రంగారెడ్డి

స్ట్రీట్ వెండర్స్ వివరాలను నమోదు చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూన్ 3: తోపుడు బండ్ల వ్యాపారస్థులు వివరాలను నమోదు చేసుకోవాలని కుత్బుల్లాపూర్ సర్కిల్ ఇన్‌చార్జి ఉపకమిషనర్ మమత అన్నారు. శుక్రవారం కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో స్ట్రీట్ వెండర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మమత మాట్లాడుతూ వెండింగ్ జోన్స్ ఏర్పాటు కొరకు సర్వే చేయిస్తున్నామని తెలిపారు. ఈ సర్వేలో తోపుడు బండ్ల వ్యాపారస్థులంతా వివరాలను నమోదు చేసుకుని సహకరించాలని కోరారు. సమావేశంలో టౌన్‌ప్లానింగ్ ఎసిపి శ్రీనివాస్ యాదవ్, ఎఎంఓహెచ్ ఉమారాణి, డిపిఓ సంధ్య, ఎస్సై శ్రీనివాస్, స్ట్రీట్ వెండర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శాలివాహన, జయశ్రీ, చందన, సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు దయానంద్, రెడ్డీస్ ఫౌండేషన్ సభ్యులు మదుసూదన్‌రెడ్డి, కమ్యూనిటీ ఆర్గనైజర్‌లు మురళి, సురేశ్, శ్రీ్ధర్‌రెడ్డి, ముస్త్ఫ, ప్రసాద్, ఇందిరా , సుజాత, మహిపాల్ పాల్గొన్నారు.
మీ సేవా కేంద్రాల్లో పెన్షన్ దారులు
వేలిముద్రలను చేసుకోవాలి...
కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని ఆసరా పథకం పెన్షన్ లబ్దిదారులు మీ సేవా కేంద్రాల్లో వేలి ముద్రలు, ఐరిష్‌లను నమోదు చేసుకోవాలని సర్కిల్ ఇన్‌చార్జి ఉపకమిషనర్ మమత ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీ నుండి జూలై 20వ తేదీలోపు పెన్షన్ లబ్దిదారులు వేలి ముద్రలు మరియు ఐరిష్‌లను నమోదు చేసుకుని బ్యాంక్ అకౌంట్ నెంబర్‌ను మీ సేవా కేంద్రంలో చూపించి నమోదు చేసుకోవాలని అన్నారు. ప్రతి ఆరు మాసాలకు ఓసారి వారి పెన్షన్ ఐడి లేదా ఆధార్ నెంబరు లేదా బ్యాంక్ అకౌంట్ నెంబరు మీ సేవా సెంటర్‌లో చూపించి తాను బ్రతికి ఉన్నట్లు తెలియపరిచి వేలి ముద్రలు, ఐరిష్‌ల ద్వారా నమోదు చేయించుకోవాలని తెలిపారు. ఇలా నమోదు చేసుకున్న లబ్దిదారులకు మాత్రమే తదుపరి ఆరు నెలలకు పెన్షన్ జారీ అవుతుందని చెప్పారు.
వేలి ముద్రలు, ఐరిష్‌లను నమోదు చేయించుకోవాలని పెన్షన్ దారుడు మీ సేవా సెంటర్‌కు సర్వీస్ చార్జెస్ కింద 20 రూపాయలను చెల్లించాలని, పెన్షన్ దారులు తమ వెంట ఆధార్ నెంబరుతో పాటు ఫోన్ నెంబరు వివరాలు సర్కిల్ కార్యాలయంలో పెన్షన్ సెక్షన్‌లో అందజేయాలని కోరారు.