రంగారెడ్డి

ఎడారిలా మారిన మూసీనది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంకర్‌పల్లి, ఏప్రిల్10: మండల పరిధిలోని మూసీ నదిలో చుక్కనీరు లేక ఎడారిగా మారింది. జిల్లాలో ప్రాముఖ్యత సంతరించుకున్న మూసీ- వికారాబాద్, అనంతగిరి కొండల నుంచి మొదలై గండిపేట ప్రాంతంలో కలిసిపోతుంది. నాలుగైదేళ్ల నుంచి సరైన వర్షాలు లేక మూసీ పూర్తిగా ఎండిపోయింది. దీంతో మూసీ పక్కనున్న శంకర్‌పల్లి, ఎల్వర్తి, పొద్దాటూరు, ఫత్తేపురం, బుల్కాపురం, మోకిల, జనవాడ, టంగటూరు ఇతర అనుబంధ గ్రామాలకు చెందిన వేలాది ఎకరాల ఆయకట్టు బోసిపోయాయి. దీనికితోడు ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంవల్ల పూడికలు తీయకపోవడం, పర్యవేక్షణ లోపంతో నీరు నిల్వవుండే అవకాశం చేజారిపోతుంది. పొద్దాటూరు శివారులోని పెద్దచెరువు కూడా పూర్తిగా ఎండిపోయింది. చెరువులోకి నీరొచ్చే కాలువలను అక్రమార్కులు ఇసుకకోసం అడ్డుకోవడంతో వర్షం నీరు నిల్వ వుండడంలేదు. ఇంత జరుగుతున్నా పాలకులు, మండల అధికారులు ఏ చర్యలు తీసుకోవడంలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. పరిస్థితి ఇలావుంటే మిషన్ కాకతీయ లక్ష్యం ఎలా నెరవేరుతుందని అంటున్నారు.
ఇలావుండగా స్థానిక గొల్లవాగు, తీగలవాగు కూడా ఎండిపోయాయి. కొన్నిచోట్ల కబ్జాలు అవుతున్నాయి. జలయజ్ఞం పేరిట గతంలో మంజూరైన లక్షలాది రూ.లు అక్రమార్కుల జేబుల్లో పడ్డాయి. అయినా విచారణ కాలేదు. ప్రస్తుతం సిఎం కెసిఆర్ ఆశయం నెరవేరాలంటే అధికారులు నిజాయతీగా పనిచేయాలి. ఈసారి వర్షాలు పడకపోతే రైతులకు, పశుపక్ష్యాదులకు నీరు లభించే అవకాశం లేదు. ఇప్పటికే నీటి కొరతతో విలవిల్లాడుతున్నారు. మూసీ పరివాహక భూములన్నీ బీడువారి పోతున్నాయి. నీటితో కళకళలాడే నదులు, చెరువులు ఎడారిలా కనిపిస్తున్నాయి. కరువు రాకుండా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలి.