రంగారెడ్డి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 7: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను పెద్ద సంఖ్యలో చేర్పించి నమోదు శాతాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు విద్యాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఈనెల 8 నుంచి 16 వరకు నిర్వహించే జయశంకర్ బడిబాట నిర్వహణపై ఎంఇఓలు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, సిఆర్‌పిలు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో మంగళవారం కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతం తగ్గపోతున్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి పాఠశాలలో ఇప్పుడున్న నమోదు శాతానికి అదనంగా 10 శాతంపైగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్‌వాడి కేంద్రాల్లోని పిల్లలను గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్పించడంతో పాటు నిర్దేశిత కుటుంబాలను గుర్తించి వారితో చర్చించి పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెంచేలా చర్యలు తీసుకోవాలని, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రుల సహకారం తీసుకోవాలన్నారు. పాఠశాలల ప్రారంభానికి ముందే పరిశుభ్రత, తాగునీరు, పాఠ్యపుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజన ఏర్పాట్లతోపాటు ఇతర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 13న జిల్లాలోని అన్ని పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాసం చేపట్టాలని సర్పంచ్‌లు, గ్రామస్తులు తల్లిదండ్రుల సమక్షంలో చేయాలన్నారు. గ్రామ విద్యా రిజిస్టర్లను అప్‌డేట్ చేయాలని, రిజిస్టర్లలో 29కాలముల వరకు అన్ని వివరాలు సంపూర్ణంగా పూరించాలని 14 ఏళ్లలోపు పిల్లల వివరాలు నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఈ రిజిస్టరు విద్యా శాఖకు కొలమానం లాంటిదన్నారు. వారంలోగా రిజిస్టర్లన్నీ అప్‌డేట్ చేయాలని, వచ్చేనెలలో పరిశీలిస్తామన్నారు.జెసి ఆమ్రపాలి మాట్లాడుతూ, జిల్లాలో గత సంవత్సరం ఏమాత్రం నమోదుకాని పాఠశాలలను గుర్తించామని, ఆయా పాఠశాలల్లో నమోదు శాతాన్ని పెంచడానికి ఎంఇఓలు బాధ్యలు తీసుకోవాలన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ మాట్లాడుతూ, ఈనెల 8న గ్రామాల్లో ర్యాలీలు, ఇంటింటికి వెళ్లి నమోదు నిర్వహించాలని, 9న నమోదుతోపాటు పాఠశాలల్లో వౌలిక సదుపాయాలపై గ్రామస్తులతో చర్చించడం, పాఠశాల అభివృద్ధి ప్రణాళికలను తయారు చేసుకోవాలని, 10న స్వచ్ఛ పాఠశాలల కింద బడులను పరిశుభ్రం చేయడం, సున్నం వేయడం నిర్వహించాలన్నారు. 13న సామూహిక అక్షరాభ్యాసంతోపాటు విద్యార్థులకు పలకలు, నోటు పుస్తకాలు, పెన్సిళ్లు పంపిణీ చేయాలని, 14న బడిబాటపై సవివరమైన నివేదికలు సమర్పించాలని, 15, 16న గ్రామ విద్యా రిజిస్టర్లను అప్‌డేట్ చేయాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి శ్రీనివాస్, సిఎంఓ రాఘవేంద్రచారి, డిప్యూటీ డిఇఓ పాల్గొన్నారు.