రంగారెడ్డి

ప్రహరీ కూల్చిన వారిపై కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కులకచర్ల, జూన్ 9; ప్రభుత్వ స్థలాలను ఎవరైనా ఆక్రమిస్తే కూల్చాల్సింది ప్రభుత్వ అధికారులని, అలాంటిది ప్రభుత్వ భవనాన్ని ప్రైవేటువారు వచ్చి కూల్చితే అది మనకు చెంపపెట్టులాంటిదని, ఈ విషయంలో ఉదాసీనత పనికిరాదని జిల్లా సంయుక్త పాలనాధికారి ఆమ్రపాలి అన్నారు. కులకచర్ల మండలకేంద్రంలో ఎంపిడిఓ కార్యాలయ ప్రహరీగోడ కూల్చివేత ప్రదేశాన్ని ఆమె గురువారం పరిశీలించారు.
కూల్చివేతకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవని చెబుతూ కూల్చిన జెసిబి తాలుకూ వ్యక్తుల వివరాలు సేకరించి వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె మండల అధికారులకు సూచించారు. కూల్చివేతకు ప్రధాన బాధ్యుడైన వ్యక్తికి సంబంధించి ఎలాంటి ఆస్తులున్నాయో సేకరించాలని చెబుతూ సినిమాహాలు (పాతది) సమీపంలోని హద్దులు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల వివరాల గురించి స్థానిక అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయగా వాటికి సంబంధించిన వివరాలేవీ లేకపోవడంతో ఆమె అధికారుల పనితీరును తప్పుబట్టారు. తహశీల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. సర్వే సంఖ్య 699లో ఆక్రమణకు గురైన వాటికి తాఖీదులు జారీ చేసి అవసరమైతే కూల్చివేయాలని సూచించారు. సుమారు ఓ గంటపాటు ఎంపిడిఓ కార్యాలయం చుట్టూ ఉన్న భూములను కలియతిరిగారు. తహశీల్దార్ కార్యాలయం సమీపంలోని ఇటుకబట్టీని చూసి వీరికి తాఖీదులు జారీ చేశారా ఫాలోఅప్ చేశారా అంటూ రెవెన్యూ అధికారులను సంజాయిషీ కోరారు. పాత రక్షకభట నిలయం ఎందుకు ప్రైవేటు వారి పరిధిలోకి వచ్చింది. కొత్త రక్షకభట నిలయం ఏ సర్వేసంఖ్యలో ఉందని అడిగి తెలుసుకున్నారు. అన్యాక్రాంతం అయిన భూములు వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆమె ఆక్రమణదారుల్ని హెచ్చరించారు. తహశీల్దార్ కార్యాలయం అధికారుల పనితీరుపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈమె వెంట చేవెళ్ల రెవెన్యూ డివిజన్ అధికారి చంద్రమోహన్, సర్వే ఇన్‌స్పెక్టర్ రాంచందర్, తహశీల్దార్ సుభాషిణి ఉన్నారు.