రంగారెడ్డి

నాలాలు కబ్జా చేస్తే ఖబర్దార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, మే 30: నాలాలు కబ్జా చేస్తే ఎంతటివారైనా వదిలిపెట్టమని నగర మేయర్ బొంతు రాంమోహన్ హెచ్చరించారు. శేరిలింగంపల్లి సర్కిల్ 12 పరిధిలోని దీప్తిశ్రీనగర్ వద్ద జాతీయ రహదారిపై నాలా మళ్ళింపు ఫిర్యాదుపై సోమవారం మేయర్ పరిశీలించారు. నాలా మళ్ళింపువల్ల పరిసర కాలనీలు వరద ముంపుకు గురవుతాయని చందానగర్ కార్పొరేటర్ బొబ్బనవతరెడ్డి, మాదాపూర్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్, మియాపూర్ కార్పొరేటర్ మేక రమేశ్, వెస్ట్‌జోన్ పరిధిలోని పలువురు కార్పొరేటర్లు మేయర్ దృష్టికి తీసుకెళ్ళారు. తిరుమల ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ బిల్డర్ ప్రకాశ్ చౌదరి దాదాపు మూడెకరాల్లో మల్టీఫ్లెక్స్ మాల్ నిర్మాణానికి అనుమతి తీసుకున్నారు. కొనే్నళ్లుగా పారుతున్న నాలాను మంజీరా పైపులైను పక్కనుంచే జాతీయ రహదారిపై తవ్వడంతో అధికారులు నిలిపేశారు. మంత్రులు, మేయర్ దృష్టికి తీసుకెళ్ళడంతో పరిశీలన జరుపుతున్నారు. నాలా వెళ్ళే కల్వర్టుకు అడ్డంగా బిల్డర్ గోడ కట్టడాన్ని చూసిన మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం క్రితం చీఫ్ ఇంజనీర్ సురేష్ పరిశీలించినా అక్రమంగా కట్టిన గోడను ఎందుకు తొలగించలేదని స్థానికులు నిలదీశారు. నాలా మళ్ళింపు పనులు, దీప్తి శ్రీనగర్ నాలాను క్షుణ్ణంగా పరిశీలించారు. కూకట్‌పల్లికి చెందిన ఓ మాజీ కార్పొరేటర్ రోడ్డును ఆక్రమించి షల్టర్లు వేశారని స్థానికులు చెప్పారు. నాలా మళ్ళింపు, వర ముంపు ప్రమాదం, సర్వే నెం.111లో గల ప్రభుత్వ స్థలం ఆక్రమణలపై మేయర్‌కు చందానగర్ కార్పొరేటర్ ఆధారాలతో చూపించారు. నాలాపై వేసిన స్లాబ్ తొలగించాలని జోనల్ కమిషనర్ గంగాధర్‌రెడ్డి, ఎస్‌ఐ మోహన్‌సంగ్‌ను మేయర్ ఆదేశించారు. నాలా మళ్ళింపుకు అనుమతి ఇవ్వడం తప్పు అని సర్కిల్ 12 ఉపకమీషనర్ వి.మమత మేయర్‌కు చెప్పారు. ఉన్నత స్థాయి అధికారులతో ఓ కమిటీవేసి తగిన చర్యలు తీసుకుంటామని మేయర్ వివరించారు. శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్, భారతినగర్ కార్పొరేటర్ వి.సింధు ఆదర్శరెడ్డి, ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ వెంకటేశ్‌గౌడ్, హైదర్‌నగర్ కార్పొరేటర్ జానకిరామరాజు, టిఆర్‌ఎస్ నాయకులు మొవ్వ సత్యనారాయణ, బొబ్బ విజయ్‌రెడ్డి, సామ వెంకటరెడ్డి పాల్గొన్నారు.