రంగారెడ్డి

సిఎం కేసిఆర్ బస్సులో మొరాయించిన మైక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జూలై 8: సిఎం కేసిఆర్ ప్రయాణించిన బస్సులో మైక్, అడియో సిస్టం మొరాయించడంతో టెన్షన్ పడటం ఆర్టీసీ అధికారుల వంతైంది. వివరాలలోకి వెళితే తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నల్గొండకు సిఎం కేసిఆర్ బస్సులో బయలుదేరారు. సిఎం ప్రయాణించిన బస్సు బాగోగులు ఆర్టీసీ చూస్తోంది. ఆ బస్సు హైదరాబాద్-1 డిపోలో ఉంటుంది. సిఎం కార్యక్రమం ఉన్నందున గురువారం బస్సును పరిశీలించి సిద్ధం చేశారు. తీరా శుక్రవారం ఉదయం సిఎం కేసిఆర్ బస్సులో ఉన్నపుడు మైక్, ఆడియో సిస్టం మొరాయించింది. ఆ విషయమై వికారాబాద్ ఆర్టీసీ డిపోలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రంగారెడ్డి రీజినల్ మేనేజర్ గంగాధర్‌కు ఫోన్ రావడంతో టెన్షన్ మొదలైంది. అసలే సిఎం ప్రయాణిస్తున్న బస్సు, అతని పరిధిలోని డిపోకు చెందిన బస్సు కావడంతో టెన్షన్ మరింతగా పెరిగింది. అసలు కారణమేమిటో కాల్‌పైన కాల్ చేసి ఆరా తీశాడు.
గంగాధర్ వెంట వచ్చిన డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ శ్రీదేవి, డిప్యూటీ ట్రాఫిక్ మేనేజర్‌లు సైతం ఆలోచనలో పడ్డారు. గురువారం బస్సును పరిశీలించారా అంటూ డిసిఎంఇ శ్రీదేవిని ప్రశ్నించారు. ఎలక్ట్రీషియన్‌ను వెంటనే మార్చాలని ఆమెను ఆదేశించారు. అక్కడే ఉన్న హైదరాబాద్-1 డిపో మేనేజర్ భీంరెడ్డి సైతం టెన్షన్‌కు గురయ్యాడు.