రంగారెడ్డి

కడిగిన ముత్యం ప్రసాద్‌కుమార్‌ను విమర్శించడం సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జూన్ 16: కడిగిన ముత్యం లాంటి మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ను విమర్శించడం సరికాదని చేవెళ్ల ఎమ్మెల్యే కె.యాదయ్యకు వికారాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు హితవు పలికారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ వి.సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ.సుధాకర్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కె.అనంత్‌రెడ్డి, డిసిసి ఉపాధ్యక్షుడు నర్సింలు, మున్సిపల్ కౌన్సిలర్లు ఇక్బాల్, మధుకర్, పిఎసిఎస్ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బి.రాజశేఖర్‌రెడ్డి, నాయకుడు శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ ఎక్కడా చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్యను విమర్శించలేదు, ఆరోపణలు చేయలేదని, యాదయ్య అనవసరంగా విమర్శలు చేయడమేమిటని ప్రశ్నించారు. ప్రసాద్‌కుమార్ వ్యక్తిగతంగా ఎవ్వరికీ వ్యతిరేకం కాదని చెప్పారు. ఎమ్మెల్యే యాదయ్య చేసినన్ని తప్పులు ప్రసాద్‌కుమార్ చేయలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ నుండి గెలిచి పార్టీ నాయకులు, కార్యకర్తలను మోసం చేసి టిఆర్‌ఎస్‌లోకి వెళ్లాడని విమర్శించారు. సిఎం కేసిఆర్ ఎపుడు దగ్గరయ్యాడో యాదయ్య ఆలోచించుకోవాలని స్పష్టం చేశారు. ఎంపిటిసి నుంచి ఎమ్మెల్యే దాకా రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది కాంగ్రెస్ అనే విషయాన్ని మరువరాదని అన్నారు. డబుల్ బెడ్‌రూం, అర్హులందరికీ పింఛన్లు తదితర హామీల విషయంలో మాట నిలబెట్టుకోని సిఎం కేసిఆర్‌ను విమర్శిస్తే ఎందుకు కోపం వస్తోందని యాదయ్యను నిలదీశారు. ఉప ఎన్నిక సమయంలో దివంగత సిఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. పవిత్రమైన టిటిడి సభ్యుడి పదవి ఇస్తే స్కామ్ చేశావని, కేసు ఇంకా కొనసాగుతూనే ఉందని వివరించారు. ఏదైనా రాజకీయం చేసుకోవాలనుకుంటే చేవెళ్లలో చేసుకోవాలి తప్ప వికారాబాద్‌లో కాదని తెలిపారు. స్థానికంగా టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజీవరావు ఉన్నారని, అది ఎరుగకపోవడం ఆశ్చర్యకరమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ను గెలిపించుకుని సత్తా చూపుతామని ధీమా వ్యక్తం చేశారు. ఐదు సంవత్సరాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ప్రసాద్‌కుమార్‌ను యాదయ్య ఉద్దేశ్యపూర్వకంగానే విమర్శించాడని ధ్వజమెత్తారు. టిఆర్‌ఎస్‌లోకి వెళ్లిన యాదయ్య ముందుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. చేవెళ్ళ నియోజకవర్గంలో ఎంతో మంది పేదలుండగా సొంత కుటుంబానికి ట్రాక్టర్ తీసుకోవడం యాదయ్య చిత్తశుద్ధి చాటుతోందని విమర్శించారు. సిఎం కేసిఆర్ దత్తత తీసుకున్న గ్రామానికి రాయితీలను, పథకాలను ఇస్తే మిగతా రాష్ట్రంలోని పేదల సంగతేమిటని ప్రశ్నించడంలో తప్పేముందని అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని విలువైన భూములమ్మి నిధులను ఇతర జిల్లాలకు తరలించడమేమిటని ప్రశ్నించారు. జిల్లాకు వచ్చే ప్రాణహిత నీటిని అడ్డుకున్న సిఎం కేసిఆర్‌ను మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. నీరే లేనిది వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసే మిషన్ భగీరథకు నీరెక్కడ నుండి వస్తుందో చెప్పాలని అన్నారు. 2019 ఎన్నికల్లో వికారాబాద్ నుంచి టికెట్ పొంది ఎన్నికల్లో పోటీ చేయాలని యాదయ్యకు సవాల్ విసిరారు.