదారుడితో మర్యాదగా మాట్లాడాలని, కావాల్సిన న్యాయాన్ని చట్టపరిధిలో సత్వరమే అందించాలని స్పష్టం చేశారు.
ఘోర నేరాలు, దోపిడి దొంగతనాలు, మహిళలపై అఘాయిత్యాలు తదితర నేరాల నివారణ, శాంతి భద్రతల పర్యవేక్షణ మొదలగు అంశాలపై సూచనలు చేశారు. పోలీసు అధికారులు ఫిర్యాదిదారు వద్దగాని, ఇతర వ్యక్తుల నుండి డబ్బులు వసూలు చేసినట్లు తన దృష్టికి వస్తే తీవ్రంగా పరిగణించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సివిల్ కేసుల్లో పోలీసులు తలదూర్చరాదని చెప్పారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ ఎన్.వెంకటస్వామి, తాండూర్ ఎఎస్పీ చందనాదీప్తి, వికారాబాద్ డిఎస్పీ టి.స్వామి, డిటిసి డిఎస్పీ లతామాధురి, సిఐ, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
బాల్య వివాహాల నిరోధానికి సహకరించాలి
బాల్య వివహాలను నిరోధించడంలో భాగంగా చైల్డ్‌లైన్ ఆఫీసర్లు, స్వచ్చంద సేవా సంస్థలతో సమన్వయం చేసుకుంటూ బాల్య వివాహాలు ఆపడం, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, పోలీసు కళా బృందంతో బాల్య వివాహాలపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో చైల్డ్‌లైన్ కన్వీనర్ వెంకటేశ్, ప్రొబెషనరి అధికారి నిహాల్, మహిత స్వచ్చంద సంస్థ నిర్వాహకుడు వెంకటేశ్ పాల్గొన్నారు.