రంగారెడ్డి

డబ్బుల కోసం స్నేహితుడి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూన్ 10: డబ్బుల విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ చోటుచేసుకుని స్నేహితున్ని హత్య చేసిన నిందితున్ని దుందిగల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దుందిగల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బాలానగర్ జోన్ ఇన్‌చార్జి డిసిపి సాయిశేఖర్, పేట్‌బషీరాబాద్ ఏసిపి అశోక్‌కుమార్, సిఐ వెంకటేశ్వర్లు నిందితుని వివరాలను వెల్లడించారు. ఐడిపిఎల్ కాలనీ, దిల్‌ఖుష్‌నగర్‌లో నివాసముండే సయ్యద్ సమీర్ (22) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తాడు. కర్ణాటక రాష్ట్రం, గుల్బర్గ జిల్లా కత్నూర్ గ్రామానికి చెందిన హన్మంత్‌రాయ్ దయానంద్ (22) క్లీనర్‌గా పనిచేస్తాడు. గుల్బర్గ నుండి బతుకుదెరువు నిమిత్తం నగరానికి వచ్చిన దయానంద్ నాంపల్లిలోని ఖాజా ట్రావెల్స్‌లో క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. దొమ్మరపోచంపల్లి గ్రామం 120 గజాల బస్తీ, సాయిపూజ కాలనీలో నివాసముండే సమీర్ సోదరుడు సిద్దూ ఇంట్లోనే దయానంద్ ఉంటున్నాడు. సిద్దూ వద్దకు సయ్యద్ సమీర్ వస్తుండేవాడు. ఈక్రమంలో దయానంద్‌కు సమీర్‌కు మధ్య స్నేహం కుదిరింది. కాగా దయానంద్ వద్ద సయ్యద్ సమీర్ ఉద్యోగం పెట్టిస్తానని రూ.2 వేలను తీసుకున్నాడు. కాగా ఉద్యోగం చూపకపోవడం, డబ్బులు కూడా ఇవ్వకపోవడంతో సమీర్, దయానంద్ మధ్య గొడవలు మొదలయ్యాయి. కాగా జనవరి 6న సాయిపూజ కాలనీలో దయానంద్, సమీర్ కలిసి మద్యం సేవించారు. అక్కడే ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో గొడవ జరిగింది. అక్కడి నుండి మల్లంపేట్ గ్రామంలోని కత్వ చెరువు వద్దకు వెళ్లి మళ్లీ ఇద్దరు కలిసి మద్యం సేవించారు. అక్కడ మరోసారి ఇద్దరి మధ్య వివాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న దయానంద్ సమీర్ తలపై బండరాయితో మోది హత్య చేశాడు. గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసునమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. జనవరి 6 నుండి కనిపించకుండా పోయిన దయానంద్‌పై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఈ మేరకు పోలీసులు దయానంద్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చాకచక్యంగా హత్యకేసును ఛేదించిన దుందిగల్ పోలీసులను డిసిపి సాయిశేఖర్ అభినందించారు.