రంగారెడ్డి

పనిమనిషిపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జూన్ 16: ఇంట్లో పనిచేసే పనిమనిషిపై యజమాని అత్యాచారం చేసిన సంఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మాదాపూర్ సర్వే ఆఫ్ ఇండియా కాలనీలోని ఎంఎసఆర్ అపార్ట్‌మెంట్‌లో ఓ మహిళ(27) పని మనిషిగా చేస్తోంది. గతంలో పనిచేసి మానివేసి మళ్లీ ఈఏడాది జనవరిలో పనిలో చేరింది. ఇంటి యజమాని సోమిరెడ్డి(72) తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని భర్తకు, ఆడపడుచుకు చెప్పింది. భర్తతో కలిసి బాధితురాలు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఎస్‌టి కావడంతో నిందితుడిపై అత్యాచారంతోపాటు అట్రాసిటి కేసు నమోదు చేశామని ఎస్‌ఐ వెంకటరెడ్డి తెలిపారు. విద్యుత్‌శాఖలో పనిచేసి సోమిరెడ్డి పదవీవిరమణ చేశారని, కేసు దర్యాప్తులో ఉందని పేర్కొన్నారు.