రంగారెడ్డి

చరిత్ర వక్రీకరణతో దుష్పరిణామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, ఏప్రిల్ 15: అనేక వందల సంవత్సరాలుగా మనం విదేశీయుల పరిపాలనలో ఉన్న కారణంగా ఆ సంస్కృతిని మన మీదకు బలవంతంగా రుద్దే ప్రయత్నం చేశారని శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ రాష్ట్ర సంఘటనా కార్యదర్శి పతకమూరి శ్రీనివాస్ రావు అన్నారు. శుక్రవారం శ్రీ రామ నవమి పర్వదినాన రాజేంద్రనగర్ మండలం బండ్లగూడ జాగీర్ శ్రీ శారదాధామంలో శ్రీ సరస్వతీ విద్యాపీఠ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజమైన, మనదైన చరిత్రను వక్రీకరించారని, దాని కారణంగానే నేడు మనం అనేకమైన దుష్పరిమాణాలను ఎదుర్కొంటున్నామని అన్నారు. వాస్తవంగా మన సంస్కృతి, చరిత్ర చాలాగొప్పదని ఆయన గుర్తుచేశారు. నేడు ప్రపంచంలోని అనేక దేశాలు మన సంస్కృతిని గౌరవించి, ఆచరించేందుకు ప్రయత్నం చేస్తున్నాయని పేర్కొన్నారు. అయినప్పటికీ మన జాతి పురుషులు, మన మహాత్ములు, మన పరంపర గురించి ఈనాటి తరానికి తెలియడం లేదన్నారు. మన సంస్కృతి, మన పరంపరను చాటేందుకు శ్రీ సరస్వతీ శిశుమందిరాలు పనిచేస్తున్నాయని చెప్పారు. శ్రీ రామచంద్రుడు మనకు ఆదర్శపురుషుడుని, అందుకోసం అందరూ కూడా శ్రీ రామచంద్రుని గుణగణాలను పొందాలన్నారు. ‘శ్రీరామనవమి’ పర్వదినమున శ్రీ సరస్వతీ విద్యా పీఠం ఆవిర్భవించిందని తెలిపారు. మానవాళిలో శ్రీరామునికి ఎంత గుర్తింపు ఉందో శిశు మందిరాలలో చదివిన బాలబాలికలు దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకుని రావాలన్నారు. ఈ కార్యక్రమంలో శిశు మందిర్ కార్యదర్శి బోడ్డు శ్రీనివాస్, చిన్న పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ సుదర్శన్‌రెడ్డితోపాటు ఫ్రధానాచార్యులు సంజీవ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా శ్రీ సీతారామ కల్యాణం
రాజేంద్రనగర్ మండలం బండ్లగూడ జాగీర్‌లోని శ్రీ శారదాధామంలో శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. శుక్రవారం ఉదయం స్వామివారి కల్యాణంలో ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ సుదర్శన్‌రెడ్డి, ప్రముఖ వ్యాపార వేత్త బుర్రమల్లేషం గౌడ్, శ్రీ శారదాధామం సమితి కార్యదర్శి బోడ్డు శ్రీనివాస్, ప్రధానచార్యులు సంజీవకుమార్‌తో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.