రంగారెడ్డి

నగర సమగ్ర అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూన్ 30: హైదరాబాద్ మహానగర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఉప్పల్ సర్కిల్ కార్యాలయంలో అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారుల సమన్వయ సమావేశంలో పాల్గొని సర్కిల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. శాఖల వారీగా చేపట్టిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. నీది నాదంటూ తప్పించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా బాధ్యతతో సమన్వయంగా క్షేత్రస్థాయిలో పని చేస్తే సత్ఫలితాలు వస్తాయని అన్నారు. జల మండలి, ఇంజనీరింగ్, విద్యుత్, టెలీఫోన్, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అభివృద్ధి పనుల కోసం రహదారి మధ్యలో పనులు చేపడితే అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా ముళ్లచెట్లు పెట్టకుండా ఎర్రని బ్యానర్లు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో మ్యాన్‌హోల్స్ వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడానికి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. చేపట్టే పనులను ఎప్పుడు పూర్తిచేస్తారనే పూర్తి వివరాలను బోర్డుపై తెలియజేయాలని సూచించారు. ట్రాఫిక్ అంతరాయం, ప్రమాదాలకు కారణమవుతున్న రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, ఇళ్ల నిర్మాణాలు, డబ్బాలను పక్కకు జరుపాలని, లేదంటే తొలగించాలని విద్యుత్, పోలీసు, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఆదేశించారు. ప్రయాణికుల సౌకర్యార్థం అవసరమైన ప్రాంతాలలో మాడల్ బస్‌షెల్టర్లను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ, ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. జాతీయ రహదారిలో ఇసుక లారీలను అక్రమ పార్కింగ్ చేయకుండా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులకు తెలిపారు. రోడ్డు మధ్యలో వాటర్ పైపులైన్ల వాల్వు గుంతలపై, డ్రైనేజీ మ్యాన్‌హోల్స్‌పై మూతలను ఏర్పాటు చేయాలని జల మండలి, జిహెచ్‌ఎంసి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా పరిసరాల పరిశుభ్రతకోసం పొదుపు గ్రూపు మహిళల సహకారంతో శానిటేషన్ సిబ్బంది బాగా పనిచేయాలని పేర్కొన్నారు. ఆయా శాఖల పరిధిలో బాగా పని చేసిన సిబ్బంది, అధికారులను గుర్తించి సన్మానం చేసి అభినందించాలని అన్నారు. రామంతాపూర్ కెసిఆర్‌నగర్ భూములలో అక్రమ నిర్మాణాలపై పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో పూర్తి వివరాలను తెలుసుకున్నారు. మూసీ ప్రక్షాళ, అభివృద్ధి కోసం 12ఏళ్ల క్రితం హెచ్‌ఎండిఏ స్వాధీనం చేసుకున్నట్లు గజిట్ నోటిఫికేషన్ వచ్చిందని, డీనోటిఫై చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇట్టి స్థలాలపై హెచ్‌ఎండిఏ కమిషనర్ చిరంజీవులతో ఫోన్‌లో మాట్లాడితే డీనోటిఫై చేయాలంటే సమయం పడుతుందని చెప్పినట్లు సమాచారం. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ కె.విజయకృష్ణ, ఇఇ నాగేందర్‌యాదవ్, ఏఎంహెచ్‌ఓ స్వామి, డిఇఇ హన్మంత్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఏసిపి నాగిరెడ్డి, ఎలక్ట్రికల్ ఇఇ హరికృష్ణ, ఎఇఇ శ్రీనివాసరావు, విద్యుత్ డిఇ శ్రీనాథ్, ఏడిఇ యుగంధర్, జల మండలి జిఎం కిరణ్, ఎజిఎం డేవిడ్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ జంగయ్య, ఇన్‌స్పెక్టర్ నర్సింహారెడ్డి, విఓ కృష్ణప్రసాద్, ఎఇలు దామోదర్, శ్రావణ్‌కుమార్, స్రవంతి, బాజి పాల్గొన్నారు.