రంగారెడ్డి

హరితహారాన్ని మహోద్యమంలా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, జూలై 10: హరితహారాన్ని ఒక మహోద్యమంలా చేపట్టి పచ్చటి వాతావరణం కల్పించాలని ఎంపి కొండా విశే్వశ్వర్ రెడ్డి అన్నారు. చందానగర్ పిజెఆర్ స్టేడియంలో ఆదివారం చేపట్టిన హరితహారం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్లతో కలిసి ఎంపి మొక్కలు నాటారు. ఎంపి మాట్లాడుతూ నాటిన మొక్కలను సంరక్షించడం గొప్ప అవకాశంగా భావించాలని అన్నారు. పచ్చదనాన్ని పెంచకుంటే భవిష్యత్‌లో తీవ్ర వాతావరణ సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి, మాదాపూర్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ మేక రమేష్, కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్, గచ్చిబౌలి కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబ, హఫీజ్‌పేట కార్పొరేటర్ వి.పూజితజగదీశ్వర్ గౌడ్, జోనల్ కమిషనర్ బివి గంగాధర్ రెడ్డి, జోనల్ ఎస్‌ఇ మోహన్‌సింగ్, స్టేడియం అధికారులు హాజరయ్యారు. టిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు బొబ్బ విజయ్ రెడ్డి, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు బి.కరుణాకర్ రెడ్డి, కె.సునీతా ప్రభాకర్‌రెడ్డి, కె.మమత, సి.యాదగిరి గౌడ్, వాలా హరీష్ రావు,పంతులు, పారునంది శ్రీకాంత్, సులోచన, వినోదారెడ్డి పాల్గొన్నారు.
చెట్లతోనే మనిషి మనుగడ
మల్కాజిగిరి: చెట్లతోనే మనిషి మనుగడ ముడిపడి ఉందని, ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటేందుకు ముందుకు రావాలని గౌతంనగర్ డివిజన్ కార్పొరేటర్ శిరిషా పిలుపునిచ్చారు. ఆదివారం డివిజన్ పరిధిలోని మల్లికార్జున నగర్ కమ్యూనీటి హాల్ వద్ద మల్లిఖార్జున నగర్ సంక్షేమ సంఘం, లేత చారిటబుల్ ట్రస్టు, షైనింగ్ స్టార్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కార్పొరేటర్ శిరిషా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇక్కడి గ్రౌండ్స్‌లో, రోడ్ల వెంబడి మొక్కలు నాటారు. ప్రస్తుతం మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున సాగుతోందని అన్నారు. కార్యక్రమంలో మల్కాజిగిరి సిఐ జనార్ధన్‌రెడ్డి, ఎస్‌ఐలు శంకరయ్య, నర్సయ్య, టిఆర్‌ఎస్ నాయకులు ఆర్.జితేందర్‌రెడ్డి, సిద్దిరాములు, బైరు అనిల్‌కుమార్, విపి రెడ్డి పాల్గొన్నారు.
హరితహారంలో పాల్గొన్న హీరో సుమన్
జీడిమెట్ల: షాపూర్‌నగర్‌లోని జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఆదివారం నిర్వహించిన హరితహారంలో హీరో సుమన్ పాల్గొన్నారు. బాలానగర్ ఎసిపి నంద్యాల నర్సింహారెడ్డి, జీడిమెట్ల సిఐ చంద్రశేఖర్, విద్యార్థులతో కలిసి సుమన్ మొక్కలను నాటారు. సుమన్ మాట్లాడుతూ జీడిమెట్ల ప్రాంతంలో అత్యధికంగా పరిశ్రమలు ఉన్న తరుణంలో పర్యావరణాన్ని పెంచుకోవాలని అన్నారు. కాలుష్య నివారణకు చెట్లు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ప్రతిఒక్కరూ మొక్కలను నాటి బాధ్యతతో పెంచాలని సూచించారు.
జోరుగా హరితహారం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో హరిత హారం కార్యక్రమం ఆదివారం జోరుగా సాగింది. కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని బాచుపల్లి గ్రామంలోని రెణుకఎల్లమ్మ ఆలయం సమీపంలో మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ఆగం రాజు ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే కెపి వివేక్, ఎంపిపి సన్న కవిత హాజరై మొక్కలను నాటారు.
జీడిమెట్ల డివిజన్ కుత్బుల్లాపూర్ గ్రామం భూమిరెడ్డి కాలనీ, రామరాజునగర్, శ్రీని ఎన్‌క్లేవ్ కాలనీ, పేట్‌బషీరాబాద్ క్యాంటిన్ పార్క్‌సూరారం డివిజన్ వేమారెడ్డి కాలనీలలో ఎమ్మెల్యే కెపి వివేక్ హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. వివేక్ మాట్లాడుతూ హరిత హారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని సూచించారు. ప్రతి చోట, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలను నాటాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరిత హారం కార్యక్రమం గతంలో ఏ ప్రభుత్వం చేపట్టలేదని పేర్కొన్నారు. మొక్కలను నాటడమే కాకుండా బాధ్యతతో పెంచాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ఎంపిపి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
జగద్గిరిగుట్టలో..
జగద్గిరిగుట్ట శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ఆవరణలో స్థానిక కార్పొరేటర్ జగన్ మొక్కలను నాటారు. ప్రతిఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. ఆలయ కమిటీ సభ్యులు లక్ష్మన్‌చారి, రాజశేఖర్ చారి, శ్రీనివాస్, బాలబ్రహ్మం, మనోహర్ చారి, సదానంద్, శ్రీశైలం, తిరుపతి పాల్గొన్నారు.
మొక్కలు నాటడం అందరి బాధ్యత
హయత్‌నగర్: పర్యావరణ పరిరక్షణకు అందరు విధిగా మొక్కలు నాటాలని లింగోజిగూడ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం డివిజన్ పరిధిలోని సాయిరాంనగర్ కాలనీ, గ్రీన్‌పార్క్ కాలనీ, విజయపురి కాలనీలలో కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డివిజన్ పరిధిలోని అన్ని కాలనీలు పచ్చదనంగా ఉండాలని చెప్పారు. ప్రతి ఒక్కరూమొక్కలు పెంచాల్సిన బాధ్యత ఎంతైన ఉందని అన్నారు. మొక్కలు అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని పేర్కొన్నారు. డివిజన్ అధ్యక్షుడు శ్రీ్ధర్‌గౌడ్, సాయిరాంనగర్ కాలనీ అధ్యక్షుడు కోడి రాజశేఖర్, నరేందర్‌రెడ్డి, రాజు, పర్వత్‌రెడ్డి, శ్రీనివాస్, మాధవరావు, నాయకులు మాల్కాజిగిరి ఆనంద్, కందికంటి శ్రీ్ధర్‌గౌడ్, కోటగిరి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
ప్రతి ఇంటికి మొక్కలు నాటాలి
అల్వాల్: ప్రతి ఇంటికి మొక్కలు నాటాలని మచ్చబొల్లారం 133 డివిజన్ కార్పొరేటర్ రాజ్‌జితేంద్రనాథ్ చెప్పారు. ఆదివారం డివిజన్ పరిధిలోని ఐదు కాలనీవాసులకు మొక్కలు పంపిణీ చేసి నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. విధిగా ప్రతి ఇంట్లో మొక్కలు నాటాలనీ కాలనీ సంక్షేమ సంఘం, బస్తీల సంక్షేమ సంఘం ప్రతినిధులు జోక్యం చేసుకొని మొక్కలు నాటాలని, మొక్కలను మున్సిపల్ కార్యాలయంలో ఉచితంగా పంపిణీ చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో అల్వాల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ అడప రమేష్ పాల్గొన్నారు. సూర్యనగర్‌లో గ్రేటర్ కోఆప్షన్ సభ్యురాలు గొట్టిముక్కల జ్యోతి ఇంటింటికి తిరిగి మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు.
వెంకటాపురం డివిజన్‌లో..
వెంకటాపురం డివిజన్ సుభాష్‌నగర్‌లో కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ మొక్కలు నాటారు. ఆదివారం కాలనీ సంక్షేమ సంఘం అద్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గోన్నారు. డివిజన్ పరిధిలో ఇంటి ఇంటికి మొక్కలు పంపిణీ చేయ్యనున్నట్లు చెప్పారు.
చేరుూ చేరుూ కలుపుదాం..
హరితహారాన్ని విజయవంతం చేద్దాం
ఉప్పల్: చేరుూ చేరుూ కలుపుదాం.. హరితహారాన్ని విజయవంతం చేద్దామని జడ్పీటిసి మంద సంజీవరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం బోడుప్పల్ పురపాలక సంఘంలో అధికారులతో కలిసి కాలనీ సంక్షేమ సంఘాల సభ్యులకు ఉచితంగా మొక్కలను పంపిణీ చేశారు. గుంతలు తీశాం.. మొక్కలు ఇస్తామని నాటి పరిరక్షించే బాధ్యత ప్రజలపై ఉందని అభిప్రాయపడ్డారు. ప్రాణవాయువునిచ్చే చెట్లను కాపాడాలని పిలుపునిచ్చారు. పురపాలక సంఘం పరిధిలోని బోడుప్పల్, చెంగిచర్ల, పీర్జాదిగూడ పురపాలక సంఘం పరిధిలోని పర్వతాపూర్, మేడిపల్లి, ఇతర ప్రాంతాలలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉద్యమంలా హరితహారాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. బిల్డర్స్ అసోసియేషన్, స్వచ్ఛంద సంస్థలు ట్రీగార్డులను ఇవ్వడానికి ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. అవసరమైన మొక్కలను అందిస్తామని ఖాళీ ప్రదేశాలు, ఇళ్ల ఆవరణలో, రహదారులకు ఇరువైపుల నాటి వాటిని పెంచాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపిటిసి సభ్యులు ఊటుకూరి శారద కిషన్‌చారి, నత్తి జంగమ్మ మైసయ్య, శోభ ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.
గుంతలు తీశాం..మొక్కలు నాటాలి
జిహెచ్‌ఎంసి ఉప్పల్ సర్కిల్‌లో హరితహారం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు డిప్యూటి కమిషనర్ విజయకృష్ణ వెల్లడించారు. ఆదివారం సర్కిల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కార్పొరేటర్లు, అధికారులు పాల్గొని హరితహారం విజయవంతం కోసం ఏర్పాట్లను సమీక్షించారు. ఉప్పల్ రాఘవేంద్రనగర్‌లో ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, కార్పొరేటర్ జి.సరస్వతి, అధికారులతో ప్రారంభమయ్యే హరితహాం మధ్యాహ్నం వరకు హబ్సిగూడ, రామంతాపూర్, ఉప్పల్ డివిజన్‌లో 3600 మొక్కలను నాటాలని డిసి పిలుపునిచ్చారు. రామంతాపూర్ శ్రీనివాసపురం ఆనందజ్యోతి హైస్కూల్ వద్ద దూరదర్శన్ కేంద్రం న్యూస్ రీడర్ శాంతి స్వరూప్, ఇతర ప్రాంతాలలో కార్పొరేటర్లు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. నిర్ణీత కాలనీలలోని ఓపెన్ స్థలాలలో, రహదార్లు, కార్యాలయాలలో గుంతలు తీశామని, ఉచితంగా పంపిణీ చేస్తున్న మొక్కలను నాటి వాటిని పరిరక్షించాలని పేర్కొన్నారు.
అంధ విద్యార్థుల ముందు చూపు
ఘట్‌కేసర్: తమకు చూపు లేకపోయిన భవిష్యత్ తరాలకు ఉజ్వల భవిష్యత్‌ను కల్పించాలనే ముందు చూపుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన అంధ విద్యార్థులు అందరికి ఆదర్శవంతులుగా మిగిలారు. మండల పరిధి ఇస్మాయిల్‌ఖాన్‌గూడ గ్రామంలో ఇవిదా (ఇన్‌స్టిట్యూట్ ఫర్ విజువల్లీ ఇంఫైర్డ్ అండ్ డిఫరెంట్లీ ఎంబుల్డ్) కు చెందిన అంధ విద్యార్థులు తమ సంస్థ పరిసరాలలో వందకుపైగా మొక్కలు నాటారు. చెట్లు అంతరించి పోయి ఇప్పటికే వర్షాలు తగ్గుముఖం పట్టాయని, దింతో పంటలు పండక అన్ని రకాల ఆర్ధిక ఇబ్బందులకు ప్రజలు గురవతున్నారన్నారు. తమకు చూపు లేకపోయిన ముందు చూపుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు అంధ విద్యార్ధులు పేర్కొన్నారు. అంధ విద్యార్ధులతో పాటు నిర్వాహకులు సుమ, థామస్‌రెడ్డి, సురేష్, సుధీర్ పాల్గొన్నారు.
బాలానగర్‌లో..
బాలానగర్: కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ కాండూరీ నరేంద్ర ఆచార్య అన్నారు. హరితహరంలో భాగంగా ఆదివారం బాలానగర్ డివిజన్ పరిధిలోని సిబి ఆర్‌నగర్ ప్రభుత్వ పాఠశాల, శ్మాశాన వాటిక, వినాయక్‌నగర్, పోలీస్ క్వాటర్స్ తదితర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమానికి ఆయనతో పాటు బాలానగర్ ఏసిపి నంద్యాల నర్సింహారెడ్డి, సిఐ భిక్షపతిరావు పాల్గొని మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి భావితరాలను కాలుష్య రహిత సమాజాన్ని అందించాలని అన్నారు. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, మహేందర్‌రెడ్డి, నాయకులు బాలరాజ్, ప్రసాద్, యాదగిరి, సుధాకర్‌రెడ్డి, ఎడ్ల మోహన్‌రెడ్డి, రాంచందర్ ముదిరాజ్, చంద్రపాల్, వెంకటస్వామి, ఎలిజాల యాదగిరి, దారం సతీష్ పాల్గొన్నారు.
మన్సూరాబాద్‌లో..
వనస్థలిపురం: కాలుష్య నివారణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి అన్నారు. హరితహారంలో భాగంగా డివిజన్ పరిధిలోని కాస్మోపాలిటన్‌కాలనీ, చంద్రపురికాలనీ, మధురానగర్, లెక్చరర్స్‌కాలనీ, రాజరాజేశ్వరీకాలనీ, శివం హిల్స్, విష్ణుపురికాలనీల్లో కాలనీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షుడు పోచబోయిన జగదీష్ యాదవ్, చుక్కమెట్టు శ్రీకాంత్‌రెడ్డి, గుంతకండ్ల రాజశేఖర్‌రెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, కృష్ణాగౌడ్, వెంకటేష్‌గౌడ్, కె.మల్లేష్‌గౌడ్ పాల్గొన్నారు.
కాప్రా సర్కిల్‌లో..
కుషాయిగూడ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా తలపెట్టిన హరితహారాన్ని ప్రతి ఒక్కరూ ఉద్యమంలా చేపట్టాలని పాండాల శివకుమార్‌గౌడ్ కోరారు. కాప్రా సర్కిల్ పరిధిలోని చర్లపల్లి డివిజన్ న్యూవిరాట్‌నగర్, నేహ్రునగర్, జెకెనగర్, భారత్‌నగర్ కాలనీ ప్రజల సహాకారలతో వెయ్యి మొక్కలను నాటారు. చర్లపల్లి డివిజన్‌లో మేయర్ రామ్మోహన్ ఆదేశాల మేరకు ప్రతి కాలనీలో మొక్కల నాటి సంరక్షించాలని అధ్యక్షులకు సూచించారు. అధ్యక్ష కార్యదర్శులు అశోక్, సుధీర్, శ్రీను, జానకీరామ్, రమేష్, అంజనేయులుగౌడ్, శివమ్మ, సత్యనారాయణ శ్రీనివాస్, రమేష్, శ్రీకాంత్‌గౌడ్, సాయిబాబాగౌడ్, శ్రావణ్‌గౌడ్, కిరణ్‌గౌడ్ పాల్గొన్నారు.
ఎఎస్‌రావునగర్ డివిజన్‌లో..
ఎఎస్‌రావునగర్ డివిజన్‌లో కార్పొరేటర్ పావనిరెడ్డి అధ్వర్యంలో హరితహారం కార్యక్రమం ఉద్యమంలా చేపట్టాలని ప్రజలకు సూచించారు. ఎఎస్‌రావునగర్ డివిజన్ బిజెఆర్, జైజవాన్‌నగర్, జమ్మిగడ్డ, విరాట్‌నగర్ కాలనీ ప్రజలతో టిఆర్‌ఎస్ ఉప్పల్ నియోజకవర్గ ఇన్‌చార్జి బేతి సుభాష్‌రెడ్డి చెతులమీదుగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో నాయకులు మణిపాల్‌రెడ్డి, గగన్, లక్ష్మీనారాయణ, లక్ష్మీ మణేమ్మ, సుధా, నాగేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.