రంగారెడ్డి

రాష్ట్రంలోనే రాజేంద్రనగర్‌కు మంచి గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, మే 30: అంతర్జాతీయ స్థాయిలో రాజేంద్రనగర్ నియోజకవర్గానికి గుర్తింపు ఉందని, అదే స్థాయిలో అభివృద్ధిలో తీర్చిదిద్దుతూ ముందుకు దూసుకెళ్తున్నానని ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ అన్నారు. సోమవారం రాజేంద్రనగర్‌లో రూ.1.93 కోట్ల వ్యయంతో సీసీ రోడ్డు పనులు, సివరేజ్ పైపులైన్ పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజేంద్రనగర్‌కు అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలు ఉన్నాయని, అన్ని సంస్థలు నెలకొని ఉన్నాయని స్థాయిలో అభివృద్ధి చేయడానికి పోటీ పడి పని చేస్తున్నానన్నారు. నిత్యం అంతర్జాతీయ, దేశాల ప్రతినిధులు ఇక్కడకు వస్తూ పోతూ ఉంటారని వారి మన్ననలను పొందడానికి అభివృద్ధిలో రాజీపడకుండా రాజేంద్రనగర్‌ను సుందరంగా తీర్చిదిద్దుతున్నానని వెల్లడించారు. తెలంగాణలోనే రాజేంద్రనగర్‌కు అభివృద్ధిలో మంచి పేరు ఉందని ఆ పేరును నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నానన్నారు. సీఎం కేసీఆర్ చొరవతోనే ప్రత్యేక నిధులు రాజేంద్రనగర్‌కు కేటాయించడం జరిగిందని, త్వరలోనే రాజేంద్రనగర్‌లో కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ బస్సుయాత్రతో రాజేంద్రనగర్ దశ మారనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది అడిగినా కాదనకుండా నిధులు మంజూరు చేయడం జరుగుతుందని, దాన్ని సద్వినియోగం చేసుకొని రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో నెంబర్ వన్ స్థానంలో నిలబెడతానన్నారు. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొనిపోతూ అభివృద్ధిలో రాజీపడకుండా పని చేస్తున్నానని వివరించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ కార్పొరేటర్ కోరణి శ్రీలత, సర్కిల్ ఈఈ లచ్చిరామ్, పోరెడ్డి ధర్మారెడ్డి, మహేష్, దేవేందర్, మిద్దెల సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.