రంగారెడ్డి

తాండూర్‌లో అవినీతి రాజ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, మే 30: తాండూరు మున్సిపాలిటీలో అవినీతి రాజ్యమేలుతుందని విపక్ష పార్టీలైన కాంగ్రెస్, టిడిపి, బిజెపి సభ్యులతో పాటు అధికార భాగస్వామ్యపక్షమైన ఎంఐఎం పార్టీ సభ్యులు సైతం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. 18 అంశాలతో కూడిన ఎజెండా అంశాలలో 18వ అంశం మినహా 17 అంశాలను కౌన్సిల్ సమావేశంలో సభ్యులు వాగ్వివాదాల మధ్య ఆమోదించారు. పట్టణంలో పారిశుద్ధ్యం, తాగునీటి ఎద్దడి నివారణ, అక్రమ నిర్మాణాలు, చెత్త తరలింపు, ట్రాక్టర్ నిర్వాహణ ఖర్చులు, మున్సిపల్ టౌన్‌ప్లానింగ్, అధికారిణి శైలజ అవినీతి అక్రమాలు, మున్సిపల్ ఆఫీసు ఔట్‌సోర్సింగ్ సిబ్బంది నియామకాల అవినీతి, పార్కుల అభివృద్థి పనులలో నిర్లక్ష్యంపై విపక్షాలు విరుచుకుపడ్డారు. ప్రస్తుత వేసవికాలంలో తాగునీటి సమస్య నివారణకు ట్యాంకర్ల ద్వారా తమ వార్డులలో నీటి సరఫరా చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఎంఐఎం ఫ్లోర్ లీడర్ ఆసీఫ్ హుస్సేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ ద్వారా ముస్లీం సంస్థల ద్వారా పట్టణంలో మూడు వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్, టిడిపి ఫ్లోర్‌లీడర్లు బి.సునీత సంపత్, ఎం.సుమిత గౌడ్ మాట్లాడుతూ తాగునీటి సరఫరాలో మున్సిపాలిటీ వాటర్ ట్యాంకర్లు మూడింటిని ప్రతి రోజు మూడు వార్డులకు ఒక్కో ట్యాంకర్ ద్వారా నిత్యం తొమ్మిది వార్డులలో సరఫరా చేస్తామని గత సమావేశంలో చైర్‌పర్సన్, అధికారులు ఇచ్చిన హామీలను మర్చిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. తాగునీటి పేరుతో లక్షల్లో ఖర్చులు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది నియామకంకోసం లంచాలు తీసుకున్నారని ఎంఐఎం కౌన్సిలర్ అరవింద్‌కుమార్ ఆరోపించారు. కౌన్సిల్ ఆమోదం లేకుండా ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. రహదార్లలో ఎక్కడబడితే అక్కడ చెత్తకుప్పలు దర్శనమిస్తుంటే శానిటేషన్ అధికారులు ఏం చేస్తున్నారని సభ్యులు నీరజాబాల్‌రెడ్డి, నర్సింహులు విరుచుకుపడ్డారు. పట్టణ ప్రణాళిక విభాగంలో అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి సిఫార్సు చేయాలని విపక్షాలు డిమాండ్ చేశారు. టిపిఓ శైలజను డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు సరెండర్ చేస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ
వేడుకలను విజయవంతం చేయాలి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని తాండూరు చైర్‌పర్సన్ విజయలక్ష్మి అన్నారు. కౌన్సిల్ సమావేశంలో జీరో ఆవర్ ముగిసిన అనంతరం అధికారులు, కౌన్సిలర్లతో కలిసి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ జూన్ రెండవ తేదీన సంబురాలను పార్టీలకతీతంగా ఘనంగా నిర్వహించాలని పేర్కొన్నారు. అదే రోజు జాతీయ జెండాలను ఆవిష్కరించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని, సంబురాలకు అన్ని ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు.