రంగారెడ్డి

ఓయు పిజి సెట్ ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాచారం, జూన్ 24: ఓయు పిజి సెట్ ఫలితాలను శుక్రవారం ఓయు అతిథిగృహంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఇ.సురేశ్‌కుమార్ విడుదల చేశారు. 2016-17 విద్యాసంవత్సరానికి ఎంఎ, ఎంకామ్, ఎమ్మెస్సీ ప్రవేశానికి ఓయు, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం కోసం నిర్వహించిన పరీక్షలకు 79591మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 94.26 శాతంతో 61732 మంది విద్యార్థులు అర్హత సాధించారు. పిజి సెట్ డైరక్టర్ ప్రొఫెసర్ అశోక్ మాట్లాడుతూ ర్యాంకు కార్డులను ఓయు వెబ్‌సైట్ నుంచి పొందవచ్చునని తెలిపారు.
ఈనెల చివరి వారం నుంచి ఆప్షన్‌లు ఇచ్చుకోవడానికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. జూలై రెండవ వారం నుంచి సర్ట్ఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు.